వంటకు వయసేం అడ్డం

వంటకు వయసేం అడ్డం

వంటకు వయసేం అడ్డం

సరస్వతి పాటి వయసు 90 ఇంటర్నెట్ లో సాంప్రదాయ వంటలు చేస్తూ వేలాది మంది అభిమానులను సంపాదించుకున్నది. కేరళ కు చెందిన ఈ పాటి రెండేళ్ల క్రితం ది అయ్యర్ పాటి ఛానల్ ను తన మనవరాలు తో కలిసి ప్రారంభించింది. ఆరోగ్యకరమైన సాంబార్,రసం, పొడులు,పచ్చళ్ల గురించి సాంప్రదాయ పద్ధతిలో ఎలా వండుకోవాలి చెబుతోంది. లక్షల మంది సబ్స్క్రైబర్స్ తో నడుస్తున్న ఈ ఛానల్ యువతరానికి ఎంతో నచ్చింది కేరళ లోని పాలకాడ లో సాంప్రదాయ ఉమ్మడి కుటుంబంలో జన్మించిన పాటి బెంగళూరులో స్థిరపడ్డారు 12 ఏళ్ల వయసు నుంచే వంట నేర్చుకున్న సరస్వతీ పాటి సాంప్రదాయ రుచులతో ఎన్నెన్నో వంటలు చేయగలరు.