మెదడు సంరక్షణ కోసం 2020లో ‘మార్బుల్స్ హెల్త్’ అన్న సంస్థ ప్రారంభించారు రమ్య ఎల్లాప్రగడ లక్షయ్ సాహ్ని తో కలిసి ఈ సంస్థ న్యూరాకిల్ హెల్త్ ప్రైవేట్ లిమిటెడ్ ఆధ్వర్యంలో పనిచేస్తుంది. శస్త్రచికిత్స లేకుండా మెదడు సంరక్షణ చేస్తారు. మందులు మానసిక చికిత్సలకు తోడ్పడే విధంగా వైద్య అనుమతి పొంది వీరు తయారు చేసిన ఈజ్ దేశంలోనే మొదటి నాడి ఉత్తేజిక పరికరం. ఇది ఆసుపత్రులలో వైద్యుల పర్యవేక్షణలో ఇళ్లలో కూడా వినియోగిస్తున్నారు. ఈ మార్బుల్ హెల్త్ మానసిక వైద్యులు ఆస్పత్రులతో కలిసి పనిచేస్తుంది. ఆరోగ్యం అంటే శరీరానికే కాదు మనసుకు కూడా అని చెబుతుంది రమ్య ఎల్లాప్రగడ.














