Tuesday, 04 Aug, 2026

అమ్మ సేవలో మాతంగి

సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి దేవాలయంలో 30 ఏళ్లుగా రంగం ఎక్కి భవిష్య వాణి చెప్తున్నారు మాతంగి స్వర్ణలత. తరతరాల వంశాచారాన్ని కొనసాగిస్తూ దేవుడి ముచ్చటలను భక్తులకు చెప్తున్న మాతంగి అమ్మకు నైవేద్యం పెట్టనిదే నీళ్లు కూడా తాగదు.సికింద్రాబాద్ లోని తుకారాం గేట్ లో పుట్టి పెరిగిన స్వర్ణలత పదో తరగతి చదువుకుంది ప్రైవేట్ స్కూల్లో ప్రైమరీ క్లాస్ టీచర్ గా పనిచేస్తుంది మంగళ శుక్రవారం మహంకాళి ఆలయంలో సేవ చేస్తుంది. ఒంటరి మహిళలకు ఇచ్చే పింఛను దేవాలయం నుంచి వచ్చే ఆర్థిక సాయం ఆమెకు జీవనాధారం. ఆమె కుటుంబంలో ఆమె నాయనమ్మలు జోగమ్మ బాలమ్మ, పోచమ్మ , బాగమ్మ పచ్చి కుండ మీద నిలబడి దేవుని ముచ్చట చెప్పేవారు.ఆ తర్వాత ఆ వారసత్వం ఆమె అక్క స్వరూప రాణి కొనసాగించింది.తర్వాత ముత్యాలమ్మ గుడి లో స్వర్ణలత కు దేవుడితో పెళ్లి చేశాక ఇక అమ్మవారి సేవకే ఆమె జీవితం అంకితం అయ్యింది. వారి కుటుంబంలో ఈ సంప్రదాయం కొనసాగించే వారిలో ఈమెది ఏడవ తరం.దేవుడిని పెళ్ళాడి జీవితాంతం అమ్మ సేవలోనే గడపటం మాతంగి కులాచారం. కత్తిని పెళ్ళాడి అమ్మవారి సేవలో గడుపుతున్న మాతంగి స్వర్ణలత తరతరాల సంప్రదాయానికి ప్రతినిధి.

Leave a Reply