Saturday, 28 Nov, 2026

సరైన మాచింగ్ ఉంటేనే ఫ్యాషన్.

అందరిలో ప్రత్యేకంగా వుండాలని ఆశించడం సబబే కానీ అందుకోసం మనం తీసుకునే జాగ్రత్తలు ఏమిటి? మార్కెట్ లో ఒక ట్రెండ్ ఫ్యాషన్ అయినంత మాత్రాన దీన్ని ఫాలో అయిపోమని రులేముంది. మన ఎత్తు రంగు ఆకృతికి సరిపోవాలి కదా? మార్కెట్ లో వున్న ట్రెండ్ కి సొంత అభిరుచి జోడించి, రంగూ డిజైన్ ల లో మార్పులు చేస్తే అప్పుడు కొత్త వొరవడి సృష్టించినట్లు. ఖరీదైన బ్రాండెడ్ దుస్తులు కొనుక్కుంటే సరిపోదు. ఆ దుస్తులకు తగ్గ అలంకరణ […]

పిగ్మెంటేషన్ పోగొట్టే వేప నూనె.

వేప నూనె తో ఎన్ని ఉపయోగాలున్నాయో చుస్తే ఇన్నాళ్ళు దీన్ని వాడకుండా ఎందుకున్నామో అనిపిస్తుంది. సాధారణంగా వేప నూనె మొక్కలకు క్రిమి సంహారిని అని మాత్రం అనుకుంటే పొరపాటే. కొందరికి పదాల్లో పగుళ్ళు వస్తాయి. అలంటి వాళ్ళు వేప నూనె లో కాస్త పసుపు కలిపి పాదాలకు రాసుకోవాలి. అలాగే వేప నూనె హ్యాండ్ సానిటైజర్ లాగా పనిచేస్తుంది. దీన్ని ఒక స్ప్రే సీసా లో తీసుకుని సింక్ దగ్గర పెట్టుకోవాలి. చేతులు శుభ్రం చేసుకునే ముందు […]

రుచి ఆరోగ్యం ఉంటేనే ఏ వంటనయినా మెచ్చేది.

ఎన్నో దేశాల వంటకాలు రుచి చూస్తున్నాం గమనించండి. ప్రతి వంటకంలోను ఏవో పోషకాలు. ఆరోగ్యానికి మేలు చేసే అంశాలు, కోలెస్ట్రోల్ తగ్గించేవి, బరువు పెరగకుండా అదుపు చేసేవి, ఇలా ఎన్నో ప్రత్యేక అంశాలతోనే ఆ వంటకం పాప్యులర్ అవుతుంది. ఉదాహరణకు చైనా వంటకాలు నోరురిస్తాయి. వాటి ప్రత్యేకత కేవలం రుచికే పరిమితం కావు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. వెల్లుల్లి అల్లం ఈ వంటకాల్లో ఎక్కువగా  కనిపిస్తాయి. వెల్లుల్లి గుండెకు మేలు చేస్తే అల్లం జీర్ణ సంబంధ […]

శరీరాకృతికి మ్యాచ్ అయ్యే బ్యాగ్.

సందర్భానికి తగ్గట్టు దుస్తులు, నగలు తీసుకుంటారు. కానీ వేసుకొన్న దుస్తులకు తగినట్లు హ్యాండ్ బ్యాగ్ ఉంటేనే తీరుగా వుంటుంది అంటారు ఎక్స్ పర్ట్స్. శారీరాకృతికి తగ్గ హ్యాండ్ బ్యాగ్ వుండాలి. సన్నగా, పొడుగ్గా వున్న వాళ్ళు గుండ్రంగా బరువుగా వున్న బ్యాగ్ తీసుకోవాలి. అలాగే ఫోల్డేడ్ బ్యాగ్ వుండాలి. సన్నగా పొడుగ్గా వున్న వాళ్ళు గుండ్రంగా బరువుగా వున్న బ్యాగ్ తీసుకోవాలి. అలాగే ఫోల్డేడ్ బ్యాగ్లు, క్లచ్ రకాలు బావుంటాయి. వీలైనంత వరకు చిన్నవి వేసుకోకూడదు. అలాగే […]

కుర్చీ బదులు బంతి పైన కూర్చోండి.

శరీరానికి మూవ్ మెంట్ ఉంటేనే ఆరోగ్యం. గంటల కొద్దీ కదలకుండా కుర్చుని పని చేసే వాళ్ళు, కుర్చీలో కూర్చునే బదులు వ్యాయామం కోసం ఉపయోగించే బంతి పైన కూర్చోండి, ఎన్నో రకాల ప్రయోజనాలు కలుగుతాయి అని చెపుతున్నారు ఎక్స్ పర్ట్స్. బంతి పైన కూర్చుంటే వెన్ను పైన వత్తిడి పడదు. నడుము, వెన్ను నొప్పి బాధించదు. బంతి పైన కుర్చుని పని చేస్తే శరీరాన్ని బంతి సమన్మయం చేస్తుంది. అటూ, ఇటు కదలొచ్చు. దీని వల్ల కెలరీలు […]

విజయ నిర్మలకు మరో పురస్కారం.

ఒకప్పటి స్టార్ హీరోయిన్, నటిగా మంచి స్థాయిలో ఉండగానే మెగా ఫోన్ పట్టుకుని అనేక సక్సెస్ ఫుల్ సినిమాలు డైరెక్ట్ చేసిన విజయ నిర్మలకు మరు అరుదైన పురస్కారం లభించింది. భారతీయ సినీ పరిశ్రమకు ఆమె చేసిన సేవలకు గాను యురేకు చెందిన రాయల్ అకాడమీ ఆఫ్ గ్లోబల్ పీస్ ఆమెకు గౌరవ డాక్టరేట్ ప్రకటించింది. 1957 లో తోలి సారిగా వెండి తెర పైన కనిపించిన విజయనిర్మల ఆ తర్వాత తెలుగుతో పాటు అనేక తమిళ, […]

ఔషధ పోషక విలువల ముల్లంగి.

ముల్లంగి ఎరుపు తెలుపు రంగుల్లో క్యారెట్, చిలకడ దుంప లాగే వున్నా చాలా మందికి ఇష్టం వుండదు. ఇందులో ఎన్నో పోషక ఔషద విలువలున్నాయి. యాంటీ బక్టిరియల్, యాంటీ ఫంగల్ సుగుణాలు దీని సొంతం. రోగ నిరోధక శక్తిని పెంచగల ముల్లంగి విటమిన్-సి, పోటాషియం, సోడియం, తదితర ఖనిజాలు, విటమిన్లు, పిచు తో నిండి వుంటుంది. ముల్లంగి సలాడ్ గానూ, పచ్చి గాను తీసుకోవచ్చు. ఉడికించాలి అంటే తక్కు నీళ్ళు పోయాలి. ఆ ఉడక బెట్టిన నీటిని […]

మాటలు మల్లెపువ్వుల పరిమళంలా వుండాలి.

నీహారికా, అక్షరాలు పెర్చుకొంటు, అచ్చం మల్లె బెండు లాంటి పరిమళం వచ్చేలాగ మాట్లాడటం ఒక ఆర్ట్. మధురంగా మాట్లాడటం ఒక కళ. చక్కగా నలుగురు కూర్చుని కబుర్లు చెప్పుకొంటున్న వేళ, అప్రియులు మాట్లాడకూడదు. ఎలాగంటే “ఎన్ని ప్రమాదాలు ప్రపంచంలో ఇప్పుడు మనం కూర్చున్న ఎ.సి గదిలో మంటలోచ్చాయినుకో, ఒక్కళ్ళం మిగలం”. అన్నారనుకో, ఇక అక్కడ కబుర్లు సాగుతాయి. ఇవి వస్తావాలు కావొచ్చు. కానీ ఆ సందర్భ ప్రేలాపన. మాటలు రాళ్ళ వాసన కురిసినట్లు వుండటం అంటే ఇదే. […]

ఈ ఎండలకి జుట్టు పొడిబారనివ్వద్దు.

కొన్ని సహజమైన పద్దతులు చర్మానికి, జుట్టుకు ఎంతో మేలు చేస్తాయి. మార్కెట్ లో దొరికే ఖరీదైన సౌందర్య పద్దతుల కంటే ఈ మిశ్రమం జుట్టుకు ఎంతో ఉపయోగ పడుతుందని జుట్టు పొడిబారకుండా కాపాడుతుందని నిపుణులు చెప్పుతున్నారు. మూడు స్పూన్ల గొరింటాకు పొడి తో బాగా పండిన అరటి పండు ఒకటి, పావు కప్పు పుల్లటి మజ్జిగ తీసుకుని బాగా కలపాలి. ముందుగా గోరింటాకులో మజ్జిగ పోస్తే నాని మెత్తబడుతుంది. అరటి పండు మిక్సిలో వేసి గ్రియిడ్ చేయాలి. […]

వేస్ట్ మెటీరియల్ తో కళాకృతులు.

హైదరాబాద్ కు చెందిన రేణు రావు వీ రీసైకిల్ పేరుతో ఇంట్లో వాడి పారేసే వేస్ట్ మెటీరియల్ తో కళాకృతులు చేసి విక్రయిస్తున్నారు. పత్రికలు, పేపర్లు, టెట్రా ప్యాక్లు, శీతల పానీయాల డబ్బాలు చెక్క వస్తువులు ఒకటేమిటి మనం ఇంట్లో వాడేసి పారేసిన ప్రతి వస్తువు తోనూ అందమైన కళాకృతులతో చేస్తారు. వీటితో పర్సులు, కాండిల్ హోల్డర్లు, పెన్ స్టాండులు, అందమైన లాంతర్లు, ఫ్లవర్ వాజ్లు, వాల్ హంగింగ్స్, బ్యాగులు, ఇలా చెప్పుకుంటూ పొతే వందల కొద్ది […]

ఎప్పటికీ అదే అందం.

వయస్సు పెరుగుతున్న కొద్దీ ఆ ప్రభావం చర్మం పైన శారీరం పైన కనబడుతుంది. చర్మం పైన ఏర్పడే ముడతలు, గీతాలు, పెరిగే వయస్సుని చూపిస్తాయి. మరి అలాంటివి రాకుండా ముందు నుంచే శ్రద్ధ తీసుకుంటే ఎప్పటికీ ఎవ్వర్ గ్రీన్ గా ఉండవచ్చు. వయస్సు ప్రభావం ముందుగా జుట్టు పైన పడుతుంది. జుట్టు వుడటం మొదలు పెడుతుంది. ఈ సమస్య పోయేందుకు నాణ్యమైన కండీషనర్స్ సహజ సిద్ధమైన పద్దతుల్లో జుట్టుని పోషించుకోవడం చాలా ముఖ్యం. అలాగే వయస్సు చెప్పే […]

వీటి వల్ల పిల్లల్లో స్పీచ్ డిలే

పిల్లలు ఏడిస్తే చాలు అమ్మానాన్నలు వాళ్ళ చేతుల్లో సెల్ ఫోన్లు పెట్టేస్తారు. ఏముంది ఇక పిల్లల ఆటలన్నీ అక్కడితో బంద్. గంటల తరబడి సెల్ ఫోన్, టాబ్ ల తో కాలక్షేపం అయితే ఇలా ప్రపంచంతో పని లేకుండా ఎప్పుడూ సెల్ ఫోన్లు, టాబ్లు, ఐపాడ్ ల తో ఆడటం వల్ల వారికి మాటలు ఆలస్యంగా వస్తాయని ఇప్పుడొక స్టడీ రిపోర్టు చేఅపుతుంది. మాటలు రాకపోగా, కమ్యునికేషన్ డిలే అంశం పై చేసిన అధ్యాయినంలో పిల్లలు ఎంత […]

ఈ సీజన్ కు తగ్గట్టు ఎంచుకోండి.

మేమిలాగే వుంటాం, మాకిలాగే బావుంటుంది అన్న స్టాండర్డ్ ఒపీనియన్స్ ఫ్యాషన్స్ కనే కాదు. ఎప్పుడు ఒకే తరహా దుస్తులు బావుండవు. కాలానికి అనుగుణంగా వార్డ్ రోబ్స్ లో మార్పులు తెచ్చుకోవాల్సిందే. అలంకరణ వస్తువులు కాస్త భిన్నంగా వుండాల్సిందే. ఎండలు మండిపోతుంటే బిగుతైన దుస్తులు వేసుకోవద్దు. వదులుగా వుండే డిజైన్లకు ప్రాధాన్యత ఇవ్వాలి. కుర్తీ, ధోతిలు, పలజోలు, జంప్ సూట్లు, నూలు చీరలు వంటివి ఈ కాలానికి చెక్కని ఎంపిక. అలాగే సిల్క్, షిఫాన్లు, క్రేప్ ల తో […]

సన్ స్క్రీన్ తో సమస్యలు

సాధారణంగా బయటికి పోయే ముందు సన్ స్క్రీన్ లోషన్ అప్లయ్ చేస్తారు చాలా మంది. సూర్య కిరణాల భారి నుంచి చర్మాన్ని కాపాడుకొనే పద్దతుల్లో ఇంకొకటి. అయితే శారీరం సహజంగా ఉత్పత్తి చేసే విటమిన్ డి ని ఈ సన్ స్క్రీన్  అడ్డుకుంటుందని పరిశోధకులు చెప్పుతున్నారు. రంగు తక్కువగా వున్న వారి శరీరం విటమిన్-డి ఉత్పత్తిని తక్కువగా వున్న వారి శరీరం విటమిన్ డి ఉత్పత్తిని తక్కువగా చేసుకోగలుగుతుందని, ఈ లోషన్ల వాడకం వల్ల విటమిన్ డి […]

పర్లేదు ఆ చిరాకు ఇట్టే పోతుంది.

నెలసరి ముందు నుంచే కొందరికి భావోద్వేగాల పరమైన చిరాకు కోపం వంటి  సమస్యలు వేధిస్తాయి. ఈ సమయంలో నడుము, కాళ్ళ నొప్పులు భాదిస్తాయి. పొట్ట ఉబ్బరంగా వుంటుంది. ఏమీ తినాలి అనిపించదు. వీటి నుంచి ఉపసమనం కోసం ముందుగా రిలాక్స్ అవ్వాలి. విశ్రాంతి తీసుకొన్న గదిలో ఒక మూల తాజాగా వాసనలోచ్చే ముంచి పూల గుత్తిని వుంచుకోవాలి. పరిమళాలు మనస్సుకి ఆహ్లదాన్ని ఇస్తాయి. అలాగే మంచి సువాసన వచ్చే కోవొత్తి వెలిగించినా పర్లేదు. నొప్పుల ఉపసమనానికి హీటింగ్ […]

సహజమైన సువాసనలివి.

ఇల్లంతా సువాసనలోస్తే బావుంటుంది. ఎంత ఖరీదైన స్ప్రేలు కొట్టినా కాసేపట్లో మళ్ళి మాములుగానే వుంటుంది. ఈ సారి కొన్ని సహజ సిద్ధమైన పదార్ధాల వైపు చూడండి. నేలను తుడుస్తున్నప్పుడు. నీటిలో రెండు చుక్కలు నిమ్మ గడ్డి నూనె వేస్తె ఈగలు, దోమలు ముసరవు. చక్కని వాసనా వస్తుంది. లేదా గిన్నె నీళ్ళల్లో రెండు స్పూన్లు నిమ్మ గడ్డి నూనె వేసి స్టవ్ పైన పెట్టి మరగానిస్తే ఇల్లంతా సువసనే. అలాగే దాల్చిన చెక్క పొడిని సాంబ్రాని పొగలాగా […]

శరీరం తీరును బట్టే దుస్తుల ఎంపిక.

ఏ సినిమాలోనో, ఏ మాగజైన్ కవర్ పేజీపైనో చూసి, ఒక సినీ యాక్టర్ వేసుకొన్న డ్రెస్సునో, ఏ మోడల్ ధరించిన నాగనో చూసి మోజు పడతారు. కానీ అందరికి ఒకే రకమైన శరీరాకృతి వుండదు. ఒకళ్ళకు నప్పినట్లు ఇంకొక్కళ్ళకు బావుండవు. శరీరపు రంగు, ఎత్తు, బరువు ఎన్నో తేడా లేకుండా ఉంటాయి. అందుకే ఎవరికి నప్పే దుస్తులు వాళ్ళు ఎంపిక చేసుకోవాలి. సన్నగా పొడుగ్గా వుంటే అన్ని రకాల వస్త్ర శ్రేణి నప్పుతుంది. ఇవి సాదాగా వుంటే […]

తుమ్ము ఆపేరో సమస్యే

పదిమంది మధ్యలో ఉన్నప్పుడు ఏదైనా శుభకార్యం జరుగుతుంటేనో, సామాజిక కార్యక్రమాల్లోనో, సెంటిమెంట్ తో ఎవరైనా ఎమన్నా అనుకొంటారానో తుమ్ము వస్తుంటే బలవంతంగా ఆపెస్తారేమో కానీ అలా తుమ్ము వచ్చినప్పుడు ఆపుకోవడం చాలా ప్రమాదం. తుమ్మొచ్చినప్పుడు వెలుపలికి వచ్చేగాలి గంటకు వంద మైళ్ళ వేగంతో వస్తుందిట. దాన్ని బలవంతంగా ఆపేస్తే ముక్కులో కార్డిలేడ్ ఫ్రాక్చర్లు కావడం, ముక్కులోంచి రక్తం కారడం, కర్ణభేరి చిట్లడం, వినికిడి లోపం, తాత్కాలికంగా మొహం వాడిపోవడం వంటి సమస్యలు తలెత్తే అవకాశాలున్నాయి. ఇలాంటివి జరక్కుండా […]

రోజుకో మామిడి పండు

మామిడి పండు పైన పంచ రత్నాలు రాయవచ్చు. తిన్న వెంటనే సంతోషం పట్టలేక కవితలు రాయచ్చు. నోరారా కీర్తించవచ్చు. అంత కమ్మగా వుండే మామిడి పండు మనకు దొరికేది ఏడాదిలో రెండు మూడు నెలలు అయితే సంవత్సరం పొడవునా సరిపోయేన్ని ఔషధ గుణాలు ఈ పండులో పుష్కలంగా ఉన్నాయి. యాంటీ ఆక్సిడెంట్లు అధిక మోతాదులో, కార్బోహైడ్రేట్స్ తక్కువ మోతాదులోఉంటాయి. పిండి పదార్ధం, కొవ్వు తక్కువగా ఉండటం వల్ల మామిడి పండు తింటే బరువు పెరుగుతామన్న భయం అక్కర్లేదు. […]

మొలకెత్తిన గోధుమలతో గోళ్ళకు బలం

గోళ్ళు విరిగిపోతూ వుంటాయి. మెత్తగా వంగిపోతాయి. అవి బలంగా, ఆరోగ్యంగా, అందంగా వుంటే వాటిని అలంకరించే ఎన్నో సాధనాలు మార్కెట్ లో ఉన్నాయి. కొన్ని ఆహార పదార్ధాలు గోళ్ళు ధృడంగా అందంగా వుండేలా చేస్తాయి. అందులో భాగంగా మొలకెత్తిన గోధుమలలో విటమిన్ బి6, విటమిన్ ఇ, ప్రోటీనులు, జింక్ వుంటాయి. ఈ మొలకల్ని యధాతధంగా తినలేకపోతే పూరీల పిండిలో, సెరల్స్లో, పెరుగులో, సలాడ్ లో, పాన్ కేక్లో, ఫ్రూట్ కేక్ లో కలుపుకుని తాగచ్చు, తినచ్చు. వాటిని […]