అద్భుతమైన ఆదాయ మార్గం

అద్భుతమైన ఆదాయ మార్గం

అద్భుతమైన ఆదాయ మార్గం

మరియా కురియా కోస్,వాడిపారేసిన కొబ్బరి చిప్పలతో అద్భుతమైన కళాకృతులు తయారు చేస్తున్నారు. కేరళకు చెందిన మరియా స్పెయిన్ లో చదువుకున్నారు. తన కెరీర్ ఉద్యోగం కంటే మురికివాడల మహిళలకు ఆర్థిక భద్రత కల్పించడం లక్ష్యం అనుకున్నది మరియా. కేరళ కొబ్బరి ఉత్పత్తులకు ప్రత్యేకం.మరియా కొబ్బరి చిప్పలతో ఎన్నో రకాల కళాకృతులు తయారుచేసి బెంగళూరు ఢిల్లీ చెన్నై నగరాల్లోని కంపెనీలను సంప్రదించారు వినూత్నంగా ఆకర్షణీయంగా ఉన్న ఈ వస్తువులకు ఎన్నో ఆర్డర్లు వచ్చాయి.Thenga అనే పేరుతో ఒక కంపెనీ ప్రారంభించి మురికివాడల మహిళలను తన యూనిట్ లో చేర్చుకొని కాఫీ కప్పులు బౌల్స్ ఇతర నిత్యావసర వస్తువులు కంటైనర్లు వంటివి కూడా చేయడం నేర్పించింది. ఈమె యూనిట్లో పని చేసే వాళ్ళందరూ మహిళలు.నేను కోరుకున్నట్లు నాతో పాటు అందరికీ ఉపాధి దొరికింది అంటున్నది మరియా.