• అన్నింటా ముందే.

    ప్రాజెక్ట్, ప్లాన్, వ్యాపారం పట్ల ఇష్టం వున్న స్టార్టప్స్ కు ఎందఱో పెట్టుబడి పెట్టేందుకు వస్తున్నారు. సెలబ్రెటీలు సినిమా స్టార్లు ఇందుకు మినహాయింపు కాలేదు. తమ సంపాదనలో …

  • వీర్ దె వెడ్డింగ్ సినిమాలో కరీనా కపూర్ మళ్ళీ సినిమాల్లో కి వచ్చేసింది. గత ఏడాది తైమూర్ కు జన్మ నిచ్చన ఆమె కొన్ని నెలల విరామం తర్వాత మళ్ళీ సినిమాల్లో బిజీ అవుతోంది. తలయ్యాక కరీనా కపూర్ కబుర్లన్నీ ఆమె గరీబు బిడ్డ తైమూర్ గురించి సైఫ్ తను సినిమా వాతావరణం లోంచే వచ్చారు. ఇద్దరు ధనిక కుటుంబాల నుంచే వచ్చారు. తల్లి తండ్రుల కంటే ఇంకా ఎంతో ఖరీదైన జీవితం గడిపే అవకాశం తైమూర్ కు వుంది. పేరు హొదా డబ్బు అన్నీ మా అబ్బాయికి పుట్టుకతో వచ్చాయి కానీ ఆలా అని గర్వంగా తల ఎగరేయద్దు అనే చెపుతాం అంటోంది. కరీనా . ఇది సొషల్ మీడియా కాలం మేం ఏం నేర్చుకున్నామో అవన్నీ మా అబ్బాయికి నేర్చుకుంటాం. పిల్లవాడికి గర్వం రాకుండా జాగ్రత్త పడతాం అనిచెపుతోంది తల్లి కరీనా . ఇప్పుడు గతంలో మాదిరిగా వ్యాయామాలు చేస్తున్నా. పెళ్ళికి ముందు తర్వాత అని నాకు నేను హద్దులు గీసుకోను. ఎప్పుడూ గ్లామరస్ హీరోయిన్ గానే ఉండాలని నేను కోరుకుంటాను. ఆ దిశగానే నా శరీరాన్ని తీర్చిదిద్దుకుంటాను. కొత్త సినిమా కధలు వింటున్నాను అంటోంది కరీనా. పెళ్లితో పిల్లలు కలగటంలో జీవితం అయిపోతుందని అనుకునేవాళ్లు ఇదో కనువిప్పు.

    ఎప్పటికీ నేను గ్లామరస్ హీరోయిన్ నే

    వీర్ దె  వెడ్డింగ్ సినిమాలో కరీనా కపూర్ మళ్ళీ సినిమాల్లో కి వచ్చేసింది. గత ఏడాది తైమూర్ కు జన్మ నిచ్చన ఆమె కొన్ని నెలల విరామం…

  • మహిళల హక్కులు స్వావలంబిన గురించి భావాలున్న తాప్సీ నిజమైన ఫెమినిస్ట్ నని నిరూపించుకుంది. మహిళల హక్కుల గురించి జైపూర్ లో ఏర్పాటు చేసే ఓ ఈవెంట్ కు తాప్సీ పన్ను కు ఆహ్వానం అందింది. ఈ ఈవెంట్ స్పాన్సర్ ఒక ఫెయిర్నెస్ బ్రాండ్ అని తెలిసాక ఆ ఈవెంట్ బ్యాక్ డ్రాప్ లో ఈ ఫెయిర్ నెస్ క్రీమ్ బ్రాండ్ ఉంటుంది కనుక ఆ కార్యక్రమానికి రానని చెప్పేసింది తాప్సీ . నేను ఫెయిర్ గా ఎన్నో నిర్ణయాలు తీసుకునేదాన్ని. ఈ ఫెయిర్ నెస్ ను ఎందుకు సపోర్ట్ చేస్తాను అంటూ సమాధానం ఇచ్చిందిట తాప్సీ . ఈ తెలుపు రంగు కోసం ఇప్పటికీ అందరూ మోజు పడతారు కనుకనే ఈ ఫెయిర్ నెస్ క్రీమ్ బ్రాండ్స్ రాజ్యమేలుతున్నాయి. నిజానికి శరీరపు రంగు అందానికి కాలమానం కాదు. దానికి నేను సపోర్ట్ చేయను అన్నది తాప్సీ. ఇలా సౌందర్య పాఠనాల తయారీ బ్రాండ్ల ప్రచారాన్ని వ్యతిరేకించే తారల్లో తా ప్సీ తో పాటు కల్కి కోయచ్లీన్ కంగనా రనౌత్ లు కుడా ఉన్నారు. యాంటీ ఏజింగ్ క్రీమ్ తానూ ప్రచారం చేయనని కల్కి చెప్తే ఓ ఫెయిర్ నెస్ క్రీమ్ కోసం నటించే యాడ్ కి వచ్చే రెండు కోట్ల కాంట్రాక్ట్ వదులుకుంది కంగనా రనౌత్ .. ఆడవాళ్ళలో ఈ భవాజాలం పోయేందుకు ఇంకెంత మంది ముందుకొచ్చి చెప్పాలో

    ఫెయిర్ నెస్ ను సపోర్ట్ చేయటమా , నెవ్వర్ !

    మహిళల హక్కులు స్వావలంబిన గురించి భావాలున్న తాప్సీ  నిజమైన ఫెమినిస్ట్ నని నిరూపించుకుంది. మహిళల హక్కుల గురించి జైపూర్ లో ఏర్పాటు చేసే ఓ ఈవెంట్ కు…

  • తమన్నా బాహుబలి విజయం ఇచ్చిన ధైర్యం తర్వాత ఇప్పుడిక హిందీ సినిమా కధలు వింటున్నానంటోంది. అవంతిక పాత్ర బాహుబలి ది కంక్లూజన్ లో ఇంకా బావుంటుంది అని చెపుతుందామె. ఈ సినిమా కోసం ఎంతో కష్టపడ్డాను తన పాత్రను ఎలా రిసీవ్ చేసుకుంటారోనని ఎంతో టెన్షన్ పడిందట. ఇప్పుడిక బాలీవుడ్ లో సత్తా చాటాలనుకుంటోందిట. అక్కడ హిమ్మత్ వాలా లో నటించి హమ్ షకల్స్ ఎంటర్టైన్మెంట్ టుక్ టుక్ టుటియాల్లో మెరిపించినా అక్కడ ప్రేక్షకులకు అంతగా కనెక్ట్ కాలేదీ పాల తెలుపు అందాల తమన్నా . ఒక గుర్తింపంటూ వచ్చాక లేడీ ఓరియెంటెడ్ సినిమా చేయాలనిపించి అభినేత్రి చేసేసా. పెరఫార్మెన్స్ కు స్కోప్ వున్న లేడీ ఓరియెంటెడ్ లో చేయడం మంచిదేననిపించింది. అలాగే స్పెషల్ సాంగ్స్ విషయంలో సినిమా ఆలోచనల్లో మార్పురాలేదు కానీ బాలీవుడ్ లో సూపర్ స్టార్స్ కూడా స్పెషల్ సాంగ్స్ చేస్తుంటారు . మన వల్ల సినిమాకు అదనపు ఆకర్షణ వుంటే మంచిదే కదా. పైగా రెమ్యునెరేషన్ బ్రహ్మాండంగా వుంటే హ్యాపీ కదా అంటోంది తమన్నా.

    హిందీ లో చేయాలని వుంది

    తమన్నా బాహుబలి విజయం ఇచ్చిన ధైర్యం తర్వాత ఇప్పుడిక హిందీ సినిమా కధలు వింటున్నానంటోంది. అవంతిక పాత్ర బాహుబలి ది కంక్లూజన్ లో ఇంకా బావుంటుంది  అని…

  • నిజానికి బాలీవుడ్ హీరోయిన్లందరూ దక్షినాది తెరపైన మెరిసిన వారే. పెద్దయి పోయినా వాళ్ళ దృష్టి ఇటే ఉండటంలో ఆశ్చర్యం ఏదీ లేదు. ఇదివరకు ఎప్పుడో శ్రీదేవి తమిళ సినిమాలో రాణీ వేషం వేస్తే డ్రీమ్ గర్ల్ హేమమాలిని గౌతమీపుత్ర శాతకర్ణి లో రాజమాతగా బ్రహ్మాండంగా నటించేసింది. ఇప్పుడిక కాజోల్ వంతోచ్చింది. ధనుష్ సినిమాలో లేడీ విలన్ గా నటించబోతుంది. 18 సంవత్సరాల తర్వాత అనంతరం కాజోల్ హటాత్తుగా తెలుగు సినిమాలో విలన్ పాత్రలో అనే సరికి అందరికీ ఆశ్చర్యమే. ఇదంతా చూసి బాలీవుడ్ జనం ఆశ్చర్యపోతుంటే ఇటు దక్షిణాదిన మన సినీ కళాభిమానులు మాత్రం బోలెడంత కోపం తెచ్చేసుకొంటున్నారు. హీరోయిన్లు సరే వస్తున్నారు, కారక్టర్ పాత్రలు కూడా వాళ్ళే వేస్తే మరి మన వాళ్ళ సంగతేమిటని వీళ్ళ ప్రశ్న. ఈ మనోభావాలతో నిమిత్తం లేకుండా కాజోల్ మాత్రం విలన్ గా రాబోతుందని సమాచారం.

    లేడీ విలన్ గా కాజోల్

    నిజానికి బాలీవుడ్ హీరోయిన్లందరూ దక్షినాది తెరపైన మెరిసిన వారే. పెద్దయి పోయినా వాళ్ళ దృష్టి ఇటే ఉండటంలో ఆశ్చర్యం ఏదీ లేదు. ఇదివరకు ఎప్పుడో శ్రీదేవి తమిళ…

  • విశ్వ సుందరిగా ఎంపికైన వేదిక నుంచి ఆ పోటీలకు న్యాయ నిర్ణేతగా వెళ్ళటం అపురూపమైన విషయమో. మాజీ మిస్ యూనివర్స్ సుస్మితా సేన్ 1994లో ఫిలిప్ఫిన్స్ లోని మనీలాలో జరిగిన అందాల పోటీలో విశ్వ సుందరిగా ఎంపికయ్యారు. 23 సంవత్సరాల తర్వాత మళ్ళీ అదే వేదికపైన జనవరి 30వ తేదీన జరుగనున్న మిస్ యూనివర్స్ పోటీలకు జడ్జిలలో ఒకరిగా హాజరవుతున్నారు. ఈ విషయం గురించి చెపుతూఇది అపురూపమైన విషయం మాత్రమే కాదు పరిపూర్ణం కూడా. నా లైఫ్ ఇప్పుడు ఫుల్ సర్కిల్ తిరిగినట్లుగా ఉంది అంటోంది సుస్మితా సేన్. ఈ విషయాన్ని ధృవీకరిస్తూ కూతురు అలీషా సేన్ ఫోటోని ఇన్స్టాగ్రామ్ లో షేర్ చేశారు సుస్మితా. ఈ తల్లీకూతుళ్ళిద్దరితో పాటు మిస్ యూనివర్స్ కిరీటం కోసం మన దేశం నుంచి పోటీపడుతున్న రోష్మితా హరిమూర్తి భారతీయతకు నిండుదనం తేబోతున్నారు. ఆ రోజు రోష్మితకు టైటిల్ వస్తే మళ్ళీ అదో గొప్ప రికార్డు.

    అపురూపం కాదు పరిపూర్ణం

    విశ్వ సుందరిగా ఎంపికైన వేదిక నుంచి ఆ పోటీలకు న్యాయ నిర్ణేతగా వెళ్ళటం అపురూపమైన విషయమో. మాజీ మిస్ యూనివర్స్ సుస్మితా సేన్ 1994లో ఫిలిప్ఫిన్స్ లోని…

  • కన్నబిడ్డ పై అనురాగం చూపించే విషయంలో అమ్మస్థానంలో ఉన్న ఎవ్వరైనా ఒకటే. బాలీవుడ్ నటి రాణీముఖర్జీ తన ముద్దుల కూతురు అదిరా తొలిపుట్టినరోజున తన ప్రేమనంతా నింపిన ఒక ఉత్తరం రాసింది. అదిరా నువ్వంటే నాకెంతో ప్రేమ కాసేపు కనిపించక పోతే శ్వాస ఆగిపోతుందా అనిపిస్తుంది. ప్రతి నిమిషం నీ ధ్యాసే. అందరూ నాలాగే ఉంటారా? తమ పిలల్ల కోసం అనుక్షణం ఆందళోన చెందే అమ్మలందరికీ పాదాభివందనాలు చేయాలనిపిస్తుంది. నువ్వు పుట్టాక నాలో సహనం క్షమా గుణం పెరిగాయి. అంతరంగంలోకి చూసుకుంటే నేనెంతో మారిపోయాననిపిస్తోంది. ఇందుకు కారణం నువ్వే అదిరా. క్రమశిక్షణ తో ధైర్యంగా పెరగాలి. నిన్ను చూసి నారహో పాటు ఈ ప్రపంచం గర్వించాలి. నీ మనసుకి నచ్చిందే నువ్వు చేయి. అనుక్షణం ఆనందంగా జీవించు. ప్రేమతో మీ అమ్మ రాణీ ముఖర్జీ చోప్రా. ఇదీ ఉత్తరం. ఈ పాపాయిని కన్నతల్లైనా ఇంతకంటే తన బిడ్డను కోరేదీ ఆశీర్వదించేదీ ఉండదు.

    అదిరా ….. నువ్వు నన్ను మార్చేసావు

    కన్నబిడ్డ పై అనురాగం చూపించే విషయంలో అమ్మస్థానంలో ఉన్న ఎవ్వరైనా ఒకటే. బాలీవుడ్ నటి రాణీముఖర్జీ తన ముద్దుల కూతురు అదిరా  తొలిపుట్టినరోజున తన ప్రేమనంతా  నింపిన…

  • ఒకప్పటి స్టార్ యాక్టర్ ట్వింకిల్ ఖాన్నా ఇప్పుడు రచయిత్రి హ్యుమర్ లాడెన్ కాలమ్ గా ఆమె రాసిన షార్ట్ స్టోరీస్ ది లెజెండ్ ఆఫ్ లక్ష్మీ ప్రసాద్ ను సంకలనంగా తీసుకొచ్చిందామె. ఇటీవల జరిగిన ఈ పుస్తకావిష్కారణ కార్యక్రమానికి బాలివుడ్ కు చెందిన ఎంతోమంది ప్రముఖులు హాజరయ్యారు. ఆ కధలను రణబీర్ కపూర్, ఆలియాభట్, కరణ్ జోహార్ చదివి వినిపించారు. ట్వింకిల్ చాలా కాలంగా రాస్తూనే ఉన్నారు. 2015 లో ప్రచురించిన మై ఫన్నీ బోన్స్ పుస్తకం ఏకంగా లక్ష కాపీలు అమ్ముడైనాయి ఇప్పటికి తాజా పుస్తకం లక్ష్మి ప్రసాద్ ఆవిష్కరణ రోజే హాట్ హాట్ గా అమ్ముడైనాయట.

    ట్వింకిల్ కొత్త పుస్తకం ఆవిష్కరణ

    ఒకప్పటి స్టార్ యాక్టర్ ట్వింకిల్ ఖాన్నా ఇప్పుడు రచయిత్రి హ్యుమర్ లాడెన్ కాలమ్ గా ఆమె రాసిన షార్ట్ స్టోరీస్ ది లెజెండ్ ఆఫ్ లక్ష్మీ ప్రసాద్…