శివాని పాలివాల్ భారతీయ డాన్సర్, గాయని.అంతర్జాతీయ నౌ యునైటెడ్ గ్రూప్ కు భారతదేశం తరఫునుంచి ఎంపికైన ఏకైక సభ్యురాలు.2002లో రాజస్థాన్లోని ఉదయపూర్ లో పుట్టింది శివాని.ఆ రోజుల్లో పాట డాన్సులని కెరీర్ గా తీసుకునేవారు కాదు అయినా చిన్నతనం నుంచి డాన్స్ మీద ఆసక్తి పొంది శిక్షణ తీసుకుని ఎన్నో పోటీల్లో పాల్గొన్నది శివాని చివరకు గ్లోబల్ పాప్ బ్రాండ్ నౌ యునైటెడ్ కి ఎంపికయ్యింది.తన డాన్స్ తో అంతర్జాతీయ అభిమానులను సంపాదించుకున్నది శివాని.పాప్ బృందంతో ప్రపంచ దేశాలన్నీ పర్యటించి లైవ్ కాన్వర్టులు చేసింది.2003లో ఈ బృందం నుంచి బయటకు వచ్చేసి 17 కు పైగా అంతర్జాతీయ ఆర్టిస్టులతో కలిసి మ్యూజిక్ వీడియోలు చేసింది. ఇప్పటికీ కొన్ని చిత్రాల్లో నటించిన శివాని ఈ సంవత్సరం ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ జాంబీస్ సినిమా తో ప్రేక్షకుల ముందుకు వచ్చింది.













