Monday, 03 Aug, 2026

ఎనిమిది వేలే ఆమె పెట్టుబడి

నేవీ ఆఫీసర్ భార్య గా ఇంటి పనులు , ఇద్దరు పిల్లల ఆలనా పాలనా బాధ్యతలు చూసుకుంటు గృహిణిగా ఒక పరిమిత జీవితం గడిపిన మీనా బింద్రా 40 ఏళ్ల వయసులో తన ఇంటి నుంచే సాధారణ కాటన్ ప్రింటెడ్ సూట్లను అమ్మటం మొదలు పెట్టారు. 86 లో బిబా పేరుతో ఆమె బిజినెస్ మొదలైంది.ఢిల్లీ లో పుట్టి పెరిగిన మీనా బింద్రా  రెడీ టు వేర్  ఫ్యాషన్ బ్రాండ్ బీబాతో ఎత్నిక్ వేర్ రంగంలో విప్లవాత్మకమైన మార్పులు తీసుకుని వచ్చి అందరికీ మార్గదర్శకురాలిగా నిలిచారు.ఆ రోజుల్లో రెడీమేడ్ చుడిదార్  కుర్తాలకు అనువైన వస్త్రాల సేకరణ ఒక  సవాలుగా ఉండేది. తనదైన ఒక ప్రత్యేకమైన నైపుణ్యంతో ముందుకు దూసుకుపోతూ మీనా ఎనిమిది వేల రూపాయలతో తను ప్రారంభించిన చిన్న బొటిక్ ను   కోట్లాది రూపాయల విలువైన బిబా అపెరల్స్ కంపెనీగా మార్చింది. ఈరోజు దాని వార్షిక టర్నోవర్ 650 కోట్లు.ఒక చిన్న పెట్టుబడి తో ఒక చిన్న వ్యాపారి గా ప్రయాణం మొదలుపెట్టిన కోట్లకు పడగ లెత్తటం మామూలు విషయం కాదు ఆమె కృషికి  హురూన్ ఇండియా ఉమెన్స్ లీడర్స్ లిస్ట్ లో ఆమె పేరు నమోదు చేసింది.

Leave a Reply