Monday, 05 Oct, 2026

ఆమెది గాంధీ మార్గమే

హరూన్ ఇండియా ఫిలాంత్రఫిస్ట్ జాబితాలో అత్యంత సంపన్న వ్యక్తులలో మూడవ స్థానంలో ఉన్నారు లీనా గాంధీ. ఆమె తాత విఠల్ బాలకృష్ణ గాంధీ 1961లో స్థాపించిన యు ఎస్ వి కంపెనీని అంతర్జాతీయ స్థాయికి తీసుకు వెళ్లారు లీనా.ఆమె తాత గారి చరిత్ర ను బియాండ్ పైప్స్ అండ్ డ్రీమ్స్ ది లైఫ్ ఆఫ్ విఠల్ బాలక్రిష్ణ గాంధీ పేరుతో పుస్తకం గా రాశారు.విఠల్ గాంధీ మార్గాన్ని అనుసరించారు .ఎంపీగా పోటీ చేసి గెలిచారు పబ్లిక్ అకౌంట్స్ కమిటీకి అధ్యక్షత వహించారు యు ఎస్ వి లిమిటెడ్ అని ఫార్మాస్యూటికల్ కంపెనీ తో పారిశ్రామికవేత్తగా కూడా విజయం సాధించారు. తాతగారి జీవిత చరిత్ర ను రాసే క్రమంలో తనను తాను మరింత ఉన్నతంగా తీర్చిదిద్దుకున్నాను అంటుంది లీనా తివారి. ఆయన అడుగుజాడల్లో నడవటమే కాదు ఆయన ఆశయాలను ముందుకు తీసుకువెళ్తున్నారు లీనా. డాక్టర్ సుశీల గాంధీ నిరుపేదల మహిళల కేంద్రం అనే స్వచ్ఛంద సంస్థ కు అన్ని రకాలుగా అండగా నిలబడ్డారు. ఆ సంస్థ నిరుపేద బాలికలు యువతులకు విద్యాపరమైన సేవలు అందిస్తోంది. తన కంపెనీలో అర్హులైన మహిళలను ఉన్నత స్థానంలో నియమిస్తాననీ కొన్ని విభాగాల్లో మహిళలే ఎక్కువగా ఉన్నారని సగర్వంగా చెప్తుంది లీనా గాంధీ.

Leave a Reply