Saturday, 28 Nov, 2026

జామ పండును కొరికి తింటే మంచిది

జామ పండు యాపిల్ పండు కంటే ఎక్కువ మేలు చేస్తుందని చెపుతున్నారు ఎక్స్పర్ట్స్. క్రమం తప్పకుండా జామపండు తింటే బరువు నియంత్రణలో వుంటుంది. ఇందులో పీచు ఎక్కువ, చక్కర పాళ్ళు ఎక్కువ. ఇందులో వుండే విటమిన్ ఎ కంటి చూపు మెరుగుపరుస్తుంది. థైరాయిడ్ వంటి వ్యాధులను నియంత్రణలో ఉంచుతుంది. మెదడును చురుగ్గా ఉంచుతుంది. విటమిన్ బి6, బి3 వంటి పోషకాలు పుష్కలంగా ఉండటంతో మెదడులో న్యురాన్ల పనితీరు బావుంటుంది. రక్తం లో కొలెస్టరాల్ పాళ్ళు తగ్గిస్తుంది. అంతే […]

ఎఫ్.ఐ.ఆర్ యాప్ తో క్షేమం

ఇంట్లోంచి కాలు బయట పెడుతూ వుంటే భద్రత కోసం ఎన్నో జాగ్రత్తలు తీసుకోవలసి వస్తుంది. ఏ క్షణం ఎలాంటి ఆపద వస్తుందో తెలియదు. ఆఫీస్ నుంచి కాసేపు ఇంటికి రావడం ఆలస్యం అయితే ఇంట్లో వాళ్ళు కంగారు పడతారు. అలాగే ఏ ఆటో ఎక్కినా భద్రత విషయం భయమే. అనుకోని అవాంతరమో, ఆగంతుకుల దాడో ఎదురైతే ఏమిటి పరిస్థితి? అలాంటి సమయంలో భయపడకుండా ఫోనులో FIR అనే యాప్ వుంటే మంచిది. ఈ యాప్ ని డౌన్లోడ్ […]

ఎక్కువ కేలరీలుంటే పక్కన పెట్టాలి

పాత ఫోటోలు చూస్తూ వుంటే దిగులేస్తుంది. ఎంత సన్నగా, నాజుగ్గా, తేలిగ్గా వున్నాం అనుకుంటారు. అప్పుడిక ఏది తినలనిపించదు. బాగా డైట్ చేసి సన్నగా అయిపోవాలని తీర్మానించుకుంటారు. తీరా కళ్ళ ఎదుట ఇష్టమైన పదార్ధాలు కనిపించగానే హాయిగా తినేసి, తర్వాత తీరిగ్గా విచారించటం అందరి అనుభవంలో వచ్చేదే. అసలు శ్రద్ధగా, నిష్టగా సన్నబడి తీరాలి అని నిశ్చయించుకుంటే ముందుగా ఇష్టమైన పదార్ధాల్లో వేటిలో ఎక్కువ కేలరీలు వుంటే వాటిని తక్కువ పరిమాణంలో తీసుకోవాలి. ఉదాహరణకు బ్రెడ్ తినే […]

ఈ సీజన్ వీటితోనే గడుస్తుంది

అసలు సమ్మర్ స్పెషల్ అని మనమే ఒక రైట్ బోర్డు వేసుకోవాలి. రోజురోజుకు ఉష్ణోగ్రత పెరుగుతుంటే ఈ సీజన్ లో బాగా దొరికే మామిడి, పుచ్చ, కర్భుజా, కీరా బాగా తినాలి. తినవలసిన పదార్ధాల లిస్టు తాసుకుంటే ఏది ఎప్పుడూ ఎలా తీసుకోవాలో ఆలోచించవచ్చు. సొరకాయ మంచింది. రక్తం శుద్ధి చేస్తుంది. నిమ్మరసం, కొబ్బరినీళ్ళు, మజ్జిగ తీసుకోవాలి. పుచ్చకాయ చర్మ రక్షణకు, జీర్ణ క్రియకు సహకరిస్తుంది. పుదినా, కొత్తిమీర, నిమ్మరసం ఏదో ఒక రకంగా తీసుకోవాలి. ఇక […]

చెప్పినట్లు వినే డబ్బాలు

ఏదో ఒకటి ఎదురుగా కనబడేది తినేయాలని నోరు లాగేస్తూ కంట్రోల్ పోతూ వుంటే కిచెన్ సేఫ్ బాక్సుల వైపు చూడాలి. సాధారణంగా ఏవైతే తినకూడదు అనుకుంటామో వాటి వైపు మనసు లాగుతూ వుంటుంది. చాక్లెట్లు, బిస్కెట్లు ఏవి చూసినా చిన్న పిల్లల్లాగే మనం కూడా మనసు పారేసుకుంటాం. ఎటూ పిల్లలు అడుగుతూనే ఉంటారు ఇక ఎక్కువగా తినద్దు, పిల్లలకు ఇవ్వద్దు అనుకునే పదార్ధాలు ఈ కిచెన్ సేఫ్ డబ్బాల్లో పెట్టి తాళం వేస్తే చాలు దీని మూత […]

ఆ చెట్టు విత్తనాల మొక్కలే అమెరికా అంతా

ఇప్పుడు మనకి మంచి బీర తీగె వేద్దామంటే చెట్టుకి ఎండి ఒరుగైపోయిన బీరకాయ నుండి మన చేతుల్లోకి రాలే గింజలు దొరకవు. గుప్పెడు ఆకు కూర విత్తనాలు దొరకవు. విత్తనాలు పండించడం లేదన్న మాట. అవి మార్కెట్ లో దొరికే అమ్మకపు వస్తువులు. స్వయంగా ఈ సంపదనని మనం దాచుకోవాలి రాబోయే తరాల కోసం. ఇప్పుడో చిన్న విశేషం వినాలి. అమెరికాలో ఉన్న అవకాడో పళ్లన్నీ ఒక చెట్టు నుంచి వచ్చిన విత్తనాలని తేలింది. ఈ కథ […]

విజువల్ మెమొరీ యాడ్ చేయాలి

అన్నీ మరచిపోతున్నామని ఊరికే భయపడతాం కానీ, కొంచెం కష్టపడితే జ్ఞాపకాన్ని పదిలంగా మరుపనేది రాకుండా దాచుకోవచ్చు అంటున్నారు ఎక్స్పర్ట్స్. అడిగీ అడగ్గానే ఫోన్ నంబర్లు, నిమిషాలతో ఎప్పుడో జరిగిన విషయాలు ఏకరువు పెట్టేవాళ్ళని చూస్తుంటాం. వీళ్ళందరికీ సాధ్యం అయింది మనకీ సాధ్యం అవుతుంది. కాస్త ఎక్సర్సైజులు చేయాలి. ముందుగ మరచుపోతున్నానన్న భయం పోగొట్టుకోవాలి. కొన్నాళ్ళ పాటు దీక్షగా ప్రతి విషయానికి విజువల్ మెమొరీని యాడ్ చేస్తూ రావాలి. ఉదాహరణకు బయటకు వెళ్లివచ్చి బ్యాగ్ టేబుల్ పైన పెట్టాం.మరచిపోతున్నామని […]

తల్లి అశాంతిగా వుంటేనేఈ స్థితి

ప్రతి విషయానికి ఒక కారణం వుంటుంది. మనుష్యుల ప్రవర్తన వెనక పెంపకం తీరుంటుంది. కొన్నింటికి తల్లి కడుపులోనే బీజం పడుతుంది. కొంతమంది పిల్లలు మొండిగా, పెంకి తనంగా ఏడుస్తూనే వుంటారు. ఎంత ఊరడించిన అంతే. కాసేపు కూసేపు కాదు దాదాపు రోజంతా అలా చిరాగ్గా ఏడుస్తారు. సరిగా తిండి తినరు, అలంటి ప్రవర్తన పిల్లల్లో ఎందుకుంటుంది అని పరిశోధన చేస్తే ఆశ్చర్యంగా ఆ ఏడుపులకి తల్లే కారణం అని తేలింది. గర్భిణిగా ఉండగా తల్లి ఎదుర్కొన్న ఒత్తిడీ, […]

నీళ్ళకు ఆరోగ్యం కలిపి ఇచ్చేస్తాయి

ఇప్పుడు వస్తువులు మార్కెట్ చేసుకోవాలంటే ఫస్ట్ సౌకర్యం, అందం, ఎక్కడికైనా తేలికగా మోసుకుపోగల అవకాశం అన్నింటిని మించి ఆరోగ్యం తోడైతే చాలు హాట్ కేకుల్లా అమ్ముడైపోయినట్లే. ఇప్పుడు ప్లాస్టిక్ ప్లాస్టిక్ బాటిల్స్ లో నీళ్ళు నిల్వవుంచినా, తాగినా ఎన్నో ఆరోగ్య సమస్యలు వస్తాయని అధ్యయనాలు చెపుతున్నాయి. ఇంట్లో వాటిని అవతల పెట్టి గ్లాసులతో, చెంబులతో తాగవచ్చు. మరి ప్రతి రోజు మంచి నీళ్ళు మన వెంట తీసుకు వెళ్ళే అవసరం వుంటే ఆ నీళ్ళు ఆరోగ్యంగా అందాలంటే […]

అందం విషయంలో అపోహ చట్టం తెచ్చింది

అందం గురించిన ఆశలు, అంచనాలు తీవ్రస్థాయికి చేరి ప్రాణాల పైకి తెస్తూ వుంటే చివరకు ప్రభుత్వం కలగజేసుకుని చట్టం తేవలసి వచ్చింది. ఫ్యాషన్ లకు పేరుపొందిన ఫ్రాన్స్ లో సంచలన చట్టం ఒకటి వచ్చింది. బరువు తక్కువ ఉన్న మోడల్స్ నిషేదిస్తూ చేసిన ఈ చట్టం ప్రకారం ప్రతి మోడల్ తన శరీర ఆరోగ్యంతో పాటు బాడీ మాస్ ఇండెక్స్ కు సంబందించి డాక్టర్ సర్టిఫికేట్ ఇవ్వాలి. శరీరo బరువు అతి తక్కువగా వుంచుకోవడం కోసం తిండి […]

ఇతరుల ప్రాణాలు కూడా విలువైనవే

నీహారికా, నిన్నటి రోజు నువ్వు ట్రాఫిక్ లో అతివేగంగా కార్లు, ఇతర వాహనాలు తప్పిస్తూ బైక్ పైన రావడం చూశాను. ఇంత రద్దీలో నువ్వు నీ ప్రాణం, ఇతరుల ప్రాణం గురించి ఏమాత్రం లక్ష్యం లేకుండా ఎలా రెడ్ సిగ్నల్ దగ్గర జంప్ చేస్తూ వస్తున్నావో కూడా చూశాను. రహదారి పైన కాస్తయినా సంయమనంతో వ్యవహరించవా? నీలాంటి యువతే కార్లో వెళుతూ సీట్ బెల్ట్ పెట్టుకోరు, ట్రాఫిక్ పోలీసులు ఆపుతున్నా లక్ష్య పెట్టరు. ట్రాఫిక్ ఎక్కువగా వుంటే […]

పిల్లి పిల్లలూ, పుర్రె బొమ్మలూ

పిల్లి మామూలుగా ఎదురొస్తేనే అపశకునం అనుకొంటాం. ఒక ప్రియురాలికి ముద్దుగా ప్రెజెంట్ చేసే రింగ్ వేలిపైన పిల్లి తొంగి చూస్తున్నట్లు కనిపిస్తే ఎలా వుంటుంది. ఒక పాము పిల్ల లాగానో, ఉడతల్లాగానో, బుర్ర మీసాలలాగానో, కాఫీ కప్పు లాగానో ఉందనుకో ఎలా అనిపిస్తుంది. కొంచెం వింతగా, కొత్తగా వెనక్కి తిరిగి చూడలన్నంతగా వుంటాయి. కల్లో అయినా ఒక పుర్రె కనిపిస్తే దడుచుకుని లేచి మంచినీళ్ళు తాగుతారు. అలాంటిది ఏకంగా ఓ అమ్మాయి ఒక పుర్రె ఉన్న ఉంగరం పెట్టుకుని […]

తక్షణ శక్తికి చెరుకు రసం

ఈ సీజన్ లోనే చెరుకు రసం బాగా దొరుకుతుంది. పైగా టేస్టీగా, చల్లగా, సహజంగా వుంటుంది కనుక అoదరూ ఇష్టపడతారు. ఎండలో అలసిపోయి వచ్చాక ఒక్క గ్లాసు చెరుకు రసం తాగితే చాలు తక్షణ శక్తి వస్తుంది. కోబాల్ట్, మెగ్నీషియం వంటి ఖనిజాలు, యాంటి ఆక్సిడెంట్లు, ప్రోటీనులు, పైటో న్యూట్రియంట్లు వ్యాధి నిరోధక శక్తిని పెంచుతాయి. చెరుకు రసం కాలేయం, మూత్ర పిండాలని ఆరోగ్యంగా ఉంచుతుంది. చెరుకు రసంలో నిమ్మరసం కలిపి తాగితే బరువు పెరగరు. చెరుకులో […]

మంచి రంగునిచ్చే పెరుగు పూత

కమ్మని పెరుగులో సౌందర్య పోషణకు పనికి వచ్చే గుణాలు ఎన్నో ఉన్నాయి. పెరుగులో ఉండే లాక్టిక్ ఆమ్లం చర్మానికి మంచి రంగు ఇస్తుంది. మృదువుగా మారుస్తుంది. పెరుగు ముఖానికి రాసుకుని ఓ పది నిముషాలు అలాగే వదిలేస్తే ముఖంపై మచ్చలు, ముడతలు పోతాయి. పెరుగు, తేనె కలిపి అప్లయ్ చేస్తే మరీ మంచిది. మెడ పైన నల్లగా అనిపిస్తే పుల్లటి పెరుగు పట్టించి 15 నిముషాలు వుంచి కడిగేస్తే క్రమంగా కొన్ని రోజులకు నలుపు తగ్గిపోతుంది. మొహంపైన […]

నిబ్బరంతో బయట పడాలి.

నీహారికా, నీ అనుభవం నీ వయసులో ఉండే ఎంతో మందికి ఎదురయ్యిందే. ఒక మంచి ప్రాజెక్ట్ తీసుకుని కష్టపడి పనిచేస్తావు గుర్తింపు రాదు. ఆఫీసులో ఒక సెక్షన్ హెడ్ గా అవుతావు, మిగతా వాళ్ళు సరిగ్గా మాట వినరు. ఇలా ఒక్క కెరీర్ లోనే కాదు వ్యక్తిగత జీవితంలోను ఎన్నో ఓటములు ఉంటాయి. వాటి నుంచి బయట పడాలంటే చాలా నిబ్బరం కావాలి. అలా ఎప్పుడైనా ఓటమి ఎదురయితే ఉద్వేగంతో స్పందించకూడదు, నియంత్రణలో ఉండాలి. వీలైతే అలాంటి […]

ఎమోషనల్ ఇంటలిజెన్స్ వుంటే సంబంధాలు పదిలం

ఎమోషనల్ గా ఉండే వాళ్ళలో మేధావితనం వుంటే విజయం సాధించడం సులువు అవుతుందని సాధారణంగా అందరికీ తెలిసిందే. అయితే ఎమోషనల్ గానూ, తెలివి గానూ ఉండేవాళ్ళకి తమ సొంత ప్రయోజనాలకు కూడా ఇతరుల భావోద్వేగాలను ప్రభావితం చేయగల శక్తి సామర్ధ్యాలు ఉండి ఉంటారని ఇటీవల వాషింగ్టన్ లో జరిగిన పరిశోధనల్లో గుర్తించారు. ఎమోషనల్ ఇంటలిజెన్స్ అంటే సొంత, ఇతర భావోద్రేకాలను సరైన రీతిలో క్రమబద్దీకరించుకోగలగటం. దీని వల్ల సామాజిక ప్రవర్తన, వ్యక్తిగత సంబంధ భాంధవ్యాలు బావుంటాయి. అయితే […]

అందానికి ఫ్రూట్ తెరెపీ

పళ్ళ ప్రయోజనాలు అనంతంగా ఉంటాయి. ఇటీవల కాలంలో పండ్లను కేవలం ఆరోగ్యానికి సంబంధించే కాకుండా సౌందర్య పరిరక్షణలో కూడా విరివిగా ఉపయోగిస్తున్నారు. ఖరీదైన సౌందర్య సాధనాలు చేయలేని పని ఒక పండు చేస్తుంది. అవకాడో ఫ్రూట్ ఇప్పుడు మనదేశంలోను ఎక్కువగానే దొరుకుతున్నాయి. ఇది తినే పండుగా కంటే మంచి సౌందర్య సాధనం. అవకాడో గుజ్జును చర్మానికి అప్ప్లయ్ చేసి మసాజ్ చేస్తే పొడి చర్మం తేమగా అవటమే కాకుండా వృద్ధాప్య లక్షణాలు మటుమాయo అవుతాయి. ముఖానికి అంతకుముందు […]

సైకిల్ తో ఆరోగ్యం సొంతం

బైకులొచ్చాక వేగo అనుభవంలోకి వచ్చాక సైకిళ్ళు మూలపడ్డాయి. అయితే సైక్లింగ్ తో ఆరోగ్యం సొంతం చేసుకోవచ్చు అంటున్నారు బ్రిటన్ పరిశోధకులు. రెండున్నర లక్షల మంది పైన ఐదు సంవత్సరాల పాటు ఈ పరిశోధన జరిగింది. ఆఫీసులకు ఇతర పనులపైన బైక్ మాత్రం ఉపయోగించే వాల్లందరిలోను తలెత్తిన ఆరోగ్య సమస్యలను, అనారోగ్యాలను గుర్తించారు. ఈ పరిశోధనా సారాంశంగా ఏం తేలిందంటే బైక్ బదులు సైకిల్ ఉపయోగిస్తే కాన్సర్ వచ్చే అవకాశం 43 శాతం తగ్గుతుందనీ, అదే విధంగా గుండె […]