Monday, 06 Jul, 2026

గ్రామీణ యువత ఉపాధి కి సాయం 

జోహో కంపెనీ లో ప్రధాన వాటాదారుగా ఉన్న రాధా వెంబు చెన్నైలో జన్మించారు .ఐఐటి మద్రాస్ లో ఇండస్ట్రియల్ మేనేజ్‌మెంట్ లో డిగ్రీ పూర్తి చేశారు.1996లో సోదరుడు వెంబు తో కలిసి అడ్వెంట్ నెట్ అనే సంస్థ ప్రారంభించారు. అదే కార్యక్రమంలో జోహో గా మారింది. ప్రపంచవ్యాప్తంగా ఎన్నో వ్యాపార సంస్థలకు క్లౌడ్ ఆధారిత సాఫ్ట్ సేవలు అందిస్తుంది జోహో. ఈరోజు ఈ కంపెనీ టాప్ గ్లోబల్ టెక్నాలజీ కంపెనీల్లో ఒకటి. 2024 లో   హురున్ ఇండియా రిచ్ లిస్ట్ లో రాధా వెంబు భారతదేశంలో అత్యంత సంపన్నురాలిగా నిలిచింది. ప్రస్తుతం ఆమె సంపద విలువ 55 వేల కోట్లకు పైనే .గ్రామీణ అభివృద్ధి సామాజిక సంక్షేమ రంగాల్లో ఆమె అనేక కార్యక్రమాలకు ఆర్థిక సాయం చేస్తారు. గ్రామీణ ప్రాంతాల్లో నాణ్యమైన విద్య ,పేద కుటుంబాల్లో ఆరోగ్య సదుపాయాలు ,గ్రామీణ యువతకు ఉపాధి అవకాశాల కల్పన మొదలైన వాటికి రాధా అత్యంత ప్రాధాన్యత ఇస్తారు. వ్యాపార రంగంలో ఒక ప్రత్యేక అధ్యాయం సృష్టించిన రాధ సెల్ఫ్ మేడ్ బిలియనీర్.

Leave a Reply