గెలుపే నాకు బహుమతి!
సినిమా రంగంలో కే భాగ్యరాజ్ సినిమా వీట్ల విశేషం లో కథానాయకగా సినిమా రంగంలోకి అడుగు పెట్టింది ప్రగతి మహావాది. ఆమెకు ఫిట్నెస్ పట్ల ఎంతో ఇష్టం వ్యాయామాన్ని ఒక క్రీడలా చూస్తూ పవర్ లిఫ్టింగ్ లోకి అడుగు పెట్టింది ప్రగతి.ఎన్నో బంగారు వెండి పతకాలు గెలుచుకుంది. నవంబర్ 2023లో బెంగళూరులోని ఇంజినీర్స్ అసోసియేషన్ ఆడిటోరియం వేదికగా నిర్వహించిన సౌత్ ఇండియా పవర్ లిఫ్టింగ్ ఛాంపియన్ షిప్ లో సిల్వర్ మెడల్ సాధించి ఫిట్నెస్ రంగంలో ఒక స్టార్ గా నిలిచింది . 20 25 లో కేరళలో జరిగిన నేషనల్ మాస్టర్స్ క్లాసిక్ పవర్ లిఫ్టింగ్ ఛాంపియన్ షిప్ లో గోల్డ్ మెడల్ గెలిచింది.సినిమా రంగంలో ఫిట్నెస్ కి చాలా ప్రాధాన్యత ఉంటుంది.షూటింగ్ పూర్తి అయ్యాక ప్రతిరోజు రెండున్నర గంటలు జిమ్ చేస్తూ పవర్ లిఫ్టింగ్ కోసం శరీరాన్ని సిద్ధం చేసుకుంది ప్రగతి. టర్కీలో జరిగిన ఏషియన్ ఓపెన్ అండ్ మాస్టర్స్ పవర్ లిఫ్టింగ్ ఛాంపియన్ షిప్ లో నాలుగు పతకాలు సాధించింది ఓవరాల్ గేమ్ లో రజతం స్వర్ణం ,బెంచ్ ,స్క్వాట్ లిఫ్టింగ్ లో రెండు రజిత పథకాలు గెలుచుకుంది. ఈ గెలుపు తనకు ఎంతో ఆనందాన్ని ఇచ్చిందని మరిన్ని పతకాలు గెలుచుకోవాలని స్ఫూర్తి ఇచ్చిందని చెప్తుంది ప్రగతి మహావాది.
