ధాన్యంతో వివిధ ఆభరణాలు తయారుచేసి విదేశాల్లో కూడా ఆదరణ పొందుతున్నారు కోల్‌కతాకు చెందిన పుతుల్ దాస్ మిత్ర. గోవిందా భోగ్ అనే ఒక రకం వరి ధాన్యం పశ్చిమ బెంగాల్ లో సాగు చేస్తారు అశ్వయుజ పూర్ణిమను లక్ష్మీదేవి పుట్టినరోజు గా అక్కడి ప్రాంతవాసులు జరుపుకుంటారు ఆ సందర్భంలో గోవింద్ భోగ్ ధాన్యంతో దండలు అల్లుతారు ఇళ్లలో అలంకరణకు ఉపయోగించే ఈ దండలు ఎక్కువ కాలం చక్కగా మన్నుతాయి. పుతుల్ దాస్ ఈ ధాన్యంతో దిద్దులు జూకాలు గాజులు వంటి నగలు తయారు చేస్తారు మహిళలకు వాడి తయారీలో శిక్షణ కూడా ఇస్తారు. ఆమెకు ఈ నగలను సృష్టించినందుకుగాను నేషనల్ హ్యాండి క్రాఫ్ట్ అవార్డు వచ్చింది. ఆమె తయారు చేసే నగలకు విదేశాల్లో మంచి డిమాండ్ ఉంది.













