జూడో లో బంగారు పతకం
అస్మిత డే గ్లాస్గో కామన్వెల్త్ జూడో లో 48 కేజీల విభాగంలో స్వర్ణం సాధించి దేశానికి తొలి గోల్డ్ మెడల్ అందించింది. త్రిపుర లోని బెలోనియా అనే చిన్న పట్టణంలో అస్మితా డే నిరుపేద కుటుంబంలో జన్మించింది. ఆమె తండ్రి అర్జున్ కుమార్ ఒక చిన్న సైకిల్ రిపేర్ షాప్ నడిపేవాడు. రోజుకు 300 ఆయన సంపాదన .అయినా కూతురును అంతర్జాతీయ క్రీడా కారిణి గా చూడాలని అస్మిత కు జూడో పరిచయం చేసి లక్షల అప్పు చేసి ఆమెను జూడో సెంటర్ లో చేర్పించాడు. కుమార్తె సాధించిన చారిత్రాత్మక విజయాన్ని చూడకుండానే ఆయన మరణించారు.అస్మిత లోని ప్రతిభను గుర్తించిన త్రిపుర స్పోర్ట్స్ స్కూల్ కోచ్ లు బీనా దేబ్‌నాథ్, మాణిక్ లాల్ దేబ్ ఆమెకు ఉచితంగా శిక్షణ ఇచ్చారు .గత కొన్ని సంవత్సరాలుగా జూనియర్ ఆసియా కప్,ఆఫ్రికన్ ఓపెన్ లో పతకాలు సాధించిన అస్మిత కు రెండేళ్ల క్రితం యూపీ పోలీస్ ఎస్సై పోస్ట్ ఇచ్చారు.గ్లాస్గో వేదిక గా జరిగిన పోటీలో అస్మిత కెనడాకు చెందిన బలమైన ప్రత్యర్థి హేడీ క్యాచ్ తో తలపడి విజయం సాధించింది.
