Saturday, 11 Jul, 2026

లావణి నృత్య రాణి విఠాబాయి

మహారాష్ట్రలోని సోలాపూర్ జిల్లా పండరిపూర్ లో 1935లో జన్మించింది విఠాబాయి నారాయణ గాస్కర్. మహారాష్ట్ర జానపద కళలైన తమాషా,లావణి నృత్యానికి కొత్త గుర్తింపు తెచ్చింది విఠాబాయి దశాబ్దాలుగా ఈ కళకి అంకితమైన కుటుంబం   ఈమెది.అసాధారణమైన ప్రతిభ తో చిన్న వయసులోనే బృందాల్లో ప్రధాన నర్తకి గా ఉన్నది. తమాషా సామ్రాజ్ఞి లావణ్య దిగ్గజం వంటి బిరుదులు పొందారీమే.ఈ రంగంలో అందించిన సేవలకు రెండు సార్లు రాష్ట్రపతి అవార్డు అందుకున్నారు.ఆమె చనిపోయిన నాలుగేళ్లకు రాష్ట్ర ప్రభుత్వం జీవన సాఫల్య పురస్కారాన్ని ప్రకటించింది అప్పటి నుంచి సంప్రదాయ లావణీ కళను కాపాడుతూ ప్రచారం చేస్తూ ప్రదర్శనలు ఇస్తున్న కళాకారులకు ఏటా ఈ అవార్డు  ఇస్తున్నారు. నిరుపేద సంచార కుటుంబంలో జన్మించి రాష్ట్రపతి అవార్డు అందుకున్న స్థాయికి ఎదిగిన మిఠాబాయి జీవితం మర్చిపోలేనిది.ఈమె జీవిత కథ ఇప్పుడు సినిమా గా వస్తుంది.శ్రద్ధాకపూర్ మిఠాబాయిగా నటిస్తోంది.

Leave a Reply