• ఉద్యోగం వచ్చాకా ఒక భరోసా వస్తుంది. చేతిలో ఉన్న జీతం మొత్తం ఖర్చు చేసినా నెలాఖరున మళ్ళీ జీతం వస్తుంది కదా అని. ఆ ధైర్యం తోనే ఎన్నో షాపింగ్ లు చేసేస్తారు. కానీ ఆర్ధిక నిపుణులు సంపాదన మొదలు పెట్టిన రోజు నుంచే పొదుపు పట్ల అవగాహన పెంచుకోమంటున్నారు. ఖర్చుల విషయంలో ఆచి తూచి వ్యవహరించటం అలవాటు చేసుకోవటం. దీర్ఘకాలిక లక్ష్యాలు నిర్ణయించుకుని ఆర్ధిక పథకాల్లో మదుపు చేయటం బంగారం కొనుక్కోవటం భవిష్యత్తు గురించి ఆలోచించుకోవటం కోరి నేర్చుకుని ఆచరించవలిసిన విషయాలు. దుస్తుల విషయంలో ఎవరికైనా కాస్త కంట్రోల్ తప్పుతూ ఉంటుంది. షాపింగ్ కు వెళ్లే ముందరే ఒక్కసారి అల్మారా వైపు దృష్టి సాధించాలి. అవసరం ఉంటేనే కొనుక్కోవాలనే నియమం పెట్టుకోవాలి. ఇది దుస్తులకే కాదు అలంకరణ సామాగ్రి చెప్పులు ఫంకీ జ్యూవెలరీ అన్నింటికీ వర్తిస్తుంది. స్నేహితులతో ఏ హోటల్లోనే తినేయటం ఉంటుంది. ఇది నెలల్లో ఒకటో రెండో సార్లని నియమం పెట్టుకోవాలి. డబ్బు విషయంలో పాటించే నిగ్రహం భవిష్యత్తు లో ఆందళోన లేకుండా ఉండేందుకే నని గుర్తుపెట్టుకుంటే చాలు.

    అదే పనిగా కొనేస్తే నష్టం కూడ

    ఉద్యోగం వచ్చాకా ఒక భరోసా వస్తుంది. చేతిలో ఉన్న జీతం మొత్తం ఖర్చు చేసినా నెలాఖరున మళ్ళీ జీతం వస్తుంది కదా అని. ఆ ధైర్యం తోనే…

  • ఇరవై నిండే సరికే కాంపస్ ఉద్యోగాలు వచ్చేస్తున్నాయి అమ్మాయిలకు హటార్తుగా అధిక స్వేచ్చ వచ్చే సరికి చేతి నిండా వుండే డబ్బులతో ప్లానింగ్ వాళ్ళకు కాస్త కష్టమే. కానీ సంపాదన మొదలు పెట్టిన రోజు నుంచి పక్క ప్లాన్ వుండాలి. తాత్కాలిక దీర్గకాళిక ఆర్ధిక లక్ష్యాలు పెట్టుకోవాలి. భవిష్యత్తులో మంచి జీవితం కోసం ఇప్పుడు ఖర్చులపై అదుపు ఎవరికి వాళ్ళు నిర్ణయించుకోవాలి ముందుగా ఖర్చులు, మిగులు డబ్బుతో పొడుపు ఒక బుక్లో రాసి పెట్టుకోవాలి. స్నేహితులతో షాపింగ్ అనవసరం, సరదా కుడా , కానీ ఎంత ఖర్చు పెట్టి దాచుకున్నారు అంత డబ్బే అందుబాటులో వుంచుకోవాలి. షాపింగ్ మాల్స్ మాయాజాలం చేస్తాయి. ఎన్నో ఆఫర్లు కళ్ళు చెదిరే కొత్త దుస్తులు, అవసరమైన సామాన్లు ఉరిస్తాయి కానీ పొడుపు మంత్రం జపించండి. ఆర్ధిక పొరపాట్లు చేయొద్దు.

    ఆదాయానికి తగిన పొడుపు వుండాలి

    ఇరవై నిండే సరికే కాంపస్ ఉద్యోగాలు వచ్చేస్తున్నాయి అమ్మాయిలకు హటార్తుగా అధిక స్వేచ్చ వచ్చే సరికి చేతి నిండా వుండే డబ్బులతో ప్లానింగ్ వాళ్ళకు కాస్త కష్టమే.…