• ఇంట్లో ఎక్కడ చూసినా రాలే వెంట్రుకలు కనబడి మనకు కష్టం కలిగిస్తే ముందు ఈ గృహా చికిత్సలు జాగ్రత్తలు తీసుకోవాలి. కొబ్బరినూనె ఆలివ్ ఆయిల్ వంటి గోరు వెచ్చని సహజ నూనెతో మాడు మసాజ్ చేసుకుని హాట్ ఆయిల్ ట్రీట్మెంట్స్ ఇవ్వాలి. మందార ఉసిరి మల్లె పువ్వులు కొబారినూనెలో వేసి కాచి గోరు వెచ్చగా ఉన్నప్పుడు అప్లయ్ చేయటం వల్ల రక్త సరఫరా మెరుగవుతుంది. రాత్రంతా మెంతులు నానబెట్టి రుబ్బు కొబ్బరి పాలతో కలిపి శిరోజాలకు అప్లయ్ చేయాలి. పెరుగులో ఎగ్ వైట్ కలిపి హెయిర్ ప్యాక్ వేసుకోవాలి. గోరువెచ్చని నూనెలో నిమ్మరసం వెనిగర్ కలిపి చివరి వాష్ గా వాడాలి. హెయిర్ వాష్ కు ముందు కొబ్బరి నూనె అప్లయ్ చేయాలి. హెయిర్ కేర్ స్టైలింగ్ ఉత్పత్తుల్ని హేతుబద్దంగా వాడాలి. హెయిర్ డ్రై లు రంగులు శిరోజాల స్క్రబ్బర్స్ కు హాని కలిగిస్తాయి. బ్లో డ్రయింగ్ రీ బాండింగ్ వంటి హీటింగ్ పద్ధతుల క్యూటికల్స్ ఓపెన్ అవటానికి జుట్టు చిట్లి పోవటానికి ప్రధాన కారణం అవుతాయి.

    ఈ గృహ చికిత్సల వల్ల మేలే

    ఇంట్లో ఎక్కడ చూసినా రాలే వెంట్రుకలు కనబడి మనకు కష్టం కలిగిస్తే ముందు ఈ గృహా చికిత్సలు  జాగ్రత్తలు తీసుకోవాలి. కొబ్బరినూనె ఆలివ్ ఆయిల్ వంటి గోరు…

  • మనసులో వత్తిడి పెరిగిందనుకో జుట్టు రాలిపోవటం చర్మం నిర్జీవంగా మారటం చాలా మంది ఆడవాళ్ల సమస్య. టెన్షన్ అనిపించినప్పుడల్లా వేడి కాఫీ తాగటం వల్ల కూడా చర్మం తేమ పోగొట్టుకుని డల్ గా అవుతుందంటారు డెర్మటాలజిస్టులు. దీని బదులు పండ్ల రసం లేదా మంచి నీళ్లు తాగితే చర్మం పాడవకుండా ఉంటుంది. మాయిశ్చరైజర్ ముఖం కాళ్ళు చేతులకు రాసుకోవాలి. పోషకాల కోసం నట్స్ మాంసకృత్పతులు పిండి పదార్ధాలు ఎంచుకోవాలి. ఈ పోషకాలు జుట్టుకే కాదు చర్మానికి మేలు చేస్తాయి. కళ్ళు అలసిపోకుండా కళ్ల పైన కీరా బంగాళా దుంప ముక్కలు ఉంచుకోవాలి. బొప్పాయి కీరా గుజ్జు సమపాళ్లలో టీయూస్కుని అందులో కాస్త సెనగ పిండి కలిపి ముఖం మెడకు పూతలా వేసుకుంటే చర్మం తేమగా తాజాగా ఉంటుంది. కొబ్బరి నూనె వేడిచేసి తలకు మస్సాజ్ చేస్తూవుంటే జుట్టు రాలిపోవడం ఆగిపోతుంది. శరీరంలో జరిగే ప్రతి చర్య చర్మం పైన జుట్టు పైన ప్రభావం చూపెడుతుందని వత్తిడి టెన్షన్ లు తగ్గించుకునేందుకు కాసేపు ధ్యానం చేయటం అలవర్చుకోవాలంటున్నారు.

    జుట్టు రాలిందంటే మానసిక వత్తిడే

    మనసులో వత్తిడి పెరిగిందనుకో జుట్టు రాలిపోవటం చర్మం నిర్జీవంగా మారటం చాలా మంది ఆడవాళ్ల  సమస్య. టెన్షన్ అనిపించినప్పుడల్లా వేడి కాఫీ తాగటం వల్ల  కూడా చర్మం…

  • జుట్టు రాలిపోవడం ఇప్పుడు వందలో 99 మంది సమస్య. దువ్వుతుంటేనే రాలిపోతుంటాయి. వాతావరణం కాలుష్యం మొదటి కారణం అయితే మానసిక ఒత్తిడి రెండో కారణం. ఒక్కసారి అతి శ్రద్ధ తీసుకోవటం కూడా కారణం కావచ్చు. వాడే మంచి అనుకునే షాంపూలు నూనెలు ఆధునిక వైద్యలు ఇవన్నీ... ఇప్పుడు తలంటుకుంటే షాంపూలు గట్టిగా రుద్దేయటం కూడా కేశ సంపదకు నష్టం కలిగించేదే. ఎక్కువగా బ్రషింగ్ చేసినా నష్టమే. షాంపూ చేసుకున్నాక అతడి జుట్టును గబగబా టవల్ తో అద్దేయద్దు. హెయిర్ డ్రయర్ల వాడకం కూడా ప్రమాదం. హెయిర్ ప్రాడక్ట్స్ లో వుండే రసాయనాల జుట్టు పై ప్రభావం చూపెడతాయి. రకరకాల హెయిర్ స్టైల్స్ కోసం జుట్టును హీట్ చేయటం కూడా జుట్టు రాలేందుకు కారణం కావచ్చు. అతి ప్రాచీన పద్ధతి జుట్టు ను వారానికోసారి వేడి చేసిన కొబ్బరి నూనెను కుదుళ్లను తాకేలా మర్దన చేసి కుంకుడు కాయలు వాడి స్నానం చేయటం బెస్ట్ పద్ధతి.

    ఇలా చేస్తే జుట్టు రాలుతుంది

    జుట్టు రాలిపోవడం ఇప్పుడు వందలో 99 మంది సమస్య. దువ్వుతుంటేనే రాలిపోతుంటాయి. వాతావరణం కాలుష్యం మొదటి కారణం అయితే మానసిక ఒత్తిడి రెండో కారణం. ఒక్కసారి అతి…