భారతదేశంలో సైంటిస్ట్ లకు ఇచ్చే అత్యున్నత అవార్డు లైనా జె పి బోస్ మెమోరియల్ అవార్డ్ మేఘనాథ్ సాహు అవార్డ్ అందుకున్న మహిళా శాస్త్రవేత్త సుమా వర్గీస్.1968 లో బెంగుళూరు విశ్వవిద్యాలయం నుంచి సైన్స్ డిగ్రీ అందుకొన్న సుమ ఎయిర్ బోర్న్ సిస్టమ్స్ పరిశోధన విభాగంలో దశాబ్దం పైగా పనిచేస్తూ నేత్ర అనే సిస్టం ను కనిపెట్టారు. అన్ని రకాల వాతావరణాల్లో శత్రు విమానాలను అత్యంత ముందుగా గుర్తించేందుకు ఈ నేత్ర పరికరం స్కాన్ చేసి సాయం చేసింది. 2019 లో బాలకోట్ దాడుల్లో మిలిటరీకి సాయం చేసింది నేత్ర. 2023 నాటికి స్టేట్ ఆఫ్ ది ఆర్ట్ రాడార్స్ ఎలక్ట్రానిక్ వార్ ఫేర్ సిస్టం వృద్ధి చేశారు సుమా బృందం.














