కేరళ రాష్ట్ర రాజధాని తిరువనంతపురం లో మహిళల కోసం ప్రత్యేకంగా అట్టుకల్ భగవతి దేవాలయం ఉంది. కేరళ తమిళనాడు రాష్ట్ర శిల్పాలు అందంగా తీర్చిదిద్దిన గుడి గోపురం ఆలయంలో ఆభరణాలతో అలంకరించిన దేవతా విగ్రహం వెనుక మరొక విగ్రహం తో ఈ ఆలయం ప్రశాంతతకు నిలయం. కణ్ణిగి అమ్మవారి అవతారంగా భావించి మహిళలు భక్తితో పూజిస్తారు. ప్రతి ఏటా మార్చి నెలలో పది రోజుల పాటు జరిగే అట్టుకల్ పొంగల్ ఉత్సవం దేశవ్యాప్తంగా లక్షలాది మంది మహిళలు ఇక్కడికి వస్తారు దైవత్వాన్ని గౌరవిస్తూ మహిళలకు మాత్రమే ఆలయ ప్రవేశం ఉంటుంది. 2009లో ఈ అట్టుకల్ పొంగల్ వేడుక గిన్నిస్ రికార్డ్ లలోకి ఎక్కింది.













