Sunday, 28 Jun, 2026

గింజ వృక్షం అయినట్లు ఎదగాలి

నీహారికా, నేనందరిలా పర్ఫెక్ట్ గా ఉన్నానా? నా ఆలోచనలు సరైనవా కాదా అనే సందేహం అన్నావు, అసలు నువ్వు ఇతరులతో ఎందుకు పోల్చుకొంటావు. ప్రతివారికీ ఎవరి ప్రత్యేకత వాళ్ళదే. ఇంకోళ్ళలా వుండటం ఎందుకు? మన చుట్టూ ఉన్న సక్సెస్ ఫుల్ పీపుల్స్ లో మనం కూడా ఖచ్చితంగా ఉంటాం. ఇప్పుడెలా ఉండాలి అప్ డేట్ గా, సమకాలీన పరిస్థితులు, తాజా ఆర్ధిక సాంఘిక రాజకీయ విషయాలు తెలుసుకోవడం కోసం న్యూస్ పేపర్లు, మేగజైన్లు ఎంచుకో. మన చుట్టూ […]

చదువు తోనే ఆరోగ్యం

ఎన్నో రకాల పరిశోధనలు ఎప్పుడూ జరుగుతూనే ఉన్నాయి. ఎలా వుంటే ఫ్యాషన్, ఎలా తింటే ఆరోగ్యం, ఎలా ప్రవర్తిస్తే మర్యాద ఇవన్నీ జీవనశైలితో పాటు మారిపోతున్నాయి కదా. ఇప్పుడు చదువుకీ, వ్యక్తి ఆరోగ్యానికి ఉన్న సంబంధం గురించి ఆస్ట్రేలియా పరిశోధకులు సుదీర్ఘకాలం అధ్యయనం నిర్వహించారు. సుమారు 3 లక్షల మంది విద్యాధికుల పైగా మిగతా డిగ్రీ లోపే ఆపేసిన వారిపైన ఈ అధ్యయనం కొనసాగింది. డిగ్రీ చదివిన వారి కన్నా ఇంటర్ తో ఆపేసిన వాళ్ళే ఎంతో […]

మళ్ళీ ఫ్యాషన్ ట్రెండ్ షరారే !

షరార డ్రెస్ పాత సినిమాల ట్రెండ్. ఎన్నో సంవత్సరాల తర్వాత మళ్ళీ అదే డ్రెస్ ట్రెండ్ క్రియేట్ చేస్తుంది. పెళ్లి కూతుళ్ళు, యువతులు ఈ ఫ్యాషన్ అవుట్ ఫిట్ వైపు ఇష్టంగా చూస్తున్నారు. స్పెషల్ గా, ట్రెండీగా ఈవెంట్స్ లో ధరిస్తే స్పెషల్ ఎట్రాక్షన్ గా వుండటంలో ఇది పాతకాలపు డ్రెస్ అన్న పదం పక్కన పెట్టి ఇందులో వస్త్ర శ్రేణిని మాత్రం మార్చిపారేసి కొత్త లుక్ తీసుకొస్తున్నారు ఫ్యాషన్ డిజైనర్స్. చూసేందుకు ట్రౌజర్ ల కనిపిస్తుంది […]

మెడ ఆకృతిని బట్టే డిజైన్స్

ఇవ్వాళ చీర అందం మొత్తం బ్లవుజ్ డిజైన్ పై ఆధారపడి వుందంటే ఆశ్చర్యం ఏమీ లేదు. కానీ డిజైనర్స్ అది ఎంత అందమైన బ్లవుజ్ అయినా మెడ ఆకృతిని బట్టి డిజైన్ ఎంపిక చేసుకోవాలంటున్నారు. మెడ సన్నగా పొడవుగా ఉంటే రౌండ్ నెక్. మెడ పొట్టిగా, లావుగా ఉంటే డీప్ నెక్, బ్రాడ్ నెక్, ఫాట్ నెక్, బ్యాక్ ఓపన్ డోరీ డిజైన్స్, భుజాలు వెడల్పుగా వుంటే కాలర్, హై, రౌండ్, బోట్ నెక్ ఆకారాల్లో బావుంటాయని […]

పాప్ కార్న్ లో బోలెడన్ని కాలరీలు

జీరో సైజులు, సన్నగా ఉండటం ఫ్యాషన్ స్టేట్మెంట్ అయ్యాక ఇప్పుడు ఏం తిన్నా కాలరీలు లెక్కెట్టుకోవడం పెద్ద అలవాటయిపోయింది. పాప్ కార్న్ అందరికి ఇష్టం. ఒకటి రుచిగా ఉంటుంది, రెండోది అందులో ఉండే ఆరోగ్య ప్రయోజనాలు. పైగా కాలరీలు వుండవు. ఫ్యాట్ తక్కువ ఎంత తిన్నా ప్రమాదం లేదని అంటున్నాం కదా కానీ నిపుణులు మాత్రం మీ అభిప్రాయం తప్పు అంటున్నారు. సూపర్ మారేట్స్, సినిమా హాళ్ళలో దొరికే ఈ పాప్ కార్న్ లో బోలెడన్ని ఆరోగ్య […]

ప్రశాంతత కోసం ఓ ప్రయాణం

మానసిక సంతోషం కోసం విహార యాత్రలు చేయండి అంటున్నారు నిపుణులు. రోజువారీ జీవితంలో కలిగే జడత్వాన్ని ఈ ప్రయాణాలు వదిలించి జీవితంనిస్సారంగా అనిపించకుండా చేస్తాయట ప్రయాణాలు. కొత్త ప్రదేశాలు చూస్తూ వుంటే ప్రాంతం, భాష, మనుషులు, ఆహారం, మన ఆహార్యం కూడా మారుతుంది. ఈ కాస్త ఆటవిడుపు ప్రయాణం మనకు కొత్త రుచుల్ని, కొత్త అనుభవాలని ఇస్తుంది. మన పూర్వీకులు కూడా తీర్ధ యాత్రలకు వెళ్ళేవారు. అమీబా లాగా కదలకుండా వుంటే మన మెదడు లో నెగిటివ్ […]

లేడీ విలన్ గా కాజోల్

నిజానికి బాలీవుడ్ హీరోయిన్లందరూ దక్షినాది తెరపైన మెరిసిన వారే. పెద్దయి పోయినా వాళ్ళ దృష్టి ఇటే ఉండటంలో ఆశ్చర్యం ఏదీ లేదు. ఇదివరకు ఎప్పుడో శ్రీదేవి తమిళ సినిమాలో రాణీ వేషం వేస్తే డ్రీమ్ గర్ల్ హేమమాలిని గౌతమీపుత్ర శాతకర్ణి లో రాజమాతగా బ్రహ్మాండంగా నటించేసింది. ఇప్పుడిక కాజోల్ వంతోచ్చింది. ధనుష్ సినిమాలో లేడీ విలన్ గా నటించబోతుంది. 18 సంవత్సరాల తర్వాత అనంతరం కాజోల్ హటాత్తుగా తెలుగు సినిమాలో విలన్ పాత్రలో అనే సరికి అందరికీ […]

చదువుల తల్లి కోటేశ్వరమ్మ గారు

తెలుగు రాష్ట్రాల నుంచి ఎనిమిది మందికి పద్మ పురస్కారాలు లభించాయి. వివిధ రంగాల్లో సేవలందించిన మొత్తం 89 మందిని ప్రభుత్వం ఈ పురస్కారాలతో సత్కరించనుంది. విజయవాడ కేంద్రంగా విద్యా సంస్థ స్థాపించి ఆ సంస్థల పేరునే ఇంటి పేరుగా మార్చుకొన్న వేగి కోటేశ్వరమ్మ గారు ఆరు దశాబ్దాలుగా విద్యావనం లోనే అడుగులు వేస్తున్నారు. కృష్ణా జిల్లా గోసాల గ్రామంలో 1925 లో జన్మించారు. కాకినాడ, గుంటూరు లలో కళాశాల చదువును పూర్తిచేసి ఉపాధ్యాయ వృత్తి లోకి రావడానికి […]

అపురూపం కాదు పరిపూర్ణం

విశ్వ సుందరిగా ఎంపికైన వేదిక నుంచి ఆ పోటీలకు న్యాయ నిర్ణేతగా వెళ్ళటం అపురూపమైన విషయమో. మాజీ మిస్ యూనివర్స్ సుస్మితా సేన్ 1994లో ఫిలిప్ఫిన్స్ లోని మనీలాలో జరిగిన అందాల పోటీలో విశ్వ సుందరిగా ఎంపికయ్యారు. 23 సంవత్సరాల తర్వాత మళ్ళీ అదే వేదికపైన జనవరి 30వ తేదీన జరుగనున్న మిస్ యూనివర్స్ పోటీలకు జడ్జిలలో ఒకరిగా హాజరవుతున్నారు. ఈ విషయం గురించి చెపుతూఇది అపురూపమైన విషయం మాత్రమే కాదు పరిపూర్ణం కూడా. నా లైఫ్ […]

మొహం అస్తమానం కడిగినా నష్టమే

పది నిమిషాల పాటు ఏ పని మీదో బైక్ పైన బైటకు వెళ్ళొస్తే చేతులు మొహం మురిగ్గా అయిపోతాయి. అంత కాలుష్యం నిండి వుంటుంది. తప్పని సరిగా చేతులు, మొహం, కాళ్ళు కడుక్కొంటాం. నిపుణులు ఏం చెబుతున్నారంటే ముందస్తుగా చేతులు కడుక్కోండి. చేతులు శుభ్రంగా లేకపోతే ఆ చేతులకున్న బాక్టీరియా, ఇతర క్రిములు చర్మం లోకి వెళ్ళిపోయి మొటిమలు వచ్చే ప్రమాదం ఉంది. మేకప్ వేసుకొని వుంటే దాన్ని తప్పనిసరిగా తొలగించుకోన్నకే ముఖం కడుక్కోవాలి. మేకప్ ను […]

నీ జీవితం నిర్మించుకొనేది నువ్వే

నీహారికా, ఏది సాధించాలన్నా ఎన్నో సంవత్సరాల పాటు కృషి చేయాలి. కాస్త తేలిగ్గా ఏదైనా వుంటే అన్నావు. చెప్పు నీ ప్రశ్నలో సమాధానం వుందమ్మాయీ.. ‘ సాధించాలంటే …. కృషి’ అంతే కదా. ఇప్పుడు చూడు రెజ్లింగ్ ఛాంపియన్ గీతా ఫోగట్ ఎంత కృషి చేసి వుంటుందో, దంగల్ సినిమాలో ప్రత్యక్షంగా చూశావు. ఒక సముద్రం ఈదాలంటే ఎంత కష్టపడాలో, ఒక క్రికెట్ లో గెలవాలంటే ఎన్ని త్యాగాలు చేయాలో వాళ్ళ వాళ్ళ ఆత్మ కథలన్నీ పుస్తకాల […]

సేవా దిశలో అనురాధా కొయిరాలా

మదర్ ధెరిసా స్ఫూర్తి తో సేవా దిశగా అడుగులు వేసిన అనురాధ కొయిరాలా నటి మనీషా కొయిరాలా మేనత్త 1993 లో మైటీ నేపాల్ పేరుతో స్వచ్చంధ సంస్థ స్థాపించి భారత సరిహద్దు నేపాల్ లో వేశ్య వృత్తి లో వున్న మహిళల్ని అక్రమ రవాణాకు గురవుతున్న  వారిని కాపాడటం లక్ష్యంగా పెట్టుకున్నారు.ఇరవైనాలుగేళ్ళుగా 12 వేల మంది అమ్మాయిలను కాపాడి కొత్త జీవితాలను ప్రసాదించారు. ఆమె కృషిని గుర్తించిన నేపాల్ ప్రభుత్వం సెప్టెంబర్ 5,వ తేదీని అక్రమ […]

సడలని సమరోత్సాహం దీపామాలిక్

2016 పారా ఒలంపిక్ క్రీడల్లో షార్ట్ ఫుట్ విభాగంలో రాజిత పతకాన్ని అందుకున్న మొదటి క్రీడాకారిణి దీపామాలిక్. అనుకోని ప్రమాదంలో వెన్ను పూస దెబ్బ తిన్నా, చెక్రాల కుర్చీకే పరిమితం అయినా, బ్యూటీ క్వీన్ గా సామాజిక కార్యకర్త గా తనను తాను మలుచుకుని పారా ఒలంపిక్ పతకానికి ముందే ఎన్నో సహస క్రీడల్లో పతకాలు అందుకుంది దీపా మాలిక్. హిమాలయాలకు కార్ రేస్ లో పరుగులు తీసిన పరా ప్లీజిన్ దీపా.

సాహసానికి నిర్వచనం దీపా కర్మాకర్

క్రిందటి సంవత్సరం రియో ఒలింపిక్స్ కి ఎంపికైన క్రీడాకారిణి దీపా కర్మాకర్ చరిత్ర సృష్టించారు. ఒలింపిక్స్ లో మన దేశానికి పతకం తేలేక పాయినా ప్రోడనోవా విన్యాసం చేసి అందరిని ఆశర్యం లో ముంచెత్తారు. ప్రస్తుతం దీపా త్రిపుర విశ్వ విద్యాలయంలో పొలిటికల్ సైన్స్ లో పీ.జీ చేస్తుంది. 2014లో గ్లాస్కో కన్వీనల్స్ లో రాజితం అందుకుని ఈ ఘనత సాధించిన తోలి భారతియురాలిగా రికార్డుకెక్కారు. గత ఏడాది దీప అర్జున్ అవార్డు అందుకున్నారు.

విలక్షణ నటి బారతి కి పురస్కారం

1960- 80 ల్లో తెలుగు, తమిళ, హిందీ భాషల్లో అగ్ర హీరోల సరసన స్టార్ నాయిక భారతీ విష్ణు వర్ధన్ ను పద్మ పురస్కారం వరించింది. 1975లో కన్నడ నటుడు విష్ణు వర్ధన్ ను వివాహం చ్సుకున్నారు. నటిగానే కాకుండా గాయని గానూ పేరు తెచ్చుకున్నారు. చిత్ర పరిశ్రమకు ఆమె అందించిన సేవలకు గానూ ఆమె ఈ పురస్కారం లభించింది.

పాటకు పట్టం కట్టిన అనురాధ కు పురస్కారం

నలభై ఏళ్లకు పైగా తన గానం తో అందరిని అలరించిన అనురాధ పౌడ్వాల్ కు పద్మశ్రీ  లభించింది. 16 భాషల్లో వేల గీతాల తో పాటలకు పట్టం కట్టిన అనురాధ ఒక్క హిందీలోనే 5296 పాటలు పాడారు. ఫిలిం ఫేర్ పురస్కారాలు గౌరవ డిలిట్ డిగ్రీ ని పొందారు.

అభిననదనలు సాక్షి మాలిక్

2016 రియో ఒలంపిక్స్ లో భరత్ కు తోలి పతకం సాధించిన సాక్షి మాలిక్ పద్మశ్రీ పురస్కారానికి ఎన్నికయ్యారు. సంప్రదాయాలకు ఆయువుపట్టు అయిన హరియాణా రాష్ట్రంలోని మోక్రా గ్రామంలో పుట్టిన సాక్షి మల్ల యుర్ధంలో అరి తేరిన తాతగారి స్ఫూర్తి తో రెజ్లర్ అయ్యారు. ఇప్పుడామె ఆ గ్రామానికే కాదు దేశానికే స్ఫూర్తి.

కత్తి భామ్మ కు వందనం

డెబ్బయ్ సంవత్సరాల మీనాక్షి రాఘవన్ ను కత్తి భామ్మ గారు అని పిలుస్తారు. తండ్రి రాఘవన్ నుంచి ఈ యుద్ద విద్యను సాధన చేసారు మీనాక్షి రాఘవన్. ఈ విద్య తన తో నే అంతరించిపోవడం ఇష్టం లేక యుక్త వయస్సులో వున్నా ఆడపిల్లలకు కాలకియపట్టు విద్యను నేర్పుతూన్నారామె ఈ విద్యలో ఆమెకు తిరుగే లేదు.

ఎయిడ్స్ పై పోరాటం

డాక్టర్ సునీతి సాత్మన్ ను ఎయిడ్స్ డాక్టర్స్ అఫ్ చెన్నై అంటారు. మన దేశంలో మొట్ట మొదటి  హెచ్.ఐ.వి రోగి ని గుర్తించింది సునీత. ఎయిడ్స్ పేరు చెపితేనే వణికి పోయే రోజుల్లో ఆ వ్యాధి పై వగాహన కార్యక్రమాలు చేపట్టారు. అంతర్జాతీయ హెచ్.ఐ.వి వాక్సిన్స్ తయారీ సంఘం సభ్యురాలిగా కీలక బాధ్యతలు చేపట్టారు. ప్రస్తుతం ఆమె మన మధ్య లేరు.

ఉచిత వైద్యానికీ గుర్తింపు

భక్తి యాదవ్ వైద్య రంగంలో నిష్ణాతరాలు 1948 లో వైద్యురాలిగా జీవితం ప్రారంభించారు. ఇండోర్ లో మొదటి ప్రసూతి నిపుణురాలు గా రికార్డు సొంతం చేసుకున్నారు. సహజ ప్రసవం చేయడం లోప్రసిద్ధురాలు. పాతికేళ్ళ క్రితం ప్రభుత్వ వైద్యురాలిగా పదవీ విరమణ చేసాక కూడా సొంతం గా క్లినిక్ ఏర్పాటు చేసి ఇప్పటికీ తొంభై నిండిన వయస్సులోను వైద్యం చేస్తూ కనిపిస్తారు.