ఈ మధ్య బాల్కనీల్లో పెరిగే బ్రహ్మ కమలం పువ్వులు సోషల్ మీడియాలో చూస్తూ ఉంటాం. కానీ ఈ బాల్కనీల్లో పెరిగే బ్రహ్మ కమలం పురాణాల్లో పేర్కొన్నది కాదు కాక్టస్ కుటుంబానికి చెందిన ఈ మొక్కని ఆర్కిడ్ క్లైమ్బింగ్ కాక్టస్ అంటారు. పవిత్రమైనదిగా చెప్పే బ్రహ్మకమలం హిమాలయ పర్వతాల్లో 3000, 4,500 మీటర్ల ఎత్తు లో పెరుగుతుంది. కేదార్నాథ్ హేమకుండ్ సాహిబ్, తుంగనాద్, వ్యాలీ ఆఫ్ ఫ్లవర్స్ ప్రాంతాల్లో కనిపిస్తుంది. తెల్లని తామర వంటి ఈ దివ్య కమలాన్ని ఉత్తరాఖండ్ జాతీయ పుష్పం ఈ పువ్వు ఈ పువ్వు జులై సెప్టెంబర్ మధ్యలో పూస్తుంది. శాస్త్రీయ నామం సౌసురియా అబ్వల్లాట ఏ తెల్లవారుజామునో వికసించి, రేకులు ఊడిపోతాయి. విరిసే సమయంలో ఈ పువ్వు చూడటం అదృష్టం అంటారు పురాణాల ప్రకారం చెప్పే బ్రహ్మకమలం ఇదే.













