చెత్త సేకరణకు రోబో !
ఢిల్లీ లోని అమిటి ఇంటర్నేషనల్ స్కూల్‌లో 12వ తరగతి చదువుతున్న మహి మల్హానీ ఏఐ ఆధారిత రోబో డస్ట్ బిన్ ను తయారు చేసింది.ఈ రోబో స్మార్ట్ ఫోన్ యాప్ ద్వారా నియంత్రిస్తే పనిచేస్తుంది.దానంతట అదే తిరిగి వ్యర్థాలను సేకరిస్తుంది.కార్ పార్కింగ్ సెన్సార్ల మాదిరిగా ఇందులోని అల్ట్రాసోనిక్ సెన్సార్లు పనిచేస్తాయి.ధ్వని తరంగాలను పంపి సమీపంలోని వస్తువును తీసుకునేందుకు ఉపయోగపడతాయి.రోబో కూడా దారిలో ఏదైనా అడ్డంకులు ఎదురైతే ఆగిపోతుంది లేదా పక్కకు తిరిగి పోతుంది.వ్యర్థాలను వేరు చేయడానికి ట్రాష్ బాట్ కెమెరాలను ఏఐ సాంకేతికతను ఉపయోగిస్తుంది.మనిషిలాగే వస్తువులను గుర్తించి వేగంగా చెత్త సేకరణలో సాయపడుతుంది.ఉదయపూర్ లోని ఒక మున్సిపల్ కార్పొరేషన్ ట్రాష్ బాట్ రోబో ని వినియోగిస్తున్నారు.ఒక్కసారి ఛార్జ్ చేస్తే ఇది రెండు గంటలు పనిచేస్తుంది. ఇండియా ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ లో టాప్ 50 కి ఈ రోబో ఎంపికైంది.
