వ్యాపార కుటుంబం నేపథ్యం ఉన్న అనన్య శ్రీ బిర్లా సింగర్ గా పాటల రచయిత్రి గా ఎంటర్ ప్రెన్యూర్ గా తన ప్రత్యేక శైలిలో ముందుకు పోతూ, సక్సెస్ కు సరైన నిర్వచనం గా హరూన్ ఇండియా 2025 అండర్ 30 జాబితాలో చోటు సంపాదించుకున్నది. 17 సంవత్సరాల వయసులోనే స్వతంత్ర మైక్రోఫిన్ తో వ్యాపార రంగంలోకి అడుగు పెట్టింది అనన్య. గ్రామీణ మహిళలకు సూక్ష్మ రుణాలు అందించే సంస్థ ఇది. అలాగే అనన్య బిర్లా ఫౌండేషన్ వ్యవస్థాపకురాలైన అనన్య శ్రీ బిర్లా తల్లితో కలిసి మెంటల్ హెల్త్ ఆర్గనైజేషన్ మై పవర్ స్థాపించింది ఆదిత్య బిర్లా గ్రూప్ చైర్మన్ మంగళం బిర్లా కుమార్తె అనన్య.













