Sunday, 28 Jun, 2026

శరీరపు అలసట కనిపెట్టాలి

బరువు తగ్గాలనుకోవటం ఒక సాధన. ఆ క్రమంలో శరీరం ఎంత శ్రమ ఓర్చుకోగలుగుతుందో గమనించుకోమంటున్నారు నిపుణులు. వ్యాయామం చేసినప్పుడు దాహం వేసిన పెదవులు తడారిపోయినా శరీర ఉష్ణోగ్రత పెరిగినా వెంటనే  నీళ్లు తాగాలి. జీవక్రియల పనితీరు సరిగ్గా ఉండేలా మితంగానే వ్యాయామం చేయాలి. శరీరం అలసిపోతేనే కండరాలు కీళ్ల నొప్పులు వస్తాయి. శరీరం  అతిగా అలసిపోయిందని చెప్పే సంకేతాలివి. మధ్యమధ్యలో విశ్రాంతి తీసుకుంటూనే వ్యాయామం చేయాలి. వ్యాయామం  తరువాత వెంటనే స్నానం వద్దు . అలాని ఏసీ […]

వాళ్ళకే తప్పు లేదు మీకెందుకు భయం

ఇంటి దగ్గరుండే మైదానాల్లోనో మామూలు వీధుల్లోనో పరుగు పందెం కోసం సాధన చేసే క్రీడాకారిణులకు  ఆకతాయిల వేధింపులు ఎన్నో ఎదురవుతూ వుంటాయని ప్రపంచ వ్యాప్తంగా మహిళా అథ్లెట్ల పరిస్థితి ఇలాగే ఉంటుందని రన్నర్స్ వరల్డ్ అనే పత్రిక నిర్వహించిన అధ్యయనంలో తేలింది. 2533 మంది అథ్లెట్ల తో ఈ అధ్యయనం చేశారట. ఈ వేధింపులకు భయపడి మన క్రీడా కలల్ని తుంచేసుకొనవసరం లేదు. ఆటలో దూకుడు ప్రదర్శించి పతకాలు  గెల్చుకోవాలి అని చెప్తోంది. అమెరికన్ క్రీడా కారిణి […]

అబద్దాలతో ఆరోగ్య హాని

అబద్దాలు ఎంత తక్కువ చెప్తే ఆరోగ్యం అంత బావుంటుందని అధ్యయనాలు చెపుతున్నాయి. 18 నుంచి 71 సంవత్సరాలున్న వయస్సు వారిలో పదివారాల పాటు పాలిగ్రఫీ పరీక్షలు నిర్వహించారు. అబద్దాలు చెపుతుంటే యంగ్జయిటీ  వల్ల  కార్టిసాల్ స్థాయిలు పెరుగుతున్నాయిట. హార్ట్ రేట్ రక్తపోటు పెరుగుతాయి. దానితో శరీరం నిరంతరం ఫ్లైట్ ఆర్ ఫ్లైట్ మోడ్ లో ఉంటుందిట. ఈ స్థితి రోగ నిరోధక వ్యవస్థని దెబ్బ తీస్తుందిట. మన శరీరం మన ఆలోచనలు భావాలకు ప్రభావితం అవుతుంది కనుక […]

అద్భుత పోషకాల వీట్ గ్రాస్

వీట్ గ్రాస్ అంటే గోధుమ గడ్డి ఇప్పుడు చాలా మందిని ఆకర్షిస్తోంది. డిటాక్సిఫికేషన్ కోసం బరువు తగ్గేందుకు మాత్రమే కాకుండా ఈ గోధుమ గడ్డి విటమిన్ల స్టోర్ హౌస్. చక్కని ద్రుష్టి ఆరోగ్యవంతమైన చర్మం పుష్కలంగా ఖనిజాలు దొరకటంతో గోధుమ పిండి జ్యూస్ ని ఎంతో మంది రెగ్యులర్ గా  తీసుకుంటున్నారు. లివర్ బలోపేతం చేయటం బ్లడ్ షుగర్ స్థాయిల్ని క్రమబద్దీకరించటం గుండెకు బలం ఇవ్వటం తో పాటు  ఈ వీట్ గ్రాస్ జ్యూస్ కాన్సర్ రోగులకు […]

సృజనాత్మకత మహిళల్లోనే ఎక్కువ

మార్గరెట్ ఏవిలాక్స్ 1938 లో చికాగో లో పుట్టింది. మెకానికల్ ఇంజినీరింగ్ లో గ్రాడుయేషన్ తీసుకుంది. 250 సంవత్సరాల క్రితం ఇంజినీరింగ్ చదివి కారు హీటర్ ని రూపొందించిన ఘనత ఆమెది. ఆ ఆకాలంలో కార్లు త్వరగా వేడెక్కేవిట. మార్గరెట్ రూపొందించిన కారు హీటర్ ని పేటెంట్ హక్కు ఇచ్చింది అమెరికా. ఆమె అంతటితో ఆగకుండా డిష్ వాషర్ వాషింగ్ మెషిన్ ఇంకా మరి కొన్ని వస్తువులకు రూపకల్పన చేసింది. ఇప్పుడు మనం వాడుతున్న వాషింగ్ మెషీన్ […]

ఐస్ క్రీమ్ మేకర్ మహిళ తెలివే !

ఇప్పుడు ఐస్ క్రీమ్  కి సంబంధించి ఎన్ని వెరైటీలు ఉన్నాయో ఎన్ని రకాల ఆహార పదార్ధాలు క్రీమ్  బేస్డ్ గా  తయారు చేస్తారో చెప్పాలంటే బోలెడంత ఉంటుంది. 1843 లో నాన్సీ జాస్తాన్ అనే సాధారణ గృహిణి పిల్లల కోసం హ్యాండ్ ఐస్ కక్రీమ్  మేకర్ మీ తయారుచేసింది. రెండు రకాల ఫ్లేవర్ లతో ఒకేసారి ఐస్ క్రీమ్  తయారయ్యేలా విడివిడిగా తీసుకునేలా ఆమె దాన్ని తయారు చేసింది. చాలా కాలం  ఈ హ్యాండ్ మిషన్ ఐస్ […]

నిద్రలేమితో అనర్ధం

నిద్ర సరిగ్గా పోకపోతే ఊబకాయం వస్తుందని డాక్టర్లు చెపుతుంటారు. కానీ ఈ నిద్ర పట్టనివారు రోజు మొత్తం మీద తీసుకోవాలిసిన క్యాలరీల కన్నా 365 క్యాలరీలు ఎక్కువ తీసుకుంటున్నారనీ  వీరిలో క్యాలరీల ఖర్చు తక్కువగా ఉంటుందనీ చెపుతున్నారు. కావలిసిన దాని కన్నా ఎక్కువ ఆహరం తీసుకోవటం లేదా నిద్రపట్టక సమయం గడవక ఎదో ఒక చిరుతిండి తినటం వల్ల  ఊబకాయం   వస్తోందనీ  తేలుతోంది. లండన్ లోని కింగ్ జార్జ్ యూనివర్సిటీ పరిశోధకులు 172 మంది పైన పరిశోధన […]

ఒకప్పటి సౌందర్య సాధనాలు ఇవే

ముఖం కాంతిగా తాజాగా అనిపించాలంటే వంటింటి టిప్స్ వందల కొద్దీ ఉంటాయి. తవ్వితే ఊరే  చాల మల్లాగా. ఇవి తరాల నుంచి వస్తున్నా సౌందర్య సాధనాలు. పాల మీగడ నారింజ రసం సెనగపిండి కలిపి మంచి ఫేస్ ప్యాక్. యాపిల్ ముక్కలు గుజ్జు పాల పొడి ఇంకో నాలుగు చెంచాల పాలు ఇంకో మంచి కాంబినేషన్. మూడు చెంచాల పెసర పిండి పసుపు పాలు కలిపితే చర్మ సంబంధిత ఇన్ఫెక్షన్లను కూడా పోగొట్టే మంచిపూత అవుతుంది. నిమ్మరసం […]

ఆందోళనే అసలు కారణం

అతి సర్వత్ర వర్జాయేత్ అన్నది పెద్దలు చెప్పేది. దేనికైనా అతి పనికిరాదు. ఆరోగ్యం భయం ప్రమాదకరం అంటున్నారు  నార్వే పరిశోధకులు.ఆరోగ్యం గురించి ఎక్కువగా ఆలోచించేవాళ్ళు అతి శ్రద్ధ తీసుకునేవాళ్ళు అనవసర భయంతో గుండె జబ్బులకు లోనవుతారంటున్నారు. ఒక అధ్యయనంలో పది వేల మంది ఆహారపు అలవాట్లు ఆరోగ్య స్థితి ఆరోగ్యం పట్ల వాళ్ళ ఆలోచనా విధానం ఇవన్నీ నమోదు చేసారు. ఏడేళ్ల పాటు ఈ అధ్యయనం నిర్వహించాక  వాళ్ళ ఆరోగ్య స్థితి గమనిస్తే ఆరోగ్య భయం వున్నవాళ్లు […]

ఈవిడను చుస్తే భయం పోతుంది

40 దాటితే జీవితపు మొదటి గంట కొట్టిందనీ ఇక అరవై దాటితే ఇంకేం జీవితం లే అనే అనుకుంటాం. సాధారణంగా ఓల్డ్ ఏజ్ మొదలైనట్లు ఇక ఇక్కట్ల లో పడినట్లు అనిపిస్తుంది. కానీ చిలీ కి చెందిన ఎలీనా గాల్వేజీ అనే 90 ఏళ్ల  ముసలమ్మ మాత్రం ఆలా ఎప్పటికీ అనుకోలేదు. ఎలాగంటే ఈ వయసులో ఈ బామ్మ  సైకిల్ తొక్కుతుంది. ప్రతి రోజూ ఏకధాటిగా 30 కిలో మీటర్లు ప్రయాణం చేస్తోంది. పాలు ,గుడ్లు స్వయంగా […]

ఆ సినిమా తమన్నా నే ఆకర్షణ

హీరోల పేర్లు చూసి సినిమాలకు క్రేజ్ పెరుగుతుందనీ అసలు హీరోల వల్లే బ్లాక్ బస్టర్లు అవుతాయని సాధారణంగా సినిమా వార్తలు చూస్తుంటాం. ఇప్పుడు అంత క్రేజ్ హీరోయిన్  తమన్నా ఐటెం సాంగ్ కు ఉందిట. ఈమె హీరోయిన్ గా  నటిస్తే ప్రేక్షకులు ఆనందిస్తారనుకుంటే ఆడో కధ. ఇప్పుడు ఆమె ఐటెం సాంగ్  ఉన్నా చాలు ఆ సినిమాకు కనకవర్షం కురుస్తుందిట. హీరో విశాల్ నటించిన ఒక్కడున్నాడు సినిమాకు అదనపు ఆకర్షణ కోసం తమన్నా తో ఐటెం సాంగ్  […]

ఎప్పటికీ మారని ఫ్యాషన్ మాక్సీ

సిల్క్, షిపాన్, జెర్రీ వస్త్రాలతో పాటు బెనారస్, ఇకత్, కాటన్ మాక్సీలొస్తున్నాయి. అమ్మాయిలకు విహార యాత్రలు ఇష్టంగానే వుంటాయి. అలా లాంగ్ డ్రైవ్ కోసం మాక్సీలు క్యాజువల్ లుక్ తో స్టైల్ గా బాగుంటాయి. ఉదయం వేళ ప్రయాణాలకు మంచి పువ్వుల ప్రింట్స్ బాగుంటాయి. ప్రయాణాలకే సౌకర్యం కోసం అనుకోకుండా పార్టీ వేర్ గా అయితే మెరిసే వస్త్రం తో చేసిన మాక్సీలు ఎంచుకోవచ్చు. లేదా బెనారెస్ బ్రోకేడ్ వంటి వస్త్రాలతో రూపొందించిన మాక్సీలు కూడా మోడరన్ […]

లక్స్ మోడల్స్ కు అవార్డుల తో సత్కారం

ముంబాయిలో లక్స్ గోల్డెన్ రోజ్ అవార్డ్స్ 2016 కార్యక్రమంలో లక్స్ తన మోడలింగ్ తారలను అవార్డులతో సత్కరించింది. నాటి తార షర్మిలా టాగోర్ కు లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు, కరీనాకపూర్ కు గ్లామర్ దివా అవార్డు, దీపికా కు ఐకానిక్ లుక్ అవార్డు ఇచ్చారు. పూజా హిగైకు బెస్ట్ డెబ్యు అవార్డు బహుకరించారు. లక్స్ మొట్టమొదట 1899 లో బ్రిటన్ లో ఒక లాండరీ షాప్ గా మొదలైంది. లక్స్ బ్రాండ్ ప్రచారంలో బ్లాక్ అండ్ […]

బీరు కనిపెట్టింది మహిళలే

బీరు తాగటం లేదా బీరు లాంటి ఉత్పాదనలు అమ్మే షాపులు ఇవన్నీ పురుషుల ప్రత్యేక ప్రపంచానికి చెందినవి. కానీ బీరు తయారుచేసింది దాన్ని ఉపాధిగా చేసుకుంది మహిళలే. మెసపొటేమియా మహిళలు మొదటి ఓ పదివేల సంవత్సరాలకు  పూర్వం  గుమ్మడి పండు చెరుకు పిప్పి అడవి తేనె  తదితర వస్తువులతో ఇళ్లలో తయారుచేసుకునేవాళ్లట. ఆ ఆకాలంలో దాన్ని దేవత ప్రసాదంగా భావించి తీసుకునేవాళ్ళు. మహిళలు దాన్ని తయారు చేసి అమ్మి ఆ  సొమ్ముతో ఇంటికి కావలిసిన వస్తువులు తెచుకునేవాళ్లట. […]

ఇలా చేస్తే జుట్టు రాలుతుంది

జుట్టు రాలిపోవడం ఇప్పుడు వందలో 99 మంది సమస్య. దువ్వుతుంటేనే రాలిపోతుంటాయి. వాతావరణం కాలుష్యం మొదటి కారణం అయితే మానసిక ఒత్తిడి రెండో కారణం. ఒక్కసారి అతి శ్రద్ధ తీసుకోవటం కూడా కారణం కావచ్చు. వాడే మంచి అనుకునే షాంపూలు నూనెలు ఆధునిక వైద్యలు ఇవన్నీ… ఇప్పుడు తలంటుకుంటే షాంపూలు గట్టిగా రుద్దేయటం కూడా కేశ సంపదకు నష్టం కలిగించేదే. ఎక్కువగా బ్రషింగ్ చేసినా  నష్టమే. షాంపూ చేసుకున్నాక అతడి జుట్టును గబగబా టవల్ తో అద్దేయద్దు. […]

ఎత్తు మడమల చెప్పులతో పాదాల నొప్పులు

ఎత్తు మడమల చెప్పులే అమ్మాయిలకిష్టం. పొడుగ్గా కనబడతారు మోడరన్ డ్రెస్ లకు తగ్గినట్లు ఉంటుందని కష్టపడి నడుస్తూ వుంటారు. కానీ ఇలా హీల్స్ వాడేవాళ్లలో మోకాళ్ళ నొప్పులొస్తాయి జాగ్రత్త అంటున్నారు డాక్టర్లు. హీల్స్ ఎత్తయ్యే కొద్దీ కాలి పిక్క కండరం బిగుసుకుపోతుందిట. రెండడుగుల మించి ఎత్తు చెప్పులు వాడనే వద్దంటున్నారు. ఇప్పటికే  నొప్పులొస్తే కాళ్ళకి  పుదీనా గుణాలున్న ఆయిల్ తో మస్సాజ్ చేసుకుంటే ఉపశమనం కలుగుతుంది. అలాగే రాళ్ల ఉప్పు వేసిన గోరు  వెచ్చని నీళ్లతో కాళ్ళని […]

బీట్ రూట్ జ్యూస్ తో సూపర్ పవర్

ప్రతి రోజు ఒక అర గ్లాస్ బీట్ రూట్ రసం తాగితే కండరాల శక్తి పెరుగుతుందని వాషింగ్టన్ వైద్య విద్యాలయ పరిశోధనలు వెల్లడిస్తున్నాయి. ఇది హృద్రోగులకు కూడా చాలా  శక్తినిస్తుంది. సరుకులు మోయటం మెట్లెక్కటం వంటి దైనందిన మైన పనులు చేయలేకపోవటం కండరాలు శక్తి  క్షీణించటం వల్లనే అంటున్నారు ఎక్సపర్ట్స్. బీట్ రూట్ రసంతో నైట్రేట్ సుతఃయిలు అత్యధికంగా ఉన్నాయని వీటిని శరీరం నైట్రిక్ ఆక్సైడ్ గా మార్చుకుంటుందనీ దీని వల్ల  కాంట్రక్షన్  స్పీడ్ శక్తి పెరుగుతుందంటున్నారు. […]

ఏ యాపిల్ మంచిది

ఆర్గానిక్ కూరగాయలు పండ్లు సేంద్రియ ఎరువులు వేసి సహజమైన పద్ధతుల్లో పండిస్తారనీ  ఆరోగ్యానికి మంచిదనీ ఖరీదైనా  కొనాలనుకుంటాం. పళ్ళు ,కాయగూరల పై లేబుల్స్ ఉంటాయి. వాటిని బట్టి అవి ఆర్గానిక్ వా  కాదా తెలుసుకోవచ్చు. ఆపిల్ కూడా లేబుల్ పైన నాలుగు అంకెలు వుండి  మొదటి అంకె మూడు లేదా నాలుగు అని వుంటే  అవి పురుగు మందులు వేసినవి అని అర్ధం. లేబుల్ పైన ఐదు అంకెలుండి మొదటి అంకె ఎనిమిది అయితే అది జన్యు […]

కోటి దీపోత్సవంలో మహారాష్ట్ర గవర్నర్ విద్యాసాగర్ రావు దంపతులు

కార్తీక మాసం సందర్భంగా భక్తి టీవి నిర్వహిస్తున్న కోటి దీపోత్సవాల వేడుక కన్నుల పండుగ గా జరుగుతుంది. నవంబర్ 5వ తేదీ నుంచి 21వ తేదీ వరకు జరగనున్న ఈ వేడుకల్లో నిత్యం వివిధ ప్రత్యేక పూజలతో దైవాన్ని ఆరాదిస్తూ కోటి దీపోత్సవం కార్యక్రమాన్ని వేడుకలా నిర్వహిస్తున్నారు. బుధవారం జరిగిన ప్రత్యేక పూజలు, కార్తీక దీపారాధనలో మహారాష్ట్ర గవర్నర్ విద్యాసాగర్ రావు దంపతులు పాల్గొన్నారు.