• కూరలు, సాంబారులో ముల్లంగి చాలా బావుంటుంది. చూసేందుకు తెల్లగా పొడువుగా వున్న చప్పగా టేస్టి గా అనిపించదు. కానీ ఇందులో వుండే పోషకాలు మాత్రం ఎక్కువే ప్రతి కూరలో నూ ప్రతి కాంబినేషన్ లోనూ ముల్లంగిని తీసుకుంటేమూత్రపిండాలు పని తీరు శుభ్ర పడుతుందంటారు డాక్టర్లు ఎలాంటి ఇన్ ఫెక్షన్లు రావని చెపుతున్నారు. ముల్లంగిలో విటమిన్-సి, ఫాస్పరస్ బి-కాంప్లెక్స్ అధికంగా వుంది చెర్మానికి ఎంతో మేలు చేస్తాయి. చర్మానికి తేమ అందుతుంది. ముల్లంగి రసం శరీరంలో ఇన్ ఫెక్షన్లు పోగొట్టి అలసట దూరం చేస్తుంది. శ్వాస సంబందమైన సమస్యలున్న, అలర్జీలు చేధిస్తున్న ముల్లంగిలోని పోషకాలు తగ్గిస్తాయి.

    ముల్లంగి తో ఎంతో మేలు

    కూరలు, సాంబారులో ముల్లంగి చాలా బావుంటుంది. చూసేందుకు తెల్లగా పొడువుగా వున్న చప్పగా టేస్టి గా అనిపించదు. కానీ ఇందులో వుండే పోషకాలు మాత్రం ఎక్కువే ప్రతి…

  • వంద కేజీల బరువు మోస్తూ హీరోయిన్ సమంత చేస్తున్న వర్కవుట్ వీడియోలు సోషల్ మీడియాలో సంచలనం. హీరోయిన్స్ అత్యంత ఫిట్ స్టార్ సమంత అంటున్నారు. ఆమె ఫేవరేట్ ఫిట్ నెస్ ట్రైనర్ రాజేష్ రామ స్వామి. ఏళ్ల తరబడి ఒకే రకమైన ఫీజిక్ మెయిన్ టైన్ చేయడంలో సమంత చాలా ఖచ్చితంగా వుంటుందీ అంటున్నాడీయన. వర్కవుట్ టైం కు రావటం జాగింగ్ ,స్ట్రెచింగ్ ఫ్యాట్ కంట్రోల్ కి సంబంధించిన వ్యాయామాలు చేయటం ఉపవాసాలు చేయకుండా లైట్ గా తినటం సమంత ఆరోగ్య రహస్యం. సమంత వర్కవుట్ వీడియోలు చుస్తే ఉదయన్న్నే లేవటం బద్ధకం బాబు అని మంచం దిగకుండా పెరిగిపోతున్న బరువు గురించి వస్తే గా నిట్టురుపులు విడిచి కాస్త శరీరం పట్ల శ్రద్ధ చూపిస్తారేమోనని ఈ న్యూస్. సమంత శుభ్రంగా భోంచేస్తుందట. అలాగే షూటింగ్ లు ఉంటే తెల్లారేలోపే తన వ్యాయమ శిక్షణ పూర్తి చేస్తుందట.

    కమిట్మెంట్ విషయంలో సమంత సూపర్

    వంద కేజీల బరువు మోస్తూ హీరోయిన్ సమంత చేస్తున్న వర్కవుట్ వీడియోలు సోషల్ మీడియాలో సంచలనం. హీరోయిన్స్ అత్యంత ఫిట్ స్టార్ సమంత అంటున్నారు. ఆమె ఫేవరేట్…

  • బాం తప్ప మేకప్ కోసం ఇంకేం వాడకుడదని కాంప్లేక్షన్ దెబ్బ తింటుందని అనుకుంటారు కాని ఏదైన తగు మొతాదులొ వాడితే ఏ హాని జరుగదు.పూర్తి మేకప్ కన్నా టెంట్ డ్ మాయిశ్చరయిజర్స్,బేబి క్రీం లు వాడాలి. ఇవి తేలికపాటి టెక్చర్ కలిగి ఉండి వైట్ స్మూత్ ఇస్తాయి.చర్మం పైన తాజా ఉత్పత్తులు అప్లయ్ చేయాలి.ప్రతి సంవత్సరం ఒకసారి పౌడర్ ఆధారిత వస్తువులు మార్చాలి. ఎప్పటికప్పుడు మేకప్ బ్రష్ లుశుభ్రపరుచుకొవాలి. మేకప్ శుభ్రంగా క్లీన్ చేసుకోవడం మరువకూడదు.ఫేస్ వాష్ లతో క్లీన్ చేసుకుని మేకప్ రిమూవర్ తో క్లీన్ చేయాలి.మేకప్ లో ఇలాంటి నిబంధనలు పాటిస్తే చర్మానికి ఏలాంటి హాని జరుగదు

    మేకప్ వల్ల నష్టం ఏదిరాదు…

    బాం తప్ప మేకప్ కోసం ఇంకేం వాడకుడదని కాంప్లేక్షన్ దెబ్బ తింటుందని అనుకుంటారు కాని ఏదైన తగు మొతాదులొ వాడితే ఏ హాని జరుగదు.పూర్తి మేకప్ కన్నా…

  • మనం ఏంత ప్రేమ గా పెంచిన పిల్లలు ఎందుకు అబద్దాలు ఆడతారనే ప్రశ్న చాల మంది తల్లిదండ్రులను వేదిస్తు ఉంటుంది. నిజం చెబితే అధికారం ప్రయోగిస్తారనే భయంతో పిల్లలకు అబద్దాల వైపు దారి చూపెడుతుంది. ఈ భయన్ని తమ పట్ల గౌరవం అనుకుంటారు పెద్దలు. హోం వర్క్ లేదనో,ఏం పగల కొట్టలేదనో,ఎవర్ని కోట్టలేదనొ తన్నులు తిన్నాకా పిల్లలు మోరపెట్టే మాటలే. మనం పిల్లల ను శిక్షించేది వాళ్ళ బాగు కోసమే అని వారికి అర్ధమయ్యెలా ప్రవర్తించాలి. నిజం చెబితే నాకు ఇష్టం ఒకవేళ తప్పు చేసిన నిజం చెప్పారు గనుక అర్ధం చేసుకుని గౌరవిస్తాను. ఆ తప్పు ఎందుకు చేశారో చెబితే అది కరక్టా కాదా అన్నది ఇద్దరం కలిసి ఆలోచిద్దాం అన్న భరోసా మనం పిల్లలకు కల్పిస్తే వాళ్ళు అబద్దాలు అడారు. పిల్లలు ఎలా ఉండాలో చెప్పే ముందు మనం ఆచరించి జీవిస్తే వాళ్ళు తప్పే చేయరు ఏమంటారు

    పిల్లల అబద్దాలకు మనమే కారణం…

    మనం ఏంత ప్రేమ గా పెంచిన పిల్లలు ఎందుకు అబద్దాలు ఆడతారనే ప్రశ్న చాల మంది తల్లిదండ్రులను వేదిస్తు ఉంటుంది. నిజం చెబితే అధికారం ప్రయోగిస్తారనే భయంతో …

  • ఎన్నోళ్లు గానో లేదా ఎన్నేళ్లు గానో క్రంచ్ ఇతర వ్యాయామాలు చేస్తున్న ఉదరం సమంగా లేదూ అంటే తప్పనిసరిగా ప్రయత్న లోపం ఉందనే అర్ధం. నడుం చుట్టూ వుండే కొద్ది పాటి కొవ్వు ఆకృతిని దెబ్బతీస్తుంది. స్త్రీలకైనా పురుషులకైనా పొట్ట ప్లాట్ గా సమంగా ఉంటేనే బావుంటుంది. నాజూకైన నడుం వల్ల అనారోగ్య సమస్యలు రావన్న గ్యారెంటీ ఏదీ లేదు. కానీ ఫ్లాట్ అబ్స్ గలవారికి మిగతా వారితో పోల్చితే 25 శాతం తక్కువగా గుండె జబ్బుల అవకాశాలు ఉంటాయి. 35 శాతం తక్కువ హార్ట్ ఎటాక్స్ వస్తాయని 41 శాతం తక్కువగా బీ.పి వస్తుందని 40 శాతం కిడ్నీ కాన్సర్ అవకాశాలు తగ్గుతాయని గాల్ స్టోన్స్ అవకాశాలు 60 శాతం తక్కువనీ ఆస్ట్రియో ఆర్థరైటిస్ అవకాశాలు 34 శాతం తక్కువనీ అధ్యయనాలు చెపుతున్నాయి. ఆరోగ్య సమస్యలు తక్కువే ఆరోగ్య అవకాశాలు ఎక్కువే కనుక ఎక్కువసేపు కూర్చునే ఉండకుండా మంచు వ్యాయామం నడక వదలకుండా ఉంటే చాలు.

    నాజూకైన ఉదరంతో ఆయుష్షు ఎక్కువ

    ఎన్నోళ్లు గానో లేదా ఎన్నేళ్లు గానో క్రంచ్ ఇతర వ్యాయామాలు చేస్తున్న ఉదరం సమంగా లేదూ అంటే తప్పనిసరిగా ప్రయత్న లోపం ఉందనే అర్ధం. నడుం చుట్టూ…

  • గర్భవతి అయ్యాక అమ్మ వాడే మందులన్ని పాపాయి కి కుడా చేరతాయి కాబట్టి సురక్షిత మైన మందులే సూచిస్తారు డాక్టర్లు. తోలి మూడు నెలల్లో పాపయికి వాడే సంభాందిత మందులలో లోపాలు లేకుండా ఉండేందుకు ఒక్క ఫోలిక్ యాసిడ్ మాత్రమే ఇస్తారు. ఒకే ఒక్క గోల్డెన్ రూల్ ఎంటటే ఈ సమయంలో సోంత వైద్యం చేయక పోవడం మంచిది. భారతీయ మహిళలలో జీవనశైలిలో ఎక్కువగా విటమిన్ డి,క్యాల్షియం తక్కువగా ఉండి ఎముకలు బలహీనంగా ఉంటాయి. శారీరక ఫీట్ నెస్ చాల తక్కువ ఈ సమయంలో ఎక్కువ యోగా,వ్యయామం చేయాలి. సరైన పోజిషన్ లొ కుర్చుని,నిలబడాలి.చాలినంత విశ్రాంతి,నిద్ర ఉండాలి.సౌకర్యాంగా ఉండే పరుపు పైన ఎదో ఒక వైపు తిరిగి పడుకోవాలి. అమ్మతనాన్ని అమ్మగా ఆస్వాదిస్తు డాక్టర్ల నుంచి సలహాలు,సూచనలు తీసుకొంటు ముద్దులు మటగట్టే పాపాయి ని ఈ లోకంలొకి తీసుకురావలి. గర్భవతి కాగానే డాక్టర్ల సలహాలు సూచనలు తీసుకుని పరీక్ష లు చేయించుకోవాలి.

    చిన్నారి కి స్వాగతం కోసం…

    గర్భవతి అయ్యాక అమ్మ వాడే మందులన్ని పాపాయి కి కుడా చేరతాయి కాబట్టి సురక్షిత మైన మందులే సూచిస్తారు డాక్టర్లు. తోలి మూడు నెలల్లో పాపయికి వాడే…

  • రాత్రయ్యాక మూడు గంటలు సెల్ ఫోన్ లో మాట్లాడే వాళ్ళకి సరిగా నిద్రపట్టడం లేదని ఇటీవలే జరిగిన పరిశోధనలో తెలిసింది. సెల్ ఫోన్ నుంచి వెలువడే సూక్ష్మ తరంగాల ఉద్గారాల వాళ్ళ మన ఏడాదిలో తరంగాలు మార్పు చెందుతాయి. 30 నిముషాలు ఫోన్ లో మాట్లాడితే మనం నిద్రపోయే స్థితి సాధించేందుకు మెదడు 60 నిమిషాలు తీసుకుంటుంది. మనలోని జీవ గడియారం సరిగ్గా పనిచేసేందుకు నిద్ర సమయాన్ని మేల్కునే సమయాన్ని నియంత్రించాలి. ఇది కాస్త కష్టమే కానీ అసాధ్యం మాత్రం కాదు. నిద్ర చాల ముఖ్యం. అలసిన శరీరానికి విశ్రాంతి దెబ్బతిన్నా శరీర కణాల పునర్నిర్మాణానికి దోహదం చేస్తుంది. అందుకే ఆల్కహాల్ కు దూరంగా సెల్ ఫోన్ లు దూరంగా టీ వీకి దూరంగా కెఫిన్ కు దూరంగా చిరుతిండి భారీ భోజనం వీటన్నిటినీ ఒక కన్నేసి చూసి మంచి దిండు పరుపు తీసుకుని పడక గదిని సాధ్యమైనంత చీకటిగా ఉంచి హాయిగా నిద్రపోవాలి. ఈమెయిల్స్ ,ఫేస్ బుక్ ,చాటింగ్ లు నిద్ర దోచుకుని శరీరంలో ప్రతికూలమైన మార్పులు తెస్తాయి జాగ్రత్త !

    నిద్రే అందం ఆరోగ్యం

    రాత్రయ్యాక మూడు గంటలు సెల్ ఫోన్ లో మాట్లాడే వాళ్ళకి సరిగా నిద్రపట్టడం లేదని ఇటీవలే జరిగిన పరిశోధనలో తెలిసింది. సెల్ ఫోన్ నుంచి వెలువడే సూక్ష్మ…

  • ఎలాంటి స్క్రబ్స్ వాడితే చర్మం బావుంటుందోనని ఎప్పుడు డౌట్ వస్తూనే వుంటుంది. చర్మం మృదువుగా ప్రకాశవంతంగా వుండాలంటే పెరుగు పసుపు కలిపిన స్క్రబ్ ఏ కాలంలో అయినా మంచిదే . ముఖ్యంగా చలిరోజుల్లో ఈ స్క్రబ్ ముఖానికి మెడకు పట్టించి పావుగంటాగి కడిగేస్తే చర్మం మృదువుగా ఉంటుంది. ఒక టీ స్పూన్ పసుపు ఒక టీ స్పూన్ సెనగపిండి ఇంకో నాలుగు టీ స్పూన్స్ పెరుగు బ్లెండ్ చేసి ఇందులో ఆలివ్ ఆయిల్ కలిపి ముఖానికి పట్టించినా మంచిదే. చర్మం పొడి బారటం కంటి కింద వలయాలు తగ్గి సహజామైన మెరుపులు రావాలంటే బాదాం పొడి అలోవెరా జల్ సమపాళ్లలో కలిపి అప్లై చేయాలి. ఇది అన్ని రకాల చర్మాలకు అన్ని వేళలా మేలు చేస్తుంది. ఇంకా వీలయితే ఈ స్క్రబ్ మిక్స్ లో జట్స్, తేనె,అర టీ స్పూన్ త్రిఫులా పొడి కలిపినా ఇంకా మంచిది. చర్మం మృదువుగా అయి ఎలాస్టిసిటీ మెరుగు పడుతుంది.

    ఇవి మంచి నేచురల్ స్క్రబ్స్

    ఎలాంటి స్క్రబ్స్  వాడితే చర్మం బావుంటుందోనని ఎప్పుడు డౌట్ వస్తూనే వుంటుంది. చర్మం మృదువుగా ప్రకాశవంతంగా వుండాలంటే  పెరుగు పసుపు కలిపిన స్క్రబ్ ఏ కాలంలో అయినా…

  • ఈ మధ్య కాలంలో నెయిల్ ఆర్ట్ పైన అమ్మాయిలు ఎంతో ఇష్టం చూపిస్తున్నారు. కానీ నైల్ ఆర్ట్ లో వాడే నెయిల్ పాలిష్ లో ఎసెంటోస్ ఎధిల్ లాక్టేట్, టేరస్తాలిక్ ఆసిడ్ వంటి అనేక రకాల రాసాయనాలుంటాయి గొల్లకు నెయిల్ పాలిష్ లోని పిగ్మేంట్ ను గాహిస్తాయి. కాబట్టి నెయిల్ ఆర్ట్ చేస్తున్నప్పుడు డార్క్ కలర్ నెయిల్ పాలిష్ వాడకూడదు. దిని వల్ల గోళ్ళపై మరకలు పడతాయి. ట్రాన్స్ పెరెంట్ నెయిల్ పాలిష్ అప్లై చేయాలి. ఆహారంలో కాల్షియం, విటమిన్, జింక్ సుప్ప్లిమెంట్స్ తీసుకుంటే గోళ్ళు ఆరోగ్యంగా వుంటాయి. కఠినమైన నెయిల్ పాలిష్ రిమూవర్లు వాడకూడదు. గోళ్ళు పొడిబారిపోతాయి. ఫాల్స్ ఎక్రలిక్ నెయిల్స్ పై నెయిల్ ఆర్ట్ మంచి ప్రత్యామ్నాయం.

    నెయిల్ ఆర్ట్ ఇష్టమైతే ఇలా చేయండి

    ఈ మధ్య కాలంలో నెయిల్ ఆర్ట్ పైన అమ్మాయిలు ఎంతో ఇష్టం చూపిస్తున్నారు. కానీ నైల్ ఆర్ట్ లో వాడే నెయిల్ పాలిష్ లో ఎసెంటోస్ ఎధిల్…

  • శాక్షి కపూర్ కూతురు శ్రద్దా కపూర్ ప్రముఖ విలన్ కనక ఆమెకు అవకాసాలు వస్తుంటాయి. అనుకోని అవకాశం ఎక్కడా లేదు. శ్రద్దా కపూర్ బాగా నటిస్తుంది. మంచి డాన్సర్ ఇప్పుడు కొత్తగా సొంతంగా పాటలు రాసుకుని ఓ లైవ్ కాన్సర్ట్ లో సంగీత ప్రియుల దగ్గర మంచి మార్కులు తెచ్చుకుంది. ఈ మ్యుజిక్ షోలు స్టేజ్ ఎక్కాక రాక్ స్టార్ అయిపోయానంటుంది శ్రద్ధా కపూర్. మ్యూజిక్ హాలు ప్రేక్షకుల జోరు తో భయాలన్నీ పోయి, మొదటి స్టేజ్ షోకే ఆ స్టేజ్ అంటే ప్రేమ పెరిగిపోయిందిట. భవిష్యత్తులో మంచి మ్యూజిక్ ఆల్బమ్స్ తెస్తనంటుంది. యాక్టర్ గా ఆమెకు ఎన్నో అవకాశాలు దావూద్ ఇబ్రహీం సోదరి హాసినా పార్కర్ జీవితం పైన నిర్మిస్తున్న హాసినా అన్న బయోపిక్ లో ఆమె నాటించ బోతుంది. సినిమాల్లో కూడా పాట పడుతుంది. శాస్త్రీయ సంగీతం నేర్చుకుంటుంది కూడా.

    లైవ్ మ్యుజికల్ షోల్లో శ్రద్ధా కపూర్

    శాక్షి కపూర్ కూతురు శ్రద్దా కపూర్ ప్రముఖ విలన్ కనక ఆమెకు అవకాసాలు వస్తుంటాయి. అనుకోని అవకాశం ఎక్కడా లేదు. శ్రద్దా కపూర్ బాగా నటిస్తుంది. మంచి…

  • పాతికేళ్ళ విరామం తరువాత అక్కినేని అమల సినిమాల్లో నాటించ బోతున్నారు. లిఫ్ ఈజ్ బ్యూటిఫుల్ చిత్రంలో సిల్వర్ స్క్రీన్ పైన రీ- ఎంట్రి ఇచ్చిన అమల ఇప్పుడు మలయాళంలో నటిస్తున్నారు. ఆంటోని సోని డైరెక్టర్ గా నిర్మిస్తున్న లేడి ఓరియెంటెడ్ సినిమా 'కేరాఫ్ సైరా భాను' లో పోస్ట్ ఉమెన్ గా మంజు వారియర్, లాయర్ గా అమల నిస్తున్నారు గతంలో సురేష్ గోపి, మోహన్ లాల్ పక్కన హీరోయిన్ గా నటించిన అమలకు ఇది మూడో మలయాళ సినిమా.

    మలయాళ సినిమాలో అమల

    పాతికేళ్ళ విరామం తరువాత అక్కినేని అమల సినిమాల్లో నాటించ బోతున్నారు. లిఫ్ ఈజ్ బ్యూటిఫుల్ చిత్రంలో సిల్వర్ స్క్రీన్ పైన రీ- ఎంట్రి ఇచ్చిన అమల ఇప్పుడు…

  • ముంబై స్పాట్ బిలియన్ మార్కెట్ లో అంతర్జాతీయ ట్రెండ్ అనుసరిస్తూ పసిడి ధర 10 గ్రాముల రేటు 31 వేలు దాటి పోయింది. రాజధాని ఢిల్లీ లో పది గ్రాముల బంగారం ధర 900 పెరిగి 31750 రూపాయిలు పలికింది. కాగా కిలో వెండి ధర 1390 రూపాయిలు పెరిగి 47370 రూపాయిలుంది. రానున్న రోజుల్లో కూడా బంగారం, వెండి ధర పెర్గుతూనే ఉంటుందని బులియన్ తట్రేడర్లు చెపుతున్నారు. ముంబాయి, హైదరాబాద్ వంటి నగరాల్లో బంగారం రోజువారి అమ్మకాలు రెండింతలు పెరిగాయి. పది గ్రాముల బంగారం ధర ని 12000 వరకు అధిక ధర చెల్లించి మరీ కొనుగోలు చేసారు

    31 వేలు దాటిన బంగారం ధర

    ముంబై స్పాట్ బిలియన్ మార్కెట్ లో అంతర్జాతీయ ట్రెండ్ అనుసరిస్తూ పసిడి ధర 10 గ్రాముల రేటు 31 వేలు దాటి పోయింది. రాజధాని ఢిల్లీ లో…

  • పడక గదిలో కొన్ని రకాల మొక్కలుంటే ప్రశాంతమైన నిద్ర పడుతుందని ఒక కొత్త పరిశోధన రిపోర్ట్ చెపుతోంది. సుగంధ మొక్కల నుంచి వచ్చే స్వచ్ఛమైన వాసనలు ఒత్తిళ్ల నుంచి దూరం చేస్తాయి. అలాగే ఈ హౌస్ ప్లాంట్స్ సహజమైన ప్యూరీఫైర్స్ కూడా. లావెండర్ ను సబ్బులతో సేన్టేడ్ బట్టలు షాంపూల్లో సువాసన కోసం ఉపయోగిస్తారు. ఈ మొక్క ఇంర్లో ఉంటే ఇల్లంతా సువాసనే. కేప్ జాస్మిన్ మొక్క న్యూరో ట్రాన్స్ మీటర్ పైన ప్రభావం చూపెడతాయి. నాసా అధ్యయనంలో స్నేక్ ప్లంట్ ఇంటిలో ఆక్సిజన్ స్వచ్ఛతను మెరుగుపరుస్తుంది. ఇక వెదురు మొక్క కయితే వాతావరణంలో అన్ని రకాల రసాయనాలను తొలగించే శక్తి వుంది. ఈ మొక్కకు ఎక్కువ సూర్యకాంతి కూడా అవసరం లేదు అలాగే మల్లె మొక్క ఇంటి ప్రాంగణంలో ఉంటే మంచి సూచన ఇస్తుంది. మంచిగా నిద్రపోయేందుకు ఈ సువాసన భరితమైన మొక్కలు ఉపయోగపడతాయి.

    నిద్ర కోసం ఈ సుగంధ మొక్కలు

    పడక గదిలో కొన్ని రకాల మొక్కలుంటే ప్రశాంతమైన నిద్ర పడుతుందని ఒక కొత్త పరిశోధన రిపోర్ట్ చెపుతోంది. సుగంధ మొక్కల  నుంచి వచ్చే స్వచ్ఛమైన వాసనలు ఒత్తిళ్ల…

  • ఈ సీజన్ లో చలి గాలుల వల్ల జ్వరాలు ఇతర ఇన్ఫెక్షన్లు ఎక్కువే. ద్రవ పదార్ధాలు ముఖ్యంగా సూప్ లు, టీ, కాఫీ వంటి వెచ్చని ద్రవాలు తాగడం వల్లనే ఇన్ఫెక్షన్ లను దూరంగా ఉంచొచ్చు. తాజా పండ్లు, కూరగాయలు, వీలైనన్ని సార్లు తినాలి. పెరుగు, ఓట్స్, బార్లీ, వెల్లుల్లి, చికెన్ సూప్, గ్రీన్ టీ, చిలకడ దుంపలు, లవంగాలు, అల్లం, మిరియాలు, పాసుపు, క్యాప్సికం, పాల కూర, బాదాం పప్పులు, పసుపు రోగ' నిరోధక శక్తిని పెంచుతాయి. చలిగా వున్నా సరే పావు గంట సేపు బ్రిస్క్ వాకింగ్ లేదా ఇతర ఏరోబిక్ వ్యాయామాలు ఏవి చేసినా రోగ నిరోధక వ్యవస్థ బలోపేతం అవుతుంది. వీలైనంత సేపు శరీరానికి సూర్య రశ్మి సోకే లాగా జాగ్రత్త పడాలి. బాగా నిద్రపోవాలి. ఆహారంలో ఐరన్ కి కీలక పాత్ర. విటమిన్-సి వుండే పదార్ధాలు తినడం వాల్ల శరీరం ఐరన్ ను బాగా గ్రహించగలుగుతుంది.

    ఈ సీజన్ లో ఇవి చాలా అవసరం

    ఈ సీజన్ లో చలి గాలుల వల్ల జ్వరాలు ఇతర ఇన్ఫెక్షన్లు ఎక్కువే. ద్రవ పదార్ధాలు ముఖ్యంగా సూప్ లు, టీ, కాఫీ వంటి వెచ్చని ద్రవాలు…

  • ఇరవై నిండే సరికే కాంపస్ ఉద్యోగాలు వచ్చేస్తున్నాయి అమ్మాయిలకు హటార్తుగా అధిక స్వేచ్చ వచ్చే సరికి చేతి నిండా వుండే డబ్బులతో ప్లానింగ్ వాళ్ళకు కాస్త కష్టమే. కానీ సంపాదన మొదలు పెట్టిన రోజు నుంచి పక్క ప్లాన్ వుండాలి. తాత్కాలిక దీర్గకాళిక ఆర్ధిక లక్ష్యాలు పెట్టుకోవాలి. భవిష్యత్తులో మంచి జీవితం కోసం ఇప్పుడు ఖర్చులపై అదుపు ఎవరికి వాళ్ళు నిర్ణయించుకోవాలి ముందుగా ఖర్చులు, మిగులు డబ్బుతో పొడుపు ఒక బుక్లో రాసి పెట్టుకోవాలి. స్నేహితులతో షాపింగ్ అనవసరం, సరదా కుడా , కానీ ఎంత ఖర్చు పెట్టి దాచుకున్నారు అంత డబ్బే అందుబాటులో వుంచుకోవాలి. షాపింగ్ మాల్స్ మాయాజాలం చేస్తాయి. ఎన్నో ఆఫర్లు కళ్ళు చెదిరే కొత్త దుస్తులు, అవసరమైన సామాన్లు ఉరిస్తాయి కానీ పొడుపు మంత్రం జపించండి. ఆర్ధిక పొరపాట్లు చేయొద్దు.

    ఆదాయానికి తగిన పొడుపు వుండాలి

    ఇరవై నిండే సరికే కాంపస్ ఉద్యోగాలు వచ్చేస్తున్నాయి అమ్మాయిలకు హటార్తుగా అధిక స్వేచ్చ వచ్చే సరికి చేతి నిండా వుండే డబ్బులతో ప్లానింగ్ వాళ్ళకు కాస్త కష్టమే.…

  • చాలా మంది హీరోయిన్లు మోడలింగ్ లోంచి ప్రకటనల్లో మెరిసిపోయి సినిమా రంగానికి వచ్చినవాళ్లే. అలాగే కృష్ణ గాడి వీర ప్రేమ గాధ సినిమాతో వెండి తెరకి పరిచయం అయినా మెహ్రీన్ పీర్ జదా కూడా వాణిజ్య ప్రకటనల్లో నటిస్తూనే సినీ రంగంలో కాలుపెట్టిందని డవ్ ,పియర్స్ , నికాన్ ,హీరో విశాల్ తో థమ్స్ అప్ ఇవన్నీ ఆమెకు పేరు తెచ్చాయి. ఇక అవకాశాలకు తిరుగులేదు. హిందీ లో అనుష్క శర్మ నిర్మించిన ఫిల్లరీ కూడా విడుదలకు సిద్ధంగా వుంది. మెహ్రీన్ పుట్టింది పంజాబ్ లో పెరిగింది ఢిల్లీ లో. చదువు కెనడా లో. కెనడా లో జరిగిన మిస్ దక్షిణాసియా కనడ పోటీల్లో మిస్ పర్సనాలిటీ గా నెగ్గింది. చిన్నపుడైతే క్రాఫు ,ప్యాంటు షర్టులతో తిరిగేదట. ఇప్పుడీ అమ్మాయి మోడల్ ఫొటోలో చుస్తే ఈమె సినిమాల కోసం పుట్టిందనిపిస్తోంది.

    ప్రకటనల్లోంచి సినిమాల్లో కొచ్చిన మెహ్రీన్

    చాలా మంది హీరోయిన్లు మోడలింగ్ లోంచి ప్రకటనల్లో మెరిసిపోయి సినిమా రంగానికి వచ్చినవాళ్లే. అలాగే కృష్ణ గాడి వీర ప్రేమ గాధ సినిమాతో వెండి తెరకి పరిచయం…

  • జుట్టు పొడిబారిపోయి ఎండు గడ్డిలా కనిపిస్తూ ఉంటే కొబ్బరిపాలు ఈ సమస్యకి పరిష్కారం. కొబ్బరిపాలంటే తాజా కొబ్బరి నూనె కదా. పచ్చి కొబ్బరి గ్రైండ్ చేసి ఆ పలు తలకు రాసుకుని మర్దన చేస్తే జుట్టు చివర్లో చిట్లిపోకుండా ఉంటాయి. కొబ్బరిపాలలోవుండే పోషకాలు జుట్టు ఒత్తుగా ఎదిగేలా చేస్తాయి. ముఖానికి వేసుకున్న మేకప్ తొలగించాలన్నా కొబ్బరి పాలలో ఆలివ్ నూనె కలిపి దూది లో నెమ్మదిగా క్లీన్ చేస్తే మేకప్ పోవటమే కాకుండా చర్మం మృదువుగా ఉంటుంది. జిడ్డు చర్మ తత్త్వం ఉన్నవాళ్లు మొటిమల సమస్య ఉంటే కొబ్బరిపాలను క్లీన్సర్ గా ఉపయోగించవచ్చు. కొబ్బరిపాలలో సాగే గుణం ముడతలు నివారిస్తుంది. ఈ పాలను నాలుగైదు బాదాం గింజల్ని నానబెట్టి మెత్తగా గ్రైండ్ చేసి మాస్క్ వేసుకుంటూ ఉంటే వయసు రీత్యా వచ్చే మడతలు పోగొడుతుంది.

    కొబ్బరి పాలతో ఎన్నో పోషకాలు

    జుట్టు పొడిబారిపోయి ఎండు గడ్డిలా కనిపిస్తూ ఉంటే కొబ్బరిపాలు ఈ సమస్యకి పరిష్కారం. కొబ్బరిపాలంటే తాజా కొబ్బరి నూనె కదా. పచ్చి కొబ్బరి గ్రైండ్ చేసి ఆ…

  • పిల్లలకు స్టార్ కిడ్స్ ట్రీట్ మెంట్ వద్దనుకుంటున్నారు సెలబ్రెటీస్. పిల్లలకి జీవితపు విలువలు తెలుసుకోవటం ముఖ్యం అంటున్నారు. కోట్ల కొద్దీ డబ్బు సంపాదిస్తూ పిల్లలకి వారసత్వంగా వట్టి సంపద మాత్రమే కాదు. డబ్బు విలువ తెలియజెప్పి సొంతంగా సంపాదించేలా పెంచాలంటున్నారు. కెరీర్ పీక్ లోఉండగా అజయ్ దేవగన్ ని పెళ్లాడిన కాజోల్ కు ఇద్దరు పిల్లలు నైసా ,యుగ్. వాళ్ళని అజయ్ దేవగన్ కాజోల్ పిల్లలుగా సెలబ్రేటీలుగా ప్రపంచం ముందు పెట్టటం కాకుండా డిసిప్లిన్ తో స్ట్రిక్ట్ గా మళ్ళీ ఫ్రెండ్లీ గా పెంచుతున్నానంటోంది కాజోల్. పిల్లలు పెద్దవుతూ నీ డ్రెస్ బావుంది అన్న రోజునుంచి నా డ్రెస్సింగ్ విషయంలో ఆచి తూచి అడుగులు వేసాను. వాళ్లిద్దరూ వాళ్ళ 15 సంవత్సరాల వయసు నుంచే సంపాదన మొదలుపెట్టాలి. వాళ్ళ మనసులో పని నీతి నాటాలనుకున్నానంటోంది కాజోల్. వాళ్ళకి అవసరమైన వాటికంటే ఎక్కువే వున్నాయి. కానీ ఆ విషయం వాళ్లకు తెలియనివ్వను. వాళ్ళు పరిపూర్ణ వ్యక్తిత్వంతో పెరిగి పెద్దవాళ్లవ్వనివ్వాలి అంటోందామె.

    వాళ్ళు మాములు పిల్లల్లా ఎదగాలి

    పిల్లలకు స్టార్ కిడ్స్ ట్రీట్ మెంట్ వద్దనుకుంటున్నారు సెలబ్రెటీస్. పిల్లలకి జీవితపు విలువలు తెలుసుకోవటం ముఖ్యం అంటున్నారు. కోట్ల కొద్దీ డబ్బు సంపాదిస్తూ పిల్లలకి వారసత్వంగా వట్టి…

  • ప్రముఖ ఇండియన్ డిజైనర్ లకు ఫ్యాషనిష్ఠాలకు ఇంకా మరెందరికో సోనమ్ కపూర్ ఇప్పుడు స్టయిల్ ఐకాన్. కార్డియో స్విమ్మింగ్ పవర్ యోగా కథక్ లతో ఇవాళ్టి రూపాన్ని సాధించారామె. ఇలాంటి నాజూకు తనం కోసం ఎంతో కఠోర శ్రమ చేసింది సోనమ్. దశాబ్దం క్రితం సింగపూర్ లో ఆమె చదువుకునేటప్పుడు ఆమె బరువు 87 కిలోలు. ఎలాంటి ఆహార నియమాలు లేవు. సంజయ్ లీలా భన్సాలీ లో సావరియా సినిమాతో ఆమె ఫిట్ నెస్ పైన దృష్టి పెట్టింది. ఆ ఛాలెంజ్ నిఅలవోకగా జయించి 32 కేజీల బరువు తగ్గిందామె. ఈ బరువు తగ్గే పనిలో సోనమ్ అనేక మంది ట్రైనర్లు శిక్షణ ఇచ్చారు. ఒక విభాగంలో ఒక ట్రైనర్. ఆమె మంచి కథక్ డాన్సర్. పుడుతూనే ఎవ్వరికీ మంచి సౌందర్యం ఆకృతి ఉండదు. ఎదిగే కొద్దీ శరీరాన్ని చక్కగా మలుచుకోవాలి. ఇప్పటి తారలు వాళ్ళు రెడ్ కార్పెట్స్ పైన నడవటం కోసం వెండి తెరపై మెరవటం కోసం ఎనెన్ని కష్టాలు పడ్డారు? ఎంత నోరు కట్టేసుకున్నారు?

    అందం వెనక ఎంతో కధ వుంది

    ప్రముఖ ఇండియన్ డిజైనర్ లకు ఫ్యాషనిష్ఠాలకు ఇంకా మరెందరికో సోనమ్ కపూర్ ఇప్పుడు స్టయిల్ ఐకాన్. కార్డియో స్విమ్మింగ్ పవర్ యోగా కథక్ లతో ఇవాళ్టి రూపాన్ని…

  • హౌస్ అఫ్ రెప్రజెంటేటివ్స్ కు ఎంపికైన తోలి భారతీయ అమెరికన్ గా ప్రమీల రికార్డు సృష్టించారు. సియాటెల్ నుంచి 51 సంవత్సరాల ప్రమీల జయ్ పాల్ ప్రతినిధుల సభకు ఎంపికైనవారు. తొలి ప్రయత్నంలో ఈమె కాంగ్రెస్ కు ఎంపికయ్యారు. చెన్నయ్ లో జన్మించిన ప్రమీల కుటుంభం ఆమె ఐదేళ్ల వయసులో ఇండోనేషియా సింగపూర్ అక్కడనుంచి అమెరికాకు వలస వెళ్లారు. ఈమె రాసిన ఫిలిగ్రిమేజ్ టు ఇండియా - ఏ ఉమెన్ రీ విజిట్స్ హోమ్ లాండ్ అన్న పుస్తకం 2000 లో ప్రచురితమైంది. మాజీ అధ్యక్షుడు జిమ్మీ కార్టర్ ప్రమీల అభిర్దితావన్ని బలపరిచారు.

    ప్రమీలా జయ పాల్ విజయం

    హౌస్ అఫ్ రెప్రజెంటేటివ్స్ కు ఎంపికైన తోలి భారతీయ అమెరికన్ గా ప్రమీల రికార్డు సృష్టించారు. సియాటెల్ నుంచి 51 సంవత్సరాల ప్రమీల జయ్ పాల్ ప్రతినిధుల…