Sunday, 05 Jul, 2026

వీళ్లే దేశానికి స్ఫూర్తి

*Zomato, Swiggy, Bigbasket, Flipkart లాంటి పెద్ద కంపెనీలకు రాశీ అగర్వాల్ EV స్కూటర్లు, ఆటోలు సప్లై చేస్తోంది.ఇలాంటి ఆడపిల్లలే ఇప్పుడు దేశానికి స్ఫూర్తి.ఈమె నడిపిస్తున్న కంపెనీ పేరు ఈవీ-యాజ్-ఎ-సర్వీస్. డెలివరీ పార్ట్నర్లు రోజువారీ అద్దె చెల్లించి ఇక్కడ వాహనాలు తీసుకుంటారు. ప్రస్తుతం ఇక్కడ నుంచి మెట్రోల్లో 22 వేలకు పైగా ఎలక్ట్రిక్ బైకులు వెయ్యికి పైగా త్రీ వీలర్లు నడుపుతున్నారు ఢిల్లీ,బెంగళూరు,ముంబై, హైదరాబాదు, జైపూర్, ఫరీదాబాద్ ల్లో ఈ కంపెనీ పని చేస్తోంది. ఈ కంపెనీకి చీఫ్ బిజినెస్ ఆఫీసర్ రాసి అగర్వాల్. నిధుల సమీకరణ వ్యాపార విస్తరణ సేల్స్ ఫైనాన్స్ వంటి ఎనిమిది విభాగాలను  పర్యవేక్షిస్తోంది రాశీ అగర్వాల్ .డబ్బు కంటే కూడా పర్యావరణ కాలుష్య సమస్యకు మా కంపెనీ ఒక గొప్ప పరిష్కారం అంటుంది రాశి.

Leave a Reply