2025 లో తొలిసారిగా రాష్ట్రపతికి ఏ డి సి గా నియమితురాలైంది యశస్వి సోలంకి. రాష్ట్రపతికి వెన్నంటి నిలిచే సైనికాధికారిణి ఏ డి సి అంటారు. ఇందులో ముగ్గురు మిలటరీ, ఒకళ్ళు నేవీ, మరొకరు ఎయిర్ ఫోర్స్ కి చెందిన వాళ్లు ఉంటారు. హర్యానా కు చెందిన యశస్వి 2012లో షార్ట్ సర్వీస్ కమిషన్ కు ఎంపిక అయింది. రెండేళ్ల శిక్షణ కేరళలోని ఎజిమళ ఇండియన్ నేషనల్ అకాడమీ లో తీసుకుంది. జామ్ నగర్ లోని ఐ. ఎస్. ఎన్ వల్పురా లో ఎలక్ట్రికల్ విభాగంలో పనిచేసింది. టెక్నికల్ ఆపరేషన్ సాంకేతిక నిర్వహణ రంగాలలో బాధ్యత నిర్వహించింది. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము వెంట ఉండటమే కాక సైనిక దళాల తో అనుసంధానం బాధ్యత కూడా ఆమెదే.














