వెదురే ముడి సరుకు

వెదురే ముడి సరుకు

వెదురే ముడి సరుకు

వేగంగా పెరిగి, ఏ రూపంలోకి మలుచుకోవాలన్న వీలుగా ఉండి మట్టిలో కలిసిపోయే వెదురుతో పర్యావరణాన్ని రక్షించుకోవచ్చు అనుకున్నది అశ్విని షిండే.భర్తతో కలిసి బ్రష్ లు గరిటలు, ఇయర్ బడ్స్ వంటి చిన్న వస్తువులే కాదు కార్పొరేట్ గిఫ్టింగ్ లని వెదురుతో రూపొందిస్తున్నారు. వీరి ఇద్దరి ఆలోచన ఉపాధి కల్పిస్తోంది. ఇద్దరూ ఎన్నో పురస్కారాలు అందుకున్నారు. షార్క్ ట్యాంక్ ఇండియా నుంచి పెట్టుబడి అందింది.ఈ కామర్స్ ప్లాట్ ఫామ్ ద్వారా వ్యాపారం చేసే అశ్విని షిండే తయారు చేసే వస్తువుల్లో స్పీకర్లు,నోట్ బుక్ లు డెస్క్ ఆర్గనైజర్లు పెన్నులు ఎన్నో ప్రశంసలు పొందాయి.