పులుల సంరక్షణకు సంబంధించిన డాక్యుమెంటరీ చేసినందుకుగాను లతికా నాథ్ కు జియో గ్రాఫికల్ మ్యాగజైన్ నిర్వాహకులు టైగర్ ప్రిన్సెస్ అని బిరుదు ఇచ్చారు. మన దేశంలో పులుల సంరక్షణ మేనేజ్మెంట్ పై పరిశోధన చేసిన తొలి భారతీయురాలిగా గుర్తింపు తెచ్చుకున్నది లతిక. ఆమె వైల్డ్ లైఫ్ జియాలజిస్ట్ ఫోటోగ్రాఫర్ అడవులలో పులులు, ఇతర జంతు జాలాలు ఫోటోలు తీసుకున్న లతిక వాటిని హిడెన్ ఇండియా పుస్తకంగా పాఠకులకు చూపించింది. పిల్లల కోసం ఆమె రాసిన తక్దిర్ ది టైగర్ క్లబ్ ఎంతో ప్రాచుర్యం పొందింది. ప్రపంచవ్యాప్తంగా 20 భాషల్లోకి అనువాదం అయింది మనుషుల మనుగడ జంతువుల మనుగడ తో ముడిపడి ఉంటుంది అంటుంది లతికా నాథ్.













