Chinna Maata
సెల్ఫ్ మేడ్ ఉమెన్ జయశ్రీ
జయశ్రీ ఉల్లాల్ భారతీయ సంపన్న ప్రొఫెషనల్ మేనేజర్ల జాబితాలో అగ్రస్థానంలో ఉన్నారు శాంటా క్లారా యూనివర్సిటీ లో మాస్టర్స్ చేసిన జయశ్రీ 2008లో ఆర్టిస్టా నెట్ వర్క్ సి ఈ ఓ గా ప్రెసిడెంట్ గా నియమితులయ్యారు అప్పుడు చిన్న కంపెనీ గా ఉన్న ఆర్టిస్టా ను 2014లో న్యూయార్క్ స్టాక్ ఎక్స్చేంజిలో ఐపిఒ కు తీసుకు వెళ్ళగలిగారు. తాజాగా హరూన్ ఇండియా రిచ్ లిస్ట్ ప్రకారం జయశ్రీ ఉల్లాల్ నికర విలువ 50,170 కోట్లు దీనితోపాటు […]
డైరెక్టర్ గా దియా
స్టార్ కపుల్ సూర్య,జ్యోతిక ల కూతురు దివ్య సినిమాల్లోకి దర్శకురాలిగా అడుగుపెట్టింది.17 ఏళ్ల దివ్య తీసిన లీడింగ్ లైట్ అన్న డాక్యుమెంటరీ లాస్ట్ ఏంజెల్స్ లోని రెజెన్సీ థియేటర్ లో ఆస్కార్ క్వాలిఫైయింగ్ రన్ లో భాగంగా ప్రదర్శితమవుతోంది.ఈ స్టార్ ఫిల్మ్ లో, దియా ఈ కాలపు స్త్రీలు ఎదుర్కొనే సవాళ్లు మానసిక శారీరక వత్తిళ్లు,వాటిని పట్టుదలగా దాటుతున్నారు ఒక డ్రామా లాగా తీసింది. ఈ కథను ప్రతిభావంతంగా దియా చెప్పిన తీరు ప్రేక్షకుల ప్రశంసలు అందుకుంది.
అందాల జందానీ
ఏదైనా వెరైటీ గా ఉన్న చీర ధరించాలి అనుకుంటే జందానీ ఢకాయి చీరె కొనచ్చు.ఢాకా నగరంలో తయారుచేస్తారు కనుక ఢకాయి చీర అన్నారు. బెంగాలీ చేనేత పనితనం తో ఈ చీరలు చాలా అందంగా ఉన్నాయి. జందానీ చీరల్లో పెద్ద బార్డర్, పద్మం, చేప,దీపం వంటివి ఈ చీరల పైన డిజైన్ చేస్తారు. బుటిదార్, చిన్న పువ్వులు కర్కానా పేరుతో ఈ చీరల పైన మోటిప్స్ వేస్తారు.తేలికపాటి ఆభరణాలు, ఆక్సిడైజ్డ్ సిల్వర్ జ్యువెలరీ ఈ చీరలకు మంచి […]
ఇవి ప్రత్యేకమైన దుస్తులు
కండరాల బలహీనత గలవారికి వృద్ధులకు సులువుగా ధరించగలిగే వినూత డిజైన్లు రూపొందించారు సౌమితా బసు. పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్‌కతా మహా నగరానికి చెందిన సౌమిత కండరాల బలహీనత తో బాధపడేది వీల్ చైర్ లో జీవితం గడపడం తప్పదని తెలిశాక తన వంటి వైకల్యం గల వారి కోసం తల్లి అమిత తో కలిసి దుస్తులు తయారు చేసింది. మ్యాగ్నెటిక్ వెల్ క్రో క్లోజర్స్, నో బౌండ్ ట్రౌజర్లు వంటివి కస్టమర్లు కోరిక విధంగా వారి […]
తిరుగులేని నాయకురాలు
జార్జియా మెలోని ఇటలీ తొలి మహిళా ప్రధాని. ఆమె ఆత్మకథ.’ఐయామ్ జార్జియా-మై రూట్స్ అండ్ ప్రిన్సిపుల్స్ అన్న ఇండియన్ ఎడిషన్ కు ప్రధాని నరేంద్ర మోడీ ముందుమాట రాశారు.రోమ్ లో పుట్టి గర్బ్ బెల్లా జిల్లాలో పెరిగింది మెలోని. పొలిటికల్ పార్టీ ఇటాలియన్ సోషల్ మూమెంట్ (M.S.I) యువ విభాగం యూత్ ఫ్రంట్ లో చేరడం తో మెలోని రాజకీయ ప్రస్తావం ప్రారంభమైంది. ఆ తర్వాత కాలంలో స్టూడెంట్ మూమెంట్ నేషనల్ లీడర్ గా ఎదిగింది.ప్రావిన్స్ ఆఫ్ […]
మట్టితో కళారూపం
చైనీస్ జానపద సాహిత్యం లోని ప్రకృతి స్త్రీ పాత్రలు, జంతువుల కళాఖండాలు చూడాలి అనుకుంటే Yuan Xiang Liong (వియాన్ జింగ్ లియాంగ్) ఆర్ట్ గ్యాలరీ ఆన్ లైన్ లో చూస్తే చాలు మట్టితో రంగులు, ఆర్కిటెక్చర్ కలగలిపి త్రీ డైమెన్షన్ తో అద్భుతమైన కళాత్మక వస్తువులను జింగ్ లియాంగ్ సృష్టించాడు. ఆయన చేసిన జానపద కళారూపాల్లో కళ్ళు మూసుకున్న ఒక స్త్రీ కనిపిస్తుంది. ఆ బొమ్మ చుట్టూ జానపద సాహిత్యం లో వచ్చే డ్రాగన్ తోకలు […]
భారత యువతకు స్ఫూర్తి
స్టాన్‌ఫర్డ్ యూనివర్సిటీ ,ఎల్స్వియర్ సంయుక్తంగా వెలువరించిన అత్యంత ప్రతిభావంతులైన సైంటిస్ట్ ల జాబితాలో సంధ్య షెనాయ్ కు మూడవ సారి స్థానం దక్కింది. సైన్స్ రంగంలో రాణించాలనుకునే భారత యువతకు స్ఫూర్తి సంధ్య షెనాయ్ మంగళూరు శ్రీనివాస యూనివర్సిటీ లో ప్రొఫెసర్ గా ప్రిన్సిపల్ రీసెర్చ్ అసిస్టెంట్ గా పనిచేస్తున్న సంధ్య షెనాయ్ కర్మ గారాల ఇతర యంత్ర పరికరాలు వల్ల వాడే వేస్ట్ హీట్ ను విద్యుత్ గా మార్చే పరిశోధనలు చేస్తున్నారు. అందుకే ఆమెకు […]
నిద్ర కో చిట్కా
హాయిగా నిద్ర పట్టాలి అంటే ఈ చిట్కాలు పాటించండి అంటున్నారు ఎక్సపర్ట్స్. శారీరక మానసిక ఆరోగ్యానికి నిద్ర అత్యవసరం పని ఒత్తిడి,ఆరోగ్య సమస్యలు,ఆందోళన వల్ల నిద్ర సరిగ్గా పట్టకపోవచ్చు. రాత్రివేళ గ్లాసు గోరువెచ్చని పాలలో జాజికాయ పొడి లేదా అశ్వగంధ చూర్ణం ఒక చిటికెడు వేసి తాగితే నాడీ వ్యవస్థ నెమ్మదించి నిద్ర పట్టేస్తుంది. చామంతి, తులసి వంటి హెర్బల్ టీ లు కూడా నిద్రకు సహకరిస్తాయి. రాత్రి భోజనంలో మసాలాలు, నూనె వస్తువులు తగ్గించి తేలిగ్గా […]
జేన్ గుడాల్
టాంజానియాలో 1960 నుంచి 30 ఏళ్లకు పైగా చింపాంజీల గురించి పరిశోధన చేసిన జేన్ గుడాల్ 91 సంవత్సరాల వయసులో అక్టోబర్ 1వ తేదీన కన్నుమూశారు.ఆమె ఎందరో పర్యావరణ ప్రియులకు స్ఫూర్తి గోంబే స్ట్రీమ్ నేషనల్ పార్క్‌లోని కసకేలా చింపాంజీ కమ్యూనిటీ తో మొదలుపెట్టి చింపాంజీల కుటుంబ జీవితాన్ని అధ్యయనం చేశారామె 1990 లో ‘త్రూ ఎ విండో మై థర్టీ ఇయర్స్ విత్ ది చింపాంజీస్ ఆమె గొంబే బుక్ లో ఆమె అనుభవాలను రాశారు. […]
తొలి ఎఐ హీరోయిన్
లండన్ లోని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కంపెనీ పార్టికల్-6 డిజిటల్లీ స్టార్ ‘టిల్లీ నార్వుడ్’ ను సృష్టించింది ఆమె ఎంత బాగా నటించగలదో వీడియోలు రూపొందించారు. ఈమె హాలీవుడ్ లో నటించనున్న తొలి ఎఐ జనరేటెడ్ నటి కావచ్చు.ఈమె ఎందరో అందగత్తెల నుంచి ముఖాలను రెఫెరెన్స్ గా తీసుకొని తయారు చేశారు. ఈమెను తయారు చేసిన కంపెనీ యంత్రం మా యానిమేషన్ తోలుబొమ్మల లో నుంచి స్ఫూర్తి పొంది తీసుకున్నదే కొత్త క్యారెక్టర్లు పుడతాయి కానీ మనిషి సహజ […]
తల్లికి తగ్గ నటి
తల్లికి తగిన వారసురాలు కాదని నేపో కిడ్ అని నెట్ లో ఎన్నో కామెంట్లు ఎదుర్కొంది జాన్వీ కపూర్ దివంగత నటి శ్రీదేవి కూతురు గానే సినీ రంగంలోకి అడుగుపెట్టిన జాన్వి గ్లామర్ పాత్రలు చేయాలన్న నియమం పెట్టుకోలేదు ఓటిటి,మల్టీస్టారర్,కామెడీ,బయోపిక్ వంటి అన్నిచోట్ల తనకు వచ్చిన అవకాశాలను భద్రంగా అందుకున్నది గుంజన్ సక్సేనా, ది కార్గిల్ గర్ల్, మిస్టర్ అండ్ మిసెస్ మహి, సినిమాల్లో ఎన్నో ప్రయోగాత్మక పాత్రలు సమర్థవంతంగా నటించి చూపించి తనను తాను నిరూపించుకుంది. […]
ఆటిజం పిల్లలకు శిక్షణ
2021 లో ఎ డి హెచ్ డి, ఆటిజం ఉన్న పిల్లల కోసం భారత్ దుబాయ్ అమెరికాల్లో ‘పరిక్రమ ఒకేషనల్ ఇన్‌స్టిట్యూట్ స్థాపించారు డాక్టర్ గాయత్రి నరసింహాన్ ఆమె సాఫ్ట్‌వేర్ ఇంజనీర్. టీచింగ్ రంగంలో ప్రయోగాత్మక మార్పులు తీసుకువచ్చారు.ఆటిజం ఉన్న పిల్లల కోసం 22 స్కిల్ ఆధారిత కోర్స్ నేర్పిస్తున్నారు.టీచర్లు పిల్లల తల్లిదండ్రులు సంరక్షకులకు స్పెషల్ పిల్లలతో ఎలా వ్యవహరించాలో నేర్పిస్తారు గాయత్రి. ఆమె కృషి అంతర్జాతీయ స్థాయిలో ఎంతో మంది టీచర్లు కు మార్గదర్శకంగా ఉంది.
పావురాళ్లతో జాగ్రత్త
పావురాళ్లు నగర జీవితంలో ఒక భాగం బాల్కనీ లు,ఎయిర్ కండిషనర్ యూనిట్ల దగ్గర గూళ్ళు కట్టుకొనే ఈ పావురాళ్ళ విసర్జకాలతో అనేక అనారోగ్యాలు వస్తాయని డాక్టర్లు హెచ్చరిస్తున్నారు. పావురాళ్లు బాల్కనీలో గుళ్ళు పెట్టకుండా ఒకటి రెండు అద్దాలు గోడకు బిగిస్తే అలా ప్రతిఫలించే వస్తువుల జోలికి పావురాలు రావంటున్నారు. అలాగే తలుక్కున మెరిసే పాత సీడీలు కూడా వేలాడదీయచ్చు. ఘాటు వాసన వచ్చే లవంగ నూనె పుదీనా తో తయారు చేసిన స్ప్రే లు కూడా పావురాలను […]
ఆమె మొదటి ట్రైన్ డ్రైవర్
ఆసియా ఫస్ట్ ఉమెన్ డ్రైవర్ గా చరిత్ర సృష్టించింది సురేఖ యాదవ్. మహారాష్ట్రలోని సతారా లో పుట్టి పెరిగిన సురేఖ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ చదివింది. రైల్వే డిపార్ట్మెంట్ లో పనిచేసే అవకాశం వచ్చాక ట్రైనీ అసిస్టెంట్ డ్రైవర్ గా జాయిన్ అయింది. దక్కన్ క్వీన్ డైలీ ప్యాసింజర్ ట్రైన్ నడిపిన తొలి మహిళగా గుర్తింపు పొందింది సురేఖ. రైలు కోసం రెండు ఇంజన్ల ప్యాసింజర్ ట్రైన్ నడిపే శిక్షణ తీసుకోంది తర్వాత ఎక్స్ప్రెస్ మెయిల్ డ్రైవర్ గా […]
స్నేక్ ఉమన్
మహారాష్ట్ర కు చెందిన 50 ఏళ్ల వనితా బొరాడే 60 వేలకు పైగా సర్పాలను కాపాడి స్నేక్ ఉమన్ గా ప్రఖ్యాతి పొందారు ఆమెకు నారీ శక్తి పురస్కారం పేరిట పోస్టల్ స్టాంప్ గిన్నిస్ బుక్‌లో ఆమెకు శాశ్వతమైన పేరు ఉన్నాయి ఆమె పుట్టి పెరిగింది మహారాష్ట్రలోని నయ్‌గ్రామ్ దేశ్‌ముఖ్ అనే గ్రామంలో సమీపంలోని ఘాట్ బోరి అరణ్యంలో ఎక్కువ పాములు ఉండేవి. తండ్రి సాయంతో పాములు పట్టి అడవిలో వదిలేయడం నేర్చుకున్నది వనితా బోరాడే. పాము […]
వాడి పారేయచ్చు
రియా సింఘాల్ లండన్ లో చదువుకున్నారు పర్యావరణానికి మేలు చేసే విధంగా 90 రోజుల్లో భూమిలో కలిసిపోయే వెదురుతో చేసిన టేబుల్ వేర్ ను ‘ఎకోవేర్’ పేరుతో తీసుకువచ్చారు. వెదురు తో పాటు చెరుకు పిప్పి అరెకా ఫామ్ మొక్కల భాగాల తో సింగిల్ యూజ్ కప్పులు,ప్లేట్లు, ట్రే లు కత్తిపీటలు ఇవన్నీ మొక్కల బయోమాస్ తో తయారు చేసినవి.ఎకోవేర్ ఉత్పత్తులు రిఫ్రిజిరేటర్, మైక్రోవేవ్ లో, ఓవెన్ లలో ఉపయోగించవచ్చు.ఎకోవేర్ లో ఎక్కువ మంది మహిళలే పని […]
దాండియా క్వీన్
దేవీ నవరాత్రులు వస్తే ఫాల్గుణి పాఠక్ పేరు గుర్తు తెచ్చుకుంటారు దాండియా క్వీన్ ఆఫ్ ఇండియా గా పేరు తెచ్చుకున్న ఈ 56 ఏళ్ల గాయని తన పాటలతో నృత్యాలతో పండుగ కు సంగీత శోభ తీసుకువస్తారు. స్టేజ్ షో లతో పాపులర్ అయినా ఫల్గుణి 1999 లో విడుదల చేసిన మైనే పాయల్ హై ఛంకై, పాట హిట్ అయింది. నవరాత్రి షోలలో ఈ పాటకు ఎంతో డిమాండ్ వచ్చింది. నవరాత్రుల్లో ఆమె పాటలు వినాలంటే […]
చిత్రంలో ఆమె ఒక భాగం
ఢిల్లీలోని బికనీర్ హౌస్ ‘రూట్స్ టు రివర్స్’ పేరుతో ఒక ఎగ్జిబిషన్ నిర్వహిస్తున్నారు రమణి మైలవరపు. హైదరాబాద్ కు చెందిన రమణి లండన్ లో కాంటెంపరరీ ఆర్ట్స్ లో టెక్నిక్స్ నేర్చుకున్నారు గ్రామీణుల జీవితాలను అన్నదాతల కష్టాలను పర్ఫామెన్స్ ఆర్ట్ గా మార్చారు. అంటే వేయాలనుకున్న చిత్రంలో ఆమె కూడా భాగంగా ఉంటారు. వాయిస్ ఆఫ్ వేవ్స్ తో ఉప్పాడ మత్స్యకారులు,ఇన్విజిబుల్ రూట్ లలో అరకు గిరిజనులు, “మోనాలిసా విత్ మాస్క్” పేరుతో బోడో గిరిజనుల జీవితాలు […]
కనికట్టు చేసే నగలు
సరికొత్త స్టైల్ తో కనికట్టు చేస్తూ ఉంటారు ఫ్యాషన్ జ్యువెలరీ కళాకారులు. ఇప్పుడు వాళ్లు చేసిన ఇన్విజిబుల్ చైన్ దే ఇవ్వాల్టి ట్రెండ్. గొలుసు కానీ కనిపించనంత అతి సన్నగా ఉంటుంది పెండెంట్ అద్భుతంగా మెరిసిపోతుంది. చీర పైన క్లాసిగా ఉంటుంది. అందమైన గౌన్ పైన గ్లామరస్ గా కనిపించే ఈ గొలుసు చుసేందుకు క్యూట్ లుక్ తో అదరగొట్టేస్తోంది ఈ ఇన్విజిబుల్ చెయిన్ ని చక్కని పెండెంట్ తో ధరిస్తే అసలు రుపే మారిపోతుంది.మార్కెట్ గోల్డ్, […]
శక్తి రూపాల సమ్మేళనం ఈ దేవి
మహిషాసుర మర్దిని విశ్వరూపం చూడాలనుకుంటే ఉత్తరప్రదేశ్ లోని బృందావనం వెళ్లాలి అమ్మ శక్తి రూపాలన్ని ఏకమై అవతరించిన మాత వైష్ణో దేవి. 141 అడుగుల నిలువెత్తు విగ్రహం చూడొచ్చు. అలాగే విగ్రహం కింద గుహ వంటి అమ్మ వారి మందిరంలో నవదుర్గలను చూడొచ్చు. నవరాత్రుల్లో వేలాది భక్తులు దర్శించే ఈ జగన్మాత గుడిలో పండుగ అట్టహాసంగా జరుగుతుంది.
