అమ్మకు పద్మశ్రీ
అరుణాచల ప్రదేశ్ లోని కొండ ప్రాంతంలో డ్రగ్స్ బారిన పడిన యువతకు వైద్యం చేయించి, ఆర్థిక స్వావలంబన కల్పించి వారి జీవితాలను ఒక మంచి దారిన పెట్టిన జుమ్డే యోమ్గామ్ గామ్లిన్ కు కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీ ని ఇచ్చి సత్కరించింది. అరుణాచల్ ప్రదేశ్ ప్రభుత్వంలో గ్రామ సేవికగా కెరీర్ ప్రారంభించిన యోమ్గామ్ క్రమంగా చైల్డ్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ ఆఫీసర్ స్థాయికి ఎదిగింది.ప్రభుత్వ వ్యవస్థలో ఉండే ఎన్నో సంక్షేమ పథకాలను క్షేత్రస్థాయికి తీసుకెళ్లింది.పదవీ విరమణ తర్వాత 2013లో వెస్ట్ సియాంగ్ జిల్లాలోని ఆలో ప్రాంతంలో మదర్స్ విజన్ అనే స్వచ్ఛంద సంస్థను ఏర్పాటు చేశారు .ఆ ప్రాంతంలో యువత మత్తు పదార్థాలకు బానిసలై జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. మదర్స్ విజన్ ఆధ్వర్యంలో 30 పడకల డి అడిక్షన్ పునరావాస కేంద్రాన్ని ఏర్పాటు చేసి,మత్తు మందుకు బానిసలైన వారికి కౌన్సిలింగ్ ఇచ్చి వైద్య సహాయంతో 700 మందికి పైగా యువకులను ఆ అలవాటు నుంచి పూర్తిగా కోలుకునేలా చేశారు.ఈ విజయం వెనుక భారీ బడ్జెట్ గాని కార్పొరేట్ నిధులు కానీ లేవు.కేవలం ఆత్మీయతతో ఆమె యువతను మార్చారు. కేంద్ర ప్రభుత్వం ఆమెకు పద్మశ్రీ తో గౌరవించింది.అరుణాచల్ కొండల్లో లక్షలాది మంది యువత ఆమెను అమ్మగా భావిస్తారు.ఆమె జీవితం దేశం లోని ప్రతి పౌరుడికి ఒక స్ఫూర్తి.
