సహజ సిద్ధ ఉత్పత్తిని ఉత్పత్తులను అందించే ఆయుర్వేద బ్రాండ్ ఫారెస్ట్ ఎసెన్షియల్స్ ప్రారంభించింది మీరా కులకర్ణి. రెండు లక్షల రూపాయలతో ప్రారంభించిన ఈ వ్యాపారం ఈరోజు 8300 కోట్లకు పెరిగింది. మీరా కులకర్ణి ఉత్తరాఖండ్ లోని తెహ్రీ గర్వాల్ లో జన్మించింది. 2000 ప్రాంతంలో భారత దేశంలో లగ్జరీ ఆయుర్వేద ఉత్పత్తులు దాదాపు లేవు. మీరా వంటగది నుంచే సబ్బులు నూనెలతో చిన్న ప్రయోగాలు ప్రారంభించి బంధువులకు అమ్మేది. కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్స్ ,నెయ్యి, సహజ మూలికలు ఉపయోగించిన ఈ ఉత్పత్తులు మార్కెట్లోని రసాయనక ఉత్పత్తులకు భిన్నంగా ఉండేవి. అక్కడి నుంచే ఫారెస్ట్ ఎసెన్షియల్స్ క్రమంగా పెరిగింది. 2008లో ప్రఖ్యాత సౌందర్య ఉత్పత్తుల సంస్థ ఎస్టీ లాడర్ కంపెనీ ఫారెస్ట్ ఎసెన్షియల్స్ లో వాటా కొనుగోలు చేసింది .ప్రస్తుతం ఫారెస్ట్ ఎసెన్షియల్ స్టోర్లు దేశవ్యాప్తంగా 130 పైగా ఉన్నాయి.120 దేశాలకు ఈ సంస్థ తన ఉత్పత్తులను ఎగుమతి చేస్తుంది. చర్మ సంరక్షణ,కేశ సంరక్షణ వంటి వస్తువులు అన్ని ఆయుర్వేద సూత్రాలతో రూపొందించినవి. మీరా ప్రస్తుతం భారతదేశం లోని అత్యంత సంపన్న పారిశ్రామికవేత్తలలో ఒకరు.













