• ఈ కొత్త పరిశీలనని, సలహాని శ్రద్దగా అర్ధం చేసుకోవాలి. రోజులో ఏడు ఎనిమిది గంటలు పని చేస్తాం. పూర్తిగా ఏకాగ్రతతో పని చేయడానికి మనస్సులో నిశబ్దన్ని పెంచుకోవాలట. అంటే నిశ్శబ్దం అంటే ఏకాగ్రత. ఆ ఏకాగ్రత కోసం గంటకోసారైనావ్యక్తి నిశ్శబ్దం పాటించాలి. ఒక్క చపుడు కూడా చెవిన పడకుండా, ఏమీ ఆలోచించకుండా కేవలం పదే పది నిముషాలు మనస్సులో, బయటా మౌనం పాటించగలిగితే పని సమాధ్యం పెరుగుతుందని కొత్త రిపోర్ట్ చెపుతుంది. నిశ్శబ్దం ఎలా దొరుకుతుంది. ఎవ్వరు లేని ఏకాంతంలో కానీ అందరి మధ్య, ఉద్యోగం చేసే ప్రదేశంలో ఎలా? ఎక్కడ? సరైన సంగిఇతం వినాలి. కేవలం అది సౌండ్ పెరిగి ఇతరులను ఇబ్బంది పెట్టేదిగా ఉండకూడదు. మనలోకి మనం వుండే సమయం కోసం ఇయర్ ఫోన్స్ లో వినాలి. ఆ సంగీతంనెమ్మదిగా రెండు నిమిషాల్లో ఆ శబ్దం ఇంకొకటి వినిపించని స్తితికి తీసుకుపోతుంది. దాన్ని ప్రాక్టీస్ చేయాలి. సంగీతం అనుభవంలోకి తెచ్చుకోవాలి అంటున్నారు పరిశోధకులు. ఈ ఏకాంత స్థితి మనస్సుని స్వాంత పరచి, వత్తిడి, తగ్గించి, పని భారాన్ని తీసేసి తేటగా తాయారు చేస్తుంది. అప్పుడు మళ్ళి కొత్త శక్తి తో పని చేయ గలుగుతాం. పోనీ దీన్ని ప్రాక్టీస్ చేస్తే అలవారుచోకోవచ్చు ఏమో ప్రయత్నించవచ్చు కదా?

    మనస్సులో నిశ్శబ్దం సాధ్యమా?

    ఈ కొత్త పరిశీలనని, సలహాని శ్రద్దగా అర్ధం చేసుకోవాలి. రోజులో ఏడు ఎనిమిది గంటలు పని చేస్తాం. పూర్తిగా ఏకాగ్రతతో పని చేయడానికి మనస్సులో నిశబ్దన్ని పెంచుకోవాలట.…

  • మానసిక సంతోషం కోసం విహార యాత్రలు చేయండి అంటున్నారు నిపుణులు. రోజువారీ జీవితంలో కలిగే జడత్వాన్ని ఈ ప్రయాణాలు వదిలించి జీవితంనిస్సారంగా అనిపించకుండా చేస్తాయట ప్రయాణాలు. కొత్త ప్రదేశాలు చూస్తూ వుంటే ప్రాంతం, భాష, మనుషులు, ఆహారం, మన ఆహార్యం కూడా మారుతుంది. ఈ కాస్త ఆటవిడుపు ప్రయాణం మనకు కొత్త రుచుల్ని, కొత్త అనుభవాలని ఇస్తుంది. మన పూర్వీకులు కూడా తీర్ధ యాత్రలకు వెళ్ళేవారు. అమీబా లాగా కదలకుండా వుంటే మన మెదడు లో నెగిటివ్ ఫీలింగ్స్ వస్తాయి. అవి శరీరం పై తీవ్ర ప్రభావం చూపుతాయి. మనకున్న చిరాకులు, విసుగులు మరచిపోవాలంటే డైలీ రొటీన్ జీవితం నుంచి కాస్త విముక్తి కావాలంటే ఉన్న పరిస్తితుల నుంచి కాస్త దూరంగా వెళ్ళాలి. మనసుకు ఒక ఉపశమనం కలుగుతుంది. ప్రయాణం కోసం ఎన్నో సులభమైన మార్గాలున్నాయి. అద్భుతమైన సౌకర్యాలున్నాయి. విలాసవంతమైన ప్రయాణాలే విహార యాత్రలు కావు. చిన్న పల్లెటూర్లో కాస్త మార్పుగా రెండు రోజులు గడిపినా చాలు అదీ గొప్ప అనుభవమే. ఏ వయసులో ఉన్నా ఈ ప్రయాణాలు ఆనందాన్నే ఇస్తాయి.

    ప్రశాంతత కోసం ఓ ప్రయాణం

    మానసిక సంతోషం కోసం విహార యాత్రలు చేయండి అంటున్నారు నిపుణులు. రోజువారీ జీవితంలో కలిగే జడత్వాన్ని ఈ ప్రయాణాలు వదిలించి జీవితంనిస్సారంగా అనిపించకుండా చేస్తాయట ప్రయాణాలు. కొత్త…

  • మనం చాలా మందిలో మాట్లాడుతుంటాం. ఫేస్ బుక్ లో, ట్విట్టర్ లలో ఇంకో సోషల్ నెట్ వర్క్ లో మన భావాలు పంచుకుంటాం. అయితే ఇలా మాట్లాడటంలో మనం మాట్లాడే భాషల వల్ల మనకి గుండె జబ్బులు వచ్చే అవకాసం వుందో లేదో చెప్పగలరట పరిశోధకులు. ఎటు ఆరు లక్షల మంది వుద్రోగం లో ఆస్పత్రి పాలవుతున్నారు. ఇదంతా ఒత్తిడి ఆందోళన డిప్రషన్ వల్లనే అంటున్నాయి కొత్త పరిశోధకులు. మన గుండెల్లో వుండే ఆలోచన, మన ఉద్రేకం శాతం, ఇష్టం ఇవన్నీ మన భాష లోనే తలిసిపోతాయి. మన మాటల్లో నిత్యం వండర్ ఫుల్, ఫ్రెండ్స్, బావున్నాం, బావున్నారా, సంతోషం, ఎంత చెక్కని పాట, ఎంత అందమైన ప్రకృతి వంటి భావజాలాలకు సంబందించిన మాతలుంటే మనం ఆశావాద దృక్పదంతో ఉన్నట్లు అర్ధం. అలా శాతంగా వుండే వారికి ఎలాంటి అనారోగ్యాలు రాకుండా ఉంటాయి అంటున్నారు పరిశోధకులు.

    శాంతంగా ఉంటేనే ఆరోగ్యం

    మనం చాలా మందిలో మాట్లాడుతుంటాం. ఫేస్ బుక్ లో, ట్విట్టర్ లలో ఇంకో సోషల్ నెట్ వర్క్ లో మన భావాలు పంచుకుంటాం. అయితే ఇలా మాట్లాడటంలో…

  • ఇంటా బయటా ద్విపాత్రాభినయం తో కలిగే వత్తిడి కారణంగా మహిళల మానసిక ఆరోగ్యం ప్రస్నార్ధకమైంది. నిత్యం అనేకమైన పనులు ఇంటి చాకిరీ వృత్తి పరమైన బాధ్యతల వల్ల ఎక్కువ వత్తిడికి గురవుతున్నది మహిళలే అని అనేక పరిశోధనలు వెల్లడించాయి. ఈ వత్తిడి వల్ల హార్మోన్ల పనితీరు దెబ్బతింటోంది. ఫలితంగా సంతాన లేమి అధిక బరువు మధుమేహం గుండె సంబంధిత సమస్యలు స్త్రీలలో తలెత్తుతున్నాయి. వీటన్నిటికీ చెక్ పెట్టాలంటే ధ్యానం ఒకటే మార్గం అంటున్నారు మానసిక వైద్య నిపుణులు. అసలు ధ్యానమంటే ఏమిటి? శారీరిక మానసిక భావోద్వేగాల సమతుల్యతలకు మేలైన సాధనం. ధ్యానం అసలెలా చేయాలి. ప్రశాంతమైన మనసుతో కళ్ళు మూసుకుని ఆలోచనను శ్వాస పైన కేంద్రీకరించాలి. ఒక వస్తువు పై దృష్టి కేంద్రీకరించి మిగతా ఆలోచనల్ని పక్కన పెడితే మనసు నెమ్మదిగా ఆ వస్తువు పైన లగ్నం అవుతుంది. ఇలా ఏకాగ్రత అలవాటై సహజ సిద్ధంగా అభివృద్ధి అవుతుంది. మనసును ఏకాగ్రత చేయగలిగితే నిర్మాణాత్మకమైన ఆలోచనలు కలుగుతాయి. ప్రతికూలమైన ఆలోచనల నుంచి అంటే కోపం వేదన పని వత్తిడి ఇవన్నీ మనసులోంచి మాయం చేసి కాసేపు ప్రశాంతంగా కళ్ళు మూసుకుని మంచి జరుగుతుందేమో ప్రయత్నిస్తే తప్పేముంది.

    ధ్యానాన్ని అలవర్చుకుంటే శాంతి

    ఇంటా బయటా ద్విపాత్రాభినయం తో కలిగే వత్తిడి కారణంగా మహిళల మానసిక ఆరోగ్యం ప్రస్నార్ధకమైంది. నిత్యం అనేకమైన పనులు ఇంటి చాకిరీ వృత్తి పరమైన బాధ్యతల వల్ల …