నీటి పైన దేవతలు

నీటి పైన దేవతలు

నీటి పైన దేవతలు

అందమైన రంగులతో నీళ్లపైనే దేవతా రూపాలు సృష్టిస్తుంది సమ్మెట రేవతి. ఇప్పటివరకు వందకు పైగా కళారూపాలు సృష్టించారు. హైదరాబాద్ లో ఉండే రేవతి క్లాసికల్ డాన్సర్ సినిమా నటి కూడా. ఈ ఫ్లోటింగ్ ఆర్ట్ లో ఎక్కువమంది కళాకారులు లేరు కూడా. రంగోలి కోసం నీళ్లు నింపే పళ్ళెం, ముగ్గు నింపుకొనే భరిణెలు పూజ సామాగ్రి లాగే భావిస్తుంది రేవతి. తాను వేసిన బొమ్మలు యూట్యూబ్ లో అప్ లోడ్ చేస్తే వేల మంది  సబ్ స్క్రైబర్స్ వాటిని ఆదరించారు నీటి పైన ముగ్గులతో దేవతా మూర్తులకు ప్రాణం పోసే ఒక ప్రత్యేకమైన కళాకారిణి రేవతి.