మహిళల చెస్ వరల్డ్ కప్ గెలిచి గ్రాండ్ మాస్టర్ హోదా సాధించింది 19 ఏళ్ల దివ్య దేశ్ముఖ్ వైద్య కళాశాల ప్రొఫెసర్ జితేంద్ర ఆమె తండ్రి తొలి కోచ్ ఆయనే. తర్వాత సుప్ర సిద్ధ కోచ్ రాహుల్ జోషి దగ్గర చదరంగం ఎత్తులు నేర్చుకుంది 2023 నాటికి ఇంటర్నేషనల్ మాస్టర్ హోదా సాధించింది. ఆ ఏడాది ఆసియా ఉమెన్ ఛాంపియన్ షిప్ లో కోనేరు హంపి ని ఓడించింది. 2024 లో వాల్డ్ జూనియర్ గర్ల్స్ ఛాంపియన్ టైటిల్ గెలుచుకుంది.ఇప్పుడు దేశమంతా ఆమె పేరు మారుమోగుతోంది.













