ఆర్థిక లావాదేవీలకు కొత్త యాప్!
ఆర్థిక క్రమశిక్షణ కోసం ‘రెంటెన్‌పే’ యాప్ రూపొందించింది సారిక శెట్టి.ముంబైలో పుట్టి పెరిగిన సారిక ఎంబీఏ పూర్తి చేసింది.2004 నుంచి ఫోర్డ్,ఫోక్స్ వ్యాగన్,బీఎండబ్ల్యూ వంటి సంస్థల్లో పని చేసింది.ఆ తర్వాత సొంతంగా రెంటెన్‌పే యాప్ తయారు చేసింది .డెబిట్ క్రెడిట్ కార్డు లాగే దీనికి ఒక డిజిటల్ కార్డు అప్లికేషన్ ఉంటాయి. నెలవారీ అద్దె చెల్లింపులు దగ్గర నుంచి జీతం ఇతర లోన్లు వివరాలు వంటివన్నీ ఇందులో నమోదు చేయాలి. ఆటోపే లని యాక్టివేట్ చేయాలి. ఇవన్నీ రెంటెన్‌పే ఇచ్చే స్కోర్ మీద ప్రభావం చూపిస్తాయి. బ్యాంకులు,లోన్లు ఇచ్చే సంస్థలు దీన్ని పరిగణనలోకి తీసుకునే విధంగా అప్లికేషన్ రూపొందించారు.ఇంటి లోన్ తీసుకోవాలన్నా ఈ యాప్ ని పరిగణన లోకి తీసుకోవచ్చు. ఈ ఏడాదిలోనే ప్రజాదరణ పొందింది ఈ యాప్.ఫోన్ పే, జి పే లాంటి అప్లికేషన్ అందించే సేవలు అన్ని వీళ్ళ యాప్ ద్వారా అందిస్తున్నారు. ఇప్పటికే ముంబై,బెంగళూరు పూణే చెన్నై వంటి నగరాల్లో రెంటెన్‌పే సేవలు అందుబాటులోకి వచ్చాయి.
