July 2026
లావణి నృత్య రాణి విఠాబాయి
మహారాష్ట్రలోని సోలాపూర్ జిల్లా పండరిపూర్ లో 1935లో జన్మించింది విఠాబాయి నారాయణ గాస్కర్. మహారాష్ట్ర జానపద కళలైన తమాషా,లావణి నృత్యానికి కొత్త గుర్తింపు తెచ్చింది విఠాబాయి దశాబ్దాలుగా ఈ కళకి అంకితమైన కుటుంబం ఈమెది.అసాధారణమైన ప్రతిభ తో చిన్న వయసులోనే బృందాల్లో ప్రధాన నర్తకి గా ఉన్నది. తమాషా సామ్రాజ్ఞి లావణ్య దిగ్గజం వంటి బిరుదులు పొందారీమే.ఈ రంగంలో అందించిన సేవలకు రెండు సార్లు రాష్ట్రపతి అవార్డు అందుకున్నారు.ఆమె చనిపోయిన నాలుగేళ్లకు రాష్ట్ర ప్రభుత్వం జీవన […]
ఇక్కడ కాఫీ రుచి అద్భుతం
అత్యంత రుచిగా ఉండే కాఫీల్లో మెక్ డోనాల్డ్ కాఫీ కూడా ఒకటి.క్యూబా నుంచి వలస వచ్చిన డాన్ ఫ్రాన్సిస్కో తను స్థాపించిన గవీనా గోర్మే కాఫీ పొడిని ఈ రెస్టారెంట్ కి సరఫరా చేస్తాడు . క్యూబా లోని కాఫీ ఎస్టేట్ లో పుట్టిన ఫ్రాన్సిస్కో కాఫీ రుచిని చిన్నప్పటి నుంచే తెలుసుకున్నాడు.కాలిఫోర్నియాలో అతని కాఫీ ఫ్యాక్టరీ లో దొరికే కాఫీ గింజలు చాలా తాజావి. అవి ఆకుపచ్చ రంగులో ఉండగానే ఇక్కడ కు వస్తాయి.ఇందులో అసలు […]
అమ్మ రూపం అతి సుందరం
తమిళనాడులోని మధురై లో ఉన్న మీనాక్షి దేవాలయం దక్షిణ భారత సంస్కృతికి ఒక ప్రధాన కేంద్రంగా లక్షలాది మంది సందర్శకులను ఆకర్షిస్తోంది.ఈ దేవాలయం 15 ఎకరాల విస్తీర్ణంలో అపూర్వమైన నిర్మాణ శైలిలో ఒక సుందర నగరంలా ఉంటుంది.ప్రధాన దేవత మీనాక్షి.ఆమె మధురై ప్రాంత పాలకురాలు శక్తికి సంతానోత్పత్తికి ఆమె అధిదేవత.రోజువారీ ఆచారాలు పూజలు ఎంతో భక్తితో నిర్వహిస్తారు.అత్యంత ముఖ్యమైన ఆచారం రాత్రిపూట జరిగే పల్లియారై పూజ.ఒక పల్లకిలో సుందరేశ్వరుని,మీనాక్షి మందిరానికి విశ్రాంతి కోసం తీసుకుపోయే పూజ చాలా […]
గెలుపే నాకు బహుమతి!
సినిమా రంగంలో కే భాగ్యరాజ్ సినిమా వీట్ల విశేషం లో కథానాయకగా సినిమా రంగంలోకి అడుగు పెట్టింది ప్రగతి మహావాది. ఆమెకు ఫిట్నెస్ పట్ల ఎంతో ఇష్టం వ్యాయామాన్ని ఒక క్రీడలా చూస్తూ పవర్ లిఫ్టింగ్ లోకి అడుగు పెట్టింది ప్రగతి.ఎన్నో బంగారు వెండి పతకాలు గెలుచుకుంది. నవంబర్ 2023లో బెంగళూరులోని ఇంజినీర్స్ అసోసియేషన్ ఆడిటోరియం వేదికగా నిర్వహించిన సౌత్ ఇండియా పవర్ లిఫ్టింగ్ ఛాంపియన్ షిప్ లో సిల్వర్ మెడల్ సాధించి ఫిట్నెస్ రంగంలో ఒక […]
గిన్నిస్ బుక్ లో టీచరుగారు
సాధారణంగా టీచర్లకు 60 ఏళ్లకు రిటైర్మెంట్ ఉంటుంది కానీ 90 ఏళ్ళు వచ్చినా అలుపెరగకుండా పాఠాలు చెప్తూ ప్రపంచంలో సుదీర్ఘకాలం సేవలు అందించిన భాషా ఉపాధ్యాయురాలుగా గిన్నిస్ బుక్ కి ఎక్కింది బెవెర్లీ హానెట్ ప్రైస్. ఆమెకు చిన్నతనం నుంచి చదువు అంటే చాలా ఇష్టం. గ్రాడ్యుయేషన్ పూర్తి చేశాక 1958 లో ఆంగ్ల ఉపాధ్యాయురాలిగా కెరీర్ మొదలు పెట్టింది. సైన్సు సాంకేతిక జోడించి ఆమె చెప్పే పాఠాలు పిల్లల్ని ఆకట్టుకునేవి .విద్యార్థులకు పాఠ్యాంశాల తో పాటు […]
గ్రామీణ యువత ఉపాధి కి సాయం
జోహో కంపెనీ లో ప్రధాన వాటాదారుగా ఉన్న రాధా వెంబు చెన్నైలో జన్మించారు .ఐఐటి మద్రాస్ లో ఇండస్ట్రియల్ మేనేజ్‌మెంట్ లో డిగ్రీ పూర్తి చేశారు.1996లో సోదరుడు వెంబు తో కలిసి అడ్వెంట్ నెట్ అనే సంస్థ ప్రారంభించారు. అదే కార్యక్రమంలో జోహో గా మారింది. ప్రపంచవ్యాప్తంగా ఎన్నో వ్యాపార సంస్థలకు క్లౌడ్ ఆధారిత సాఫ్ట్ సేవలు అందిస్తుంది జోహో. ఈరోజు ఈ కంపెనీ టాప్ గ్లోబల్ టెక్నాలజీ కంపెనీల్లో ఒకటి. 2024 లో హురున్ […]
మహిళా సాధికారత లక్ష్యం!
ఢిల్లీలోని శ్రీరామ్ కాలేజీలో చదువుకున్న అన్య విగ్ ‘హర్ హక్’ అనే స్వచ్ఛంద సంస్థ స్థాపించింది. మహిళా సాధికారత,నెలసరి ఆరోగ్యం,లింగ సమానత్వం పైన ఈ ట్రస్టు పనిచేస్తుంది.పాఠశాలలు,మురికి వాడలు ఎన్జీవోల్లో అవగాహన సదస్సులు నిర్వహిస్తారు. పీరియడ్స్ సమయంలో ఇంట్లో ఉండే మహిళలకు కుటుంబ వ్యక్తులు ఎలా సాయం చేయాలో చెప్తారు.కొందరు ఎన్జీవోల సహకారంతో సానిటరీ నాప్కిన్ వెండింగ్ మిషన్ లను ఏర్పాటు చేశారు.ఈ సంస్థను దేశవ్యాప్తంగా విస్తరింప చేయాలని అన్య లక్ష్యం.ప్రస్తుతం ఢిల్లీ, హర్యానా,ఉత్తర ప్రదేశ్,రాజస్థాన్ వంటి […]
రికార్డులు తిరగరాసింది
భువనేశ్వర్ లో జరిగిన జాతీయ అథ్లెటిక్స్ ఛాంపియన్ షిప్ లో 6.88 మీటర్లు దూకి భారత దేశపు సరికొత్త లాంగ్ జంప్ క్వీన్ గా అవతరించింది ఆన్సీ సోజన్. ఆమె తండ్రి సోజన్ ఈటి కూడా ఒకప్పుడు అథ్లెట్. పేదరికంతో ఆటలు పక్కనపెట్టి ఆటో డ్రైవర్ గా మాత్రమే జీవితం గడిపాడు. ఆయన కలలను కూతురు సాకారం చేసింది.సోజన్ పంజాబ్ లో జరిగిన జాతీయ పాఠశాలల అథ్లెటిక్ మీట్ లో 6.26 మీటర్లు దూకినప్పుడు తొలిసారిగా జాతీయ […]
శాస్త్రీయ సంగీత గాయనికి సత్కారం
‘రాయల్ బర్మింగ్‌హామ్ కన్సర్వేటోర్’ విద్యాసంస్థ నుంచి అరుదైన సత్కారం పొందిన తొలి భారతీయ గాయనిగా డాక్టర్ రాధిక బాలకృష్ణన్ రికార్డు సృష్టించారు.కర్ణాటక సంగీతానికి అంతర్జాతీయ వేదిక పైన అరుదైన గౌరవం దక్కింది. బ్రిటన్ లోని అత్యంత ప్రతిష్టాత్మకమైన రాయల్ బర్మింగ్‌హామ్ విద్యాసంస్థ ప్రముఖ భారతీయ కర్ణాటక సంగీత గాయని డాక్టర్ రాధిక బాలకృష్ణన్ ను సత్కరించింది. ఈ విద్యా సంస్థ ప్రపంచవ్యాప్తంగా కళలు, విద్య సంస్కృతి రంగాల్లో అత్యున్నత సేవలు అందించిన ప్రముఖులకు ఈ గౌరవ సభ్యత్వాన్ని […]
చెత్త సేకరణకు రోబో !
ఢిల్లీ లోని అమిటి ఇంటర్నేషనల్ స్కూల్‌లో 12వ తరగతి చదువుతున్న మహి మల్హానీ ఏఐ ఆధారిత రోబో డస్ట్ బిన్ ను తయారు చేసింది.ఈ రోబో స్మార్ట్ ఫోన్ యాప్ ద్వారా నియంత్రిస్తే పనిచేస్తుంది.దానంతట అదే తిరిగి వ్యర్థాలను సేకరిస్తుంది.కార్ పార్కింగ్ సెన్సార్ల మాదిరిగా ఇందులోని అల్ట్రాసోనిక్ సెన్సార్లు పనిచేస్తాయి.ధ్వని తరంగాలను పంపి సమీపంలోని వస్తువును తీసుకునేందుకు ఉపయోగపడతాయి.రోబో కూడా దారిలో ఏదైనా అడ్డంకులు ఎదురైతే ఆగిపోతుంది లేదా పక్కకు తిరిగి పోతుంది.వ్యర్థాలను వేరు చేయడానికి ట్రాష్ […]
ఆర్థిక లావాదేవీలకు కొత్త యాప్!
ఆర్థిక క్రమశిక్షణ కోసం ‘రెంటెన్‌పే’ యాప్ రూపొందించింది సారిక శెట్టి.ముంబైలో పుట్టి పెరిగిన సారిక ఎంబీఏ పూర్తి చేసింది.2004 నుంచి ఫోర్డ్,ఫోక్స్ వ్యాగన్,బీఎండబ్ల్యూ వంటి సంస్థల్లో పని చేసింది.ఆ తర్వాత సొంతంగా రెంటెన్‌పే యాప్ తయారు చేసింది .డెబిట్ క్రెడిట్ కార్డు లాగే దీనికి ఒక డిజిటల్ కార్డు అప్లికేషన్ ఉంటాయి. నెలవారీ అద్దె చెల్లింపులు దగ్గర నుంచి జీతం ఇతర లోన్లు వివరాలు వంటివన్నీ ఇందులో నమోదు చేయాలి. ఆటోపే లని యాక్టివేట్ చేయాలి. ఇవన్నీ […]
వీళ్లే దేశానికి స్ఫూర్తి
*Zomato, Swiggy, Bigbasket, Flipkart లాంటి పెద్ద కంపెనీలకు రాశీ అగర్వాల్ EV స్కూటర్లు, ఆటోలు సప్లై చేస్తోంది.ఇలాంటి ఆడపిల్లలే ఇప్పుడు దేశానికి స్ఫూర్తి.ఈమె నడిపిస్తున్న కంపెనీ పేరు ఈవీ-యాజ్-ఎ-సర్వీస్. డెలివరీ పార్ట్నర్లు రోజువారీ అద్దె చెల్లించి ఇక్కడ వాహనాలు తీసుకుంటారు. ప్రస్తుతం ఇక్కడ నుంచి మెట్రోల్లో 22 వేలకు పైగా ఎలక్ట్రిక్ బైకులు వెయ్యికి పైగా త్రీ వీలర్లు నడుపుతున్నారు ఢిల్లీ,బెంగళూరు,ముంబై, హైదరాబాదు, జైపూర్, ఫరీదాబాద్ ల్లో ఈ కంపెనీ పని చేస్తోంది. ఈ కంపెనీకి […]
కొత్త చరిత్రకు శ్రీకారం
అనాదిగా వస్తున్న పాదుకా దస్తూర్ ఆచారాన్ని ఒక సాంప్రదాయ చట్టాన్ని తిరగరాస్తూ ఖేర్వాగఢ్ సింహాసనాన్ని 13 ఏళ్ల బాలిక తేజస్వి కుమారి జోధా అధిష్టించింది. ఇటీవల ఆ వంశ పెద్ద హరీష్ చంద్ర జోధా అకాల మరణం చెందారు ఆయనకు పుత్ర సంతానం లేదు కుమార్తె తేజస్వి జోధా మాత్రమే ఉంది.కోట వారసత్వాన్ని ముందుకు తీసుకుపోయేందుకు ఇంతవరకు రాజస్థాన్ లో కొనసాగుతున్న ఒక సంప్రదాయ పద్ధతిని పక్కన పెట్టి తేజస్వి కుమారి కి వంశ వారసత్వ […]
ఆరు రెస్టారెంట్ల యజమాని!
దక్షిణాయన్ హోటళ్ల యజమాని బినా గాంధీ .సాధారణ గృహిణి నుంచి మొదలైన ఆమె ప్రస్థానం ఇప్పుడు ఆరు రెస్టారెంట్లకు యజమానిగా ఉంది.మొదట్లో రుబ్బిన దోశ పిండి సాంబార్ ,రసం, చట్నీ,లెమన్ రైస్ కూడా అమ్మేవాళ్లు.తర్వాత ఈవెంట్లకు క్యాటరింగ్ చేశారు.ఇందుకోసం ప్రత్యేకంగా రకరకాల దోశలు, ఊతప్పాలు,ఇడ్లీలు వంటివి తయారు చేసేది బీనా గాంధీ.అహ్మదాబాద్ లో 2000 లో తొలి దక్షిణాయన్ హోటల్ ప్రారంభించింది. ఆ మొదటి రెస్టారెంట్ ను సినిమా తారలు సందర్శించి ఆమె వండిన పదార్థాలు రుచి […]
ఆరోగ్యాన్ని ఇచ్చే వంట పాత్రలు
టెన్ కాశీ లో పుట్టిన మీరా రామకృష్ణన్ జిష్ట అనే పేరుతో సంప్రదాయ వంట పాత్రల తయారీ అమ్మకం మొదలు పెట్టింది 15 రాష్ట్రాల్లో 650 మంది కళాకారులతో ఈ పాత్రలు తయారు చేయించి విక్రయాలు మొదలు పెట్టింది. తమిళనాడు కేరళ సరిహద్దుల్లో తయారయ్యే సెంగొట్టాయి దోస కల్లు అనే దోసెల పెనాలు, కుంభకోణంలో తయారయ్యే ఈయ చోంబు అనే రసం పాత్ర,రాతి పాత్ర ల వంటివి జిష్ట పేరుతో అమ్ముతోంది.2021 లో చెన్నైలో మొదటి దుకాణాన్ని […]
