Sunday, 05 Jul, 2026

శాస్త్రీయ సంగీత గాయనికి సత్కారం

‘రాయల్ బర్మింగ్‌హామ్ కన్సర్వేటోర్’ విద్యాసంస్థ నుంచి అరుదైన సత్కారం పొందిన తొలి భారతీయ గాయనిగా డాక్టర్ రాధిక బాలకృష్ణన్ రికార్డు సృష్టించారు.కర్ణాటక సంగీతానికి అంతర్జాతీయ వేదిక పైన అరుదైన గౌరవం దక్కింది. బ్రిటన్ లోని అత్యంత ప్రతిష్టాత్మకమైన రాయల్ బర్మింగ్‌హామ్ విద్యాసంస్థ ప్రముఖ భారతీయ కర్ణాటక సంగీత గాయని డాక్టర్ రాధిక బాలకృష్ణన్ ను సత్కరించింది. ఈ విద్యా సంస్థ ప్రపంచవ్యాప్తంగా కళలు, విద్య సంస్కృతి రంగాల్లో అత్యున్నత సేవలు అందించిన ప్రముఖులకు ఈ గౌరవ సభ్యత్వాన్ని అందిస్తుంది.మన దేశం నుంచి ఒక కర్ణాటక సంగీత విద్వాంసురాలికి  ఈ పురస్కారం దక్కడం ఇదే ప్రథమం.రాధిక గాయని మాత్రమే కాదు సంగీత శాస్త్రాన్ని అధ్యయనం చేసిన విద్యావేత్త.ఆమె మద్రాస్ విశ్వవిద్యాలయంలోని సంగీత విభాగంలో అసిస్టెంట్ ప్రొఫెసర్ గా సేవలందిస్తున్నారు.

Leave a Reply