Wednesday, 01 Jul, 2026

ఆరోగ్యాన్ని ఇచ్చే  వంట పాత్రలు

టెన్ కాశీ లో పుట్టిన మీరా రామకృష్ణన్ జిష్ట అనే పేరుతో సంప్రదాయ వంట పాత్రల తయారీ అమ్మకం మొదలు పెట్టింది 15 రాష్ట్రాల్లో 650 మంది కళాకారులతో ఈ పాత్రలు తయారు  చేయించి విక్రయాలు మొదలు పెట్టింది. తమిళనాడు కేరళ సరిహద్దుల్లో తయారయ్యే సెంగొట్టాయి దోస కల్లు అనే దోసెల పెనాలు, కుంభకోణంలో తయారయ్యే ఈయ చోంబు అనే రసం పాత్ర,రాతి పాత్ర ల వంటివి జిష్ట పేరుతో అమ్ముతోంది.2021 లో చెన్నైలో మొదటి దుకాణాన్ని నెలకొల్పింది తర్వాత బెంగళూరు హైదరాబాద్ లకు ఈ దుకాణాలు విస్తరించాయి.సంప్రదాయ చేతి వృత్తులను ప్రోత్సహించటం మీరా లక్ష్యం.ఈరోజు జిష్ట ద్వారా ఎనిమిది రకాల పదార్థాలతో రూపొందే 500 రకాల విభిన్నమైన పాత్రలను వినియోగదారులకు చేరుస్తోంది మీరా. మన పూర్వీకులు ఉపయోగించిన ఈ సంప్రదాయ పాత్రలతో ఆహారానికి పోషకాలు సమకూరుతాయి. హాని కారకమైన సూక్ష్మజీవులు చనిపోయి మెగ్నీషియం ఆహారంలో చేరుతుంది. కంచు రాగి వంటి పాత్రలతో జీర్ణవ్యవస్థ సామర్థ్యం పెరుగుతుంది.

Leave a Reply