• ఇది మల్లెల మాసం. ఎండల్లో దొరికే అద్భుతమైన పూలు ఇవి ఈ సువాసనల మల్లెలలో సౌందర్య పోషణ చాలా ఈజీ, ఇలాంటి సైడ్ ఎఫెక్ట్ లు రావు కూడా మల్లెలు ఎండబెట్టి పొడి చేయాలి. అందులో పాలు ముల్తాని మట్టి, ఓట్స్ కలపాలి. దీన్ని ముఖానికి రాసి మర్దనా చేస్తే మృతకణాలు తొలగిపోతాయి. అలాగే కొన్ని బంతి రేకులు, గులాబీ పువ్వులు కలిపి ముద్దగా చేసి అందులో కాస్త పెరుగు కలిపి పుతలా వేసుకోవచ్చు. దీని వల్ల చర్మం మృదువుగా మారుతుంది. ఎండ కారణంగా పేరుకొన్న నలుపుదనం పోతుంది. అలాగే గులాబీ రేకుల్ని ఎండబెట్టి పొడిగా చేసుకోవాలి. అందులో కాస్త గోధుమ పిండి, పెరుగు కలిపి నిగారింపుతో వుంటుంది. ఈ పూత వల్ల చర్మానికి తేమ అంది మృదువుగా మారుతుంది. మందార ఆకుల్ని ఎండ బెట్టి పొడిగా చేసి ఆ పొడిలో పెరుగు చందనం కలిపి ముఖానికి మెడకి ప్యాక్ వేసుకోవాలి. కాసేపయ్యాక కడిగేస్తే చర్మం కాంతివంతంగా మారిపోతుంది. ఈ పూల ప్యాక్ లు పార్లర్ వేసిన ఫేస్ ప్యాక్ ల కంటే బాగా పని చేస్తాయి.

    మల్లెల ప్యాక్ తో మోహంలో కాంతి

    ఇది మల్లెల మాసం. ఎండల్లో దొరికే అద్భుతమైన పూలు ఇవి ఈ సువాసనల మల్లెలలో సౌందర్య పోషణ చాలా ఈజీ, ఇలాంటి సైడ్ ఎఫెక్ట్ లు రావు…

  • ముఖం కాంతిగా తాజాగా అనిపించాలంటే వంటింటి టిప్స్ వందల కొద్దీ ఉంటాయి. తవ్వితే ఊరే చాల మల్లాగా. ఇవి తరాల నుంచి వస్తున్నా సౌందర్య సాధనాలు. పాల మీగడ నారింజ రసం సెనగపిండి కలిపి మంచి ఫేస్ ప్యాక్. యాపిల్ ముక్కలు గుజ్జు పాల పొడి ఇంకో నాలుగు చెంచాల పాలు ఇంకో మంచి కాంబినేషన్. మూడు చెంచాల పెసర పిండి పసుపు పాలు కలిపితే చర్మ సంబంధిత ఇన్ఫెక్షన్లను కూడా పోగొట్టే మంచిపూత అవుతుంది. నిమ్మరసం తేనె కలిపి మొహానికి రాసి కీరా ముక్కలు మృదువుగా మసాజ్ లాగా రుద్దితే చర్మం మృదువుగా కోమలంగా తయారవుతుంది. ఇప్పుడంటే ఖరీదైన కాస్మెటిక్స్ వచ్చాయి. మరి పురాతన కాలంలో అందంకోసం ఇవే పద్ధతులు. ఏ సైడ్ ఎఫెక్ట్స్ లీని చక్కని ప్యాక్ లు.

    ఒకప్పటి సౌందర్య సాధనాలు ఇవే

    ముఖం కాంతిగా తాజాగా అనిపించాలంటే వంటింటి టిప్స్ వందల కొద్దీ ఉంటాయి. తవ్వితే ఊరే  చాల మల్లాగా. ఇవి తరాల నుంచి వస్తున్నా సౌందర్య సాధనాలు. పాల…