1939 లో క్రౌన్ రిప్రజెంటేటివ్స్ పోలీస్ గా ఏర్పడి ఆ తర్వాత 1949 నుంచి సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ గా సేవలు అందిస్తున్న సి ఆర్ పి ఎఫ్ లో ఇప్పటివరకు ఓకే మహిళ అశోక్ చక్ర అవార్డ్ పొందింది. ఆమె పేరు కమలేష్ కుమారి. ఉత్తర ప్రదేశ్ లోని కన్నౌజ్ కి చెందిన కమలేష్ కుమారి పార్లమెంట్ సమావేశాల్లో ఉమెన్ బెటాలియన్ లో సెక్యూరిటీ విధులు నిర్వహించేది ఢిల్లీలో పార్లమెంట్ పైన 2001, డిసెంబర్ మూడవ తేదీన ఉగ్రవాది ఉగ్రదాడి జరిగినప్పుడు రక్షణ దళంలో ఉన్న కమలేష్ కుమారి ఉగ్రవాదులను అడ్డుకున్నది. ఆమెకు 11 బుల్లెట్లు తగిలాయి. ఆనాటి దాడిలో అమరులైన 9 మంది జవాన్ లలో కమలేష్ ఒకరే మహిళా 2002లో ఆమెకు అశోక్ చక్ర ప్రకటించారు.













