Sunday, 05 Jul, 2026

రికార్డులు తిరగరాసింది

భువనేశ్వర్ లో జరిగిన జాతీయ అథ్లెటిక్స్ ఛాంపియన్ షిప్ లో 6.88 మీటర్లు దూకి భారత దేశపు సరికొత్త లాంగ్ జంప్ క్వీన్  గా అవతరించింది ఆన్సీ సోజన్. ఆమె తండ్రి సోజన్ ఈటి కూడా ఒకప్పుడు అథ్లెట్. పేదరికంతో ఆటలు పక్కనపెట్టి ఆటో డ్రైవర్ గా మాత్రమే జీవితం గడిపాడు. ఆయన కలలను కూతురు సాకారం చేసింది.సోజన్ పంజాబ్ లో జరిగిన జాతీయ పాఠశాలల అథ్లెటిక్ మీట్ లో 6.26 మీటర్లు దూకినప్పుడు తొలిసారిగా జాతీయ గుర్తింపు పొందింది. అప్పటి నుంచి అంచెలంచెలుగా ఎదుగుతూ ప్రపంచ స్థాయి ప్రతిభ ను కనబరిచే ఎత్తుకు ఎదిగింది. ప్రఖ్యాత అథ్లెట్ అంజు బాబీ జార్జ్ పేరిట 22 ఏళ్లుగా ఉన్న 6.83 మీటర్ల  జాతీయ రికార్డును కూడా బ్రేక్ చేసింది సోజన్. నట్టికా లోని ఒక సాధారణ  క్రైస్తవ కుటుంబంలో పుట్టిన సాజన్  ఆర్థిక కష్టాలు ఎన్నో దాటి వచ్చి ఇప్పుడు భారతదేశం గర్వించదగ్గ అథ్లెట్ అయ్యింది.నేను సాధించలేనిది మా అమ్మాయి సాధించిందని ఆనందభాష్పాలతో చెబుతున్నారు తండ్రి సోజన్ ఈటి.

Leave a Reply