Saturday, 25 Jul, 2026

చెత్త నుంచి విముక్తి

ముంబై మహిళ మనా షా వినూత్నమైన ఆలోచన తో ముంబైలోని చెత్త సమస్యకు ఒక పరిష్కారం చూపించింది. ఏ వీధిలో చూసినా కుప్పలుగా పేరుకుపోయిన చెత్త ఆమెను బాధపెట్టింది. 2010 గ్రీన్ ప్రాక్టీసెస్ అనే సంస్థను ప్రారంభించి వివిధ కాలనీలోని చెత్తను సేకరించి కంపోస్టు తయారీకి రూపకల్పన చేసింది. కొన్ని వందల మందికి ఈ పనితో ఉపాధి దొరికింది. కాలనీలు, హౌసింగ్ సొసైటీల నుంచి చెత్తను సేకరించినందుకు ఇంటికి 100 రూపాయలు చార్జీ చేసిందీ సంస్థ.సేకరించిన చెత్తతో […]

అవమానాలే స్ఫూర్తి

చెన్నై కు చెందిన కృష్ణ జయశంకర్ యు.ఎస్.ఎ లో జరిగిన మౌంట్ వెస్ట్ ఇండోర్ ట్రాక్ అండ్ ఫీల్డ్ ఛాంపియన్ షిప్ లో కాంస్యం గెలుచుకొని నేషనల్ రికార్డ్ నెలకొల్పింది. ఆమె తండ్రి బాస్కెట్ బాల్ క్రీడాకారుడు తండ్రి పోలికలు శరీర సౌష్టవం ఆమెకు వచ్చింది దానితో బాగా ఎత్తు లావుగా ఉండేది. అస్తమానం ఆమెను అమ్మాయిల లేవు అని తోటి వాళ్లు వేధించేవాళ్లు ఇదంతా తన ఆరోగ్యం పైన ప్రభావం చూపెడుతోందని గ్రహించిన కృష్ణ తండ్రి […]

అతి పెద్ద ఘూమర్ నృత్యం

గుజరాత్ లోని సూరత్ లో 11 వేల మంది మహిళలు ఒకేసారి డాన్స్ చేసి గిన్నిస్ రికార్డు నెలకొల్పారు. రాజస్థాన్ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా ఇన్ని వేలమంది సంప్రదాయ దుస్తులు ధరించి ఘూమర్ నృత్యం ప్రదర్శించారు. సామూహిక ఘూమర్ నృత్యం చేయడం కూడా ఇదే తొలిసారి ఈ సాంప్రదాయ నృత్యం ఈ గిన్నిస్ రికార్డ్ తో చరిత్రలో శాశ్వతంగా నిలిచిపోతుంది. రాజస్థాన్ యువ సంఘ్ సూరత్ నిర్వహించిన ఈ కార్యక్రమం అంతర్జాతీయ వేదికపై జానపద కళను ప్రోత్సహించటం […]

మొదటి గ్రామీణ బ్యాంక్

మన్ దేశీ మహిళా శక్తి  బ్యాంక్ ఏర్పాటు చేసి, గ్రామీణ మహిళల ఆర్థిక ప్రగతి కి పాటు పడిన చేతన సిన్హా 2024 సంవత్సరానికి గాను ఛేంజ్ మేకర్ అవార్డ్ తీసుకొన్నారు.ఆమె గ్రామీణ మహిళల తో బ్యాంకు నెలకొల్పుతానని 1981 లో ఆర్బీఐ ని సంప్రదిస్తే బృంద సభ్యులు నిరక్ష్యరాస్యులని బ్యాంక్ తిరస్కరించింది.అయిదే నెలల్లో వారిని అక్షరాస్యులుగా మర్చి తిరిగి అధికారుల దగ్గరకు తీసుకుపోయారు చేతన సిన్హా.దానితో అనుమతి లభించింది .దానితో పూణే కేంద్రంగా దేశం లో […]

అతి బలశాలి

ఉత్తర ప్రదేశ్ కు బుధానా గ్రామానికి చెందిన పూజ తోమార్ యు ఎఫ్ సి ఫైట్ గెలిచిన తొలి భారతీయురాలిగా చరిత్ర సృష్టించింది.కరాటే తో పాటు మిక్స్డ్ మార్షల్ ఆర్ట్ కూడా (M.M.A) నేర్చుకుంది పూజతోమార్. మెరుపు వేగంతో ప్రత్యర్థులను మట్టి కల్పించగల నేర్పు సాధించింది. బ్రెజిల్ కు చెందిన రయాన్ అమాండా ను ఓడించి అల్టిమేట్ ఫైట్ ఛాంపియన్ షిప్ (U.F.C) లో విజయం సాధించి ఆ ఫైట్ గెలిచిన తొలి భారతీయురాలిగా గుర్తింపు పొందింది.

బొమ్మలతో ఉపాధి

వీణ పీటర్ నాణ్యమైన మెత్తని బట్టతో తయారు చేసే బొమ్మలు పర్యావరణహితం. తారాస్ డాల్ హౌస్ పేరుతో ఈ సంస్థ లో ఎంతోమంది మహిళలు పనిచేస్తారు. కోటి రూపాయల టర్నోవర్ తో సాగే ఈ సంస్థ లో తయారు చేసే బొమ్మలను ప్లాస్టిక్ హానికరమైన రసాయన రంగులు ఉపయోగించరు. పిల్లలు ఎంత కాలం ఆడుకున్నా బొమ్మలు మన్నికగా ఉంటాయి. టైలరింగ్, బొమ్మల తయారీ విభాగం మార్కెటింగ్ మొత్తం మహిళలే చూస్తారు. వీణ పీటర్ బెంగళూరు లో ఉంటారు […]

ఏడాది కష్టపడితేనే ఫలితం

ఏ పనైనా 21 రోజుల పాటు చేస్తే అది అలవాటు అయిపోతుందని చెబుతుంటారు కానీ అందులో నిజం లేదంటారు యూనివర్సిటీ ఆఫ్ ఆస్ట్రేలియా పరిశోధకులు టైప్- 2 డయాబెటిస్ గుండె జబ్బులు ఎక్కువ అవుతున్న నేపథ్యంలో మంచి అలవాట్ల తో జీవన శైలిలో మార్పు చేసుకోవాలని డాక్టర్స్ చెపుతారు. ఈ నేపథ్యంలో కొత్త అలవాటు నేర్చుకునేందుకు ఎన్ని రోజులు పడుతుంది అన్న విషయం పైన పరిశోధన చేస్తే ఒక మంచి అలవాటు చేసుకునేందుకు కనీసం ఒక సంవత్సరం […]

వ్యర్థాలతో ఆదాయం

అరటి వ్యర్థాలను ఆదాయ మార్గం గా మార్చి చూపించి వెయ్యికి పైగా రైతు కుటుంబాలకు ఆర్థిక సుస్థిరతకు దోహదం చేశారు అనసూయ జెనా ఒడిశా రాష్ట్రం ఖుర్దా జిల్లా లోని బాలిపట్న లో అరటి పంట ప్రధానమైన సాగు రైతులకు జీవార్థమైన ఈ పంట అరటి గెలలు కొట్టేశాక మిగిలిపోయిన అరటి బెరడు రైతులకు గ్రామానికి సమస్యగా ఉండేవి అరటి బెరడు వీధుల్లో కుళ్ళిపోతూ దుర్వాసన వచ్చేవి.ఈ సమస్యకు పరిష్కారం చూపించారు అనసూయ జెన్ దంపతులు.2021 లో […]

గుస్సాడీ నృత్యం పై పుస్తకం

గుస్సాడీ సెలబ్రేషన్ ఆఫ్ బియాంగ్ గాడ్ పుస్తకాన్ని రాసింది హైదరాబాద్ కు చెందిన జెన్నిఫర్ ఆల్ఫోన్స్ ప్రాచీన గిరిజన తెగకు చెందిన గోండులు జరుపుకునే నాగోబా జాతర గుస్సాడీ నృత్యం వారి ఆచార వ్యవహారాలు అన్ని రెండేళ్ల పాటు కష్టపడి, ఆ గిరిజనుల అభిమానం సంపాదించి పుస్తకం రాసింది జెన్నిఫర్. ఆదిలాబాద్ అడవుల్లో నెలల తరబడి ఉండి నాగోబా జాతర పై డాక్యుమెంటరీ తీసింది. ఈ డాక్యుమెంటరీకి మెక్సికో లో జరిగిన కోల్ ఇండీ జీనియస్ ఇంటర్నేషనల్ […]

కృష్ణుని కోసం రోబోటిక్ ఏనుగు

ప్రముఖ సిటారిస్ట్ అనౌష్క శంకర్ కేరళ త్రిసూర్ లోని కొంబర శ్రీకృష్ణ స్వామి ఆలయానికి ఒక రోబోటిక్ ఏనుగు ను బహుకరించారు పీపుల్ ఫర్ ది ఎథికల్ ట్రీట్‌మెంట్ ఆఫ్ యానిమల్స్ (పెటా) తో కలిసి ఈ యాంత్రిక ఏనుగును విరాళంగా ఇచ్చారు. ఇది మూడు మీటర్ల ఎత్తు 800  కిలోల బరువుతో ఉంది. ఈ రోబోటిక్ ఏనుగు వల్ల నిజమైన ఏనుగును గొలుసులతో బంధించి ఆయుధాలతో హింసించే పని ఉండదని అనౌష్క అన్నారు రబ్బర్, ఫైబర్,మెటల్,ఫోమ్,స్టీల్ […]

అంతులేని ప్రతిభ

నిరుపేద కుటుంబానికి చెందిన దులారీ దేవి బీహార్ లోని మిథిలా ప్రాంతంలో పుట్టింది. మధుబాని కళాకారిణి మహా సుందరి ఇంట్లో పనిమనిషి గా పని చేస్తూ ఆవిడ ప్రోత్సాహంతో మధుబాని పెయింటింగ్ నేర్చుకుంది. లైన్ స్కెచింగ్, రంగులు నింపడం లో ప్రత్యేక శైలికి అలవర్చుకున్నారు. సాంప్రదాయ మిథిలా కళకు మోడల్స్ థీమ్స్ ను కలిపి కొత్త డిజైన్లు సృష్టిస్తుంది. పదివేలకు పైగా చిత్రాలు వేశారు. 50కి పైగా ఎగ్జిబిషన్ లు నిర్వహించారు. 2021 లో భారత ప్రభుత్వం […]

అసామాన్యురాలు

ఐదేళ్ల వయసులో కరెంట్ షాక్ తో కాళ్లు చేతులు పోగొట్టుకున్న పాయల్ నాగ్ ను  తల్లిదండ్రులు బలంగీర్‌లోని పార్వతిగిరి బాల్నికేతన్ – అనాథాశ్రమంలో లో చేర్చారు. అక్కడ నోటితో పట్టుకొని బొమ్మలు గీసే ది కోచ్ కులదీప్ ఆమె లో టాలెంట్ గుర్తించి జమ్మూలోని అకాడమీ కి తీసుకు వచ్చాడు ప్రోస్థటిక్ కాళ్ళు పెట్టించి, ఆమెతో విలువిద్య ప్రాక్టీస్ చేయించారు. ఒక సంవత్సరంలో ఆమె విలువిద్య లో జాతీయ ఛాంపియన్ గా  నిలిచింది. ఆమె ప్రపంచంలోనే ఏకైక […]

చేతులు లేని ఛాంపియన్

అర్జున అవార్డు తో సహా ప్రపంచ పారా ఆర్చరీ ఛాంపియన్ షిప్స్ లో రజతాన్ని గత సంవత్సరం  పారాలింపిక్స్ లో కాంస్యాన్ని గెలుచుకుంది. 18 సంవత్సరాల శీతల్ దేవి కాశ్మీర్ లోని లోయిధర్ గ్రామంలో ఫోకోమెలియా అన్న వ్యాధి కారణంగా రెండు చేతులు లేకుండా పుట్టిన శీతల్ దేవి మాజీ కోచ్ కుల్ దీప్ వేద వాస్ శిక్షణ లో కళ్ళతోనే వెళ్ళు పట్టుకొని నోటిని భుజాలను సాయం తీసుకుని కేవలం 11 నెలల శిక్షణలో పార […]

మునగాకు వదలద్దు

మునగాకు తో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయంటారు డైటీషియన్ లు అయితే ఆకు ప్రతిరోజు ఆహారంలో ఉండాలంటే కొన్ని సలహాలు ఇస్తున్నారు. తులసి, అల్లం, మిరియాల టీ తయారు చేస్తున్నారనుకోండి అందులో ఒక స్పూన్ మునగాకు వేస్తే రుచి లో తేడా రాదు అలాగే స్మూధీలు, మిల్క్ షేక్ లలో పాలు  అరటి పండ్లతో పాటు ఓ స్పూన్ మునగాకు కలుపుకోవచ్చు. పరోటాలు,రోటీలు తయారు చేసేందుకు సిద్ధం చేసే పిండిలో కూడా మునగాకు పొడి కాస్త కలుపుకుంటే […]

పచ్చిమిరప ఆరోగ్యం

సమతులాహారంలో ప్రతికూర గాయకు ప్రత్యేకమైన పాత్ర ఉన్నట్లే పచ్చిమిరపకాయకు ఇంకాస్త ప్రత్యేకత ఉందంటున్నారు ఎక్స్పర్ట్స్.భోజనం లో ఒక పచ్చిమిరప కాయి శరీరాన్ని నుపుగా మారుస్తుంది.బరువు తగ్గించేందుకు ఉపయోగపడుతుంది జీర్ణాశయం ఆరోగ్యం ఉండాలంటే, పచ్చిమిరప ఉపయోగం సాధ్యమైనంత పరిమితంగా ఉండాలని, ముదురాకుపచ్చ, పండుమిరపకాయలకు బదులుగా లేత ఆకుపచ్చ రంగు కాయలు భోజనంలో,వంటలో వాడుకోవాలని అపోలో స్పెక్ట్రా సీనియర్ డైటీషియన్ ఫౌజియా అన్సారి చెబుతున్నారు.

మంచు దారిలో పోస్ట్ ఉమెన్

కాశ్మీర్ లో మొట్టమొదటి పోస్ట్ ఉమెన్ ఉల్ఫాతా బానో. ఆమె 30 ఏళ్లుగా మంచులో నడుస్తూ ఉత్తరాలు నడుస్తోంది. మంచు తుఫాన్ లు, కాశ్మీర్ ప్రాంతం కావడం వల్ల కాల్పుల భయం కూడా ఉంటుంది కానీ ఉల్ఫాతా మాత్రం ఎప్పుడు డ్యూటీని అలక్ష్యం చేయలేదు.ప్రతిరోజు కనీసం 20,30 పార్సల్స్ ఉత్తరాలు ఉంటాయి.ఆమె జీతం నెలకు 22 వేలు.ఎంతో అవసరం అయితే తప్ప ఎప్పుడూ సెలవు పెట్టలేదు అంటుంది ఈ పోస్ట్ ఉమెన్ ఉల్ఫాతా బానో.

ఒత్తిడికి ఔషధం నృత్యం

సంగీతానికి అనుగుణంగా చేసే నృత్యాభినయం మనసులో భయం, అలసట, ఆందోళన వంటివి తగ్గిస్తాయి అంతర్జాతీయ శాస్త్రవేత్తల బృందం తాజాగా తేల్చారు. నృత్య ప్రభావం ఎలా ఉంటుందో చూసేందుకు చేపట్టిన పరిశోధనలు నృత్యకారుల్లో గుండె స్పందన రక్తపోటు అదుపులో ఉంటుందని శరీరంలోని సహజ సిద్ధమైన ఒత్తిడి ఉపశమన యంత్రణాన్ని  సమర్థవంతంగా ఉపయోగించేందుకు నృత్యం అద్భుతమైన సాధనంగా గుర్తించారు.నృత్యం మెదడును ఉత్సాహపరిచే వ్యాయామం అంటున్న శాస్త్రజ్ఞులు.

విద్యా దానానికి పురస్కారం

గాయత్రీ చక్రవర్తి స్పివాక్ నోబెల్ తో సమానమైన హోల్బర్గ్ ప్రైజ్ అందుకున్నారు కోల్ కతాకు చెందిన 82 ఏళ్ల గాయత్రి ప్రముఖ సాహితీ విమర్శకురాలు కార్నెల్ విశ్వవిద్యాలయంలో పి హెచ్ డి చేశారు. కొలంబియా విశ్వవిద్యాలయంలో మానవీయ శాస్త్రాలలో ప్రొఫెసర్ గా పని చేస్తున్నారు. ఈమె పరిశోధనలు 20 పైగా ఇతర భాషల్లోకి అనువదించారు. 1986 నుంచి పశ్చిమ బెంగాల్, బీహార్, జార్ఖండ్ సరిహద్దుల్లో నిరక్షరాస్యులకు ఉచిత విద్య అందించారు గాయత్రి. గ్రామీణ పేద ప్రజలకు ఉచిత […]

అడవికి రక్ష

జమున టుడు ను లేడీ టార్జాన్ ఇండియా గా పిలుస్తారు. ఒరిస్సా లోని రాయి రంగాపూర్ లో పుట్టిన జమున పెళ్లయ్యాక జార్ఖండ్ లోని మాతుకం కు వచ్చింది. ఆ ఊరు చుట్టూ పచ్చని అడవిని స్మగ్లర్లు నరికి వేయడం గమనించిందామె. అడవిని కాపాడుకోవడం కోసం వన సురక్ష సమితి ని ఏర్పాటు చేసింది. కేవలం ఐదుగురు మహిళలతో మొదలైన ఈ సమితి లో ఇప్పుడు పదివేల మంది మహిళలు ఉన్నారు. వీరంతా కలిసి 50 హెక్టార్ల […]

ముత్యాలే అందం

ఫ్యాషన్ ఎన్ని మారినా ఎప్పటికీ వన్నె తరగని ట్రెండ్ ముత్యాల నగలదే. ఆఫీస్ దుస్తులకు కూడా సింపుల్ గా ఉండే,పెద్దగా మెరుపులు ఉండని ముత్యాల నగలు అందాన్ని ఇస్తాయి. ఇవి డార్క్ షేడ్స్ దుస్తుల పైన కూడా చక్కగా ఉంటాయి. అయితే ఒక్కటే విషయం వీటిని వేరే ఇతర ఆభరణాలలో స్టైలింగ్ చేస్తే అందం పోతుంది. అన్ని రకాల ఆభరణాలు ముత్యాలవే అయి ఉండాలి. గాజులు,చోకర్లు కూడా మొత్తం ముత్యాలతో డిజైన్ చేస్తున్నారు.