Wednesday, 05 Aug, 2026

విలక్షణ నటి బారతి కి పురస్కారం

1960- 80 ల్లో తెలుగు, తమిళ, హిందీ భాషల్లో అగ్ర హీరోల సరసన స్టార్ నాయిక భారతీ విష్ణు వర్ధన్ ను పద్మ పురస్కారం వరించింది. 1975లో కన్నడ నటుడు విష్ణు వర్ధన్ ను వివాహం చ్సుకున్నారు. నటిగానే కాకుండా గాయని గానూ పేరు తెచ్చుకున్నారు. చిత్ర పరిశ్రమకు ఆమె అందించిన సేవలకు గానూ ఆమె ఈ పురస్కారం లభించింది.

పాటకు పట్టం కట్టిన అనురాధ కు పురస్కారం

నలభై ఏళ్లకు పైగా తన గానం తో అందరిని అలరించిన అనురాధ పౌడ్వాల్ కు పద్మశ్రీ  లభించింది. 16 భాషల్లో వేల గీతాల తో పాటలకు పట్టం కట్టిన అనురాధ ఒక్క హిందీలోనే 5296 పాటలు పాడారు. ఫిలిం ఫేర్ పురస్కారాలు గౌరవ డిలిట్ డిగ్రీ ని పొందారు.