జామ పండును కొరికి తింటే మంచిది
జామ పండు యాపిల్ పండు కంటే ఎక్కువ మేలు చేస్తుందని చెపుతున్నారు ఎక్స్పర్ట్స్. క్రమం తప్పకుండా జామపండు తింటే బరువు నియంత్రణలో వుంటుంది. ఇందులో పీచు ఎక్కువ, చక్కర పాళ్ళు ఎక్కువ. ఇందులో వుండే విటమిన్ ఎ కంటి చూపు మెరుగుపరుస్తుంది. థైరాయిడ్ వంటి వ్యాధులను నియంత్రణలో ఉంచుతుంది. మెదడును చురుగ్గా ఉంచుతుంది. విటమిన్ బి6, బి3 వంటి పోషకాలు పుష్కలంగా ఉండటంతో మెదడులో న్యురాన్ల పనితీరు బావుంటుంది. రక్తం లో కొలెస్టరాల్ పాళ్ళు తగ్గిస్తుంది. అంతే […]
ఎఫ్.ఐ.ఆర్ యాప్ తో క్షేమం
ఇంట్లోంచి కాలు బయట పెడుతూ వుంటే భద్రత కోసం ఎన్నో జాగ్రత్తలు తీసుకోవలసి వస్తుంది. ఏ క్షణం ఎలాంటి ఆపద వస్తుందో తెలియదు. ఆఫీస్ నుంచి కాసేపు ఇంటికి రావడం ఆలస్యం అయితే ఇంట్లో వాళ్ళు కంగారు పడతారు. అలాగే ఏ ఆటో ఎక్కినా భద్రత విషయం భయమే. అనుకోని అవాంతరమో, ఆగంతుకుల దాడో ఎదురైతే ఏమిటి పరిస్థితి? అలాంటి సమయంలో భయపడకుండా ఫోనులో FIR అనే యాప్ వుంటే మంచిది. ఈ యాప్ ని డౌన్లోడ్ […]
ఎక్కువ కేలరీలుంటే పక్కన పెట్టాలి
పాత ఫోటోలు చూస్తూ వుంటే దిగులేస్తుంది. ఎంత సన్నగా, నాజుగ్గా, తేలిగ్గా వున్నాం అనుకుంటారు. అప్పుడిక ఏది తినలనిపించదు. బాగా డైట్ చేసి సన్నగా అయిపోవాలని తీర్మానించుకుంటారు. తీరా కళ్ళ ఎదుట ఇష్టమైన పదార్ధాలు కనిపించగానే హాయిగా తినేసి, తర్వాత తీరిగ్గా విచారించటం అందరి అనుభవంలో వచ్చేదే. అసలు శ్రద్ధగా, నిష్టగా సన్నబడి తీరాలి అని నిశ్చయించుకుంటే ముందుగా ఇష్టమైన పదార్ధాల్లో వేటిలో ఎక్కువ కేలరీలు వుంటే వాటిని తక్కువ పరిమాణంలో తీసుకోవాలి. ఉదాహరణకు బ్రెడ్ తినే […]
ఈ సీజన్ వీటితోనే గడుస్తుంది
అసలు సమ్మర్ స్పెషల్ అని మనమే ఒక రైట్ బోర్డు వేసుకోవాలి. రోజురోజుకు ఉష్ణోగ్రత పెరుగుతుంటే ఈ సీజన్ లో బాగా దొరికే మామిడి, పుచ్చ, కర్భుజా, కీరా బాగా తినాలి. తినవలసిన పదార్ధాల లిస్టు తాసుకుంటే ఏది ఎప్పుడూ ఎలా తీసుకోవాలో ఆలోచించవచ్చు. సొరకాయ మంచింది. రక్తం శుద్ధి చేస్తుంది. నిమ్మరసం, కొబ్బరినీళ్ళు, మజ్జిగ తీసుకోవాలి. పుచ్చకాయ చర్మ రక్షణకు, జీర్ణ క్రియకు సహకరిస్తుంది. పుదినా, కొత్తిమీర, నిమ్మరసం ఏదో ఒక రకంగా తీసుకోవాలి. ఇక […]
ఎప్పటికప్పుడు మార్చేయాలి
https://scamquestra.com/17-dokazatelsta-i-probely-afery-15.html
ఆ చెట్టు విత్తనాల మొక్కలే అమెరికా అంతా
ఇప్పుడు మనకి మంచి బీర తీగె వేద్దామంటే చెట్టుకి ఎండి ఒరుగైపోయిన బీరకాయ నుండి మన చేతుల్లోకి రాలే గింజలు దొరకవు. గుప్పెడు ఆకు కూర విత్తనాలు దొరకవు. విత్తనాలు పండించడం లేదన్న మాట. అవి మార్కెట్ లో దొరికే అమ్మకపు వస్తువులు. స్వయంగా ఈ సంపదనని మనం దాచుకోవాలి రాబోయే తరాల కోసం. ఇప్పుడో చిన్న విశేషం వినాలి. అమెరికాలో ఉన్న అవకాడో పళ్లన్నీ ఒక చెట్టు నుంచి వచ్చిన విత్తనాలని తేలింది. ఈ కథ […]
విజువల్ మెమొరీ యాడ్ చేయాలి
అన్నీ మరచిపోతున్నామని ఊరికే భయపడతాం కానీ, కొంచెం కష్టపడితే జ్ఞాపకాన్ని పదిలంగా మరుపనేది రాకుండా దాచుకోవచ్చు అంటున్నారు ఎక్స్పర్ట్స్. అడిగీ అడగ్గానే ఫోన్ నంబర్లు, నిమిషాలతో ఎప్పుడో జరిగిన విషయాలు ఏకరువు పెట్టేవాళ్ళని చూస్తుంటాం. వీళ్ళందరికీ సాధ్యం అయింది మనకీ సాధ్యం అవుతుంది. కాస్త ఎక్సర్సైజులు చేయాలి. ముందుగ మరచుపోతున్నానన్న భయం పోగొట్టుకోవాలి. కొన్నాళ్ళ పాటు దీక్షగా ప్రతి విషయానికి విజువల్ మెమొరీని యాడ్ చేస్తూ రావాలి. ఉదాహరణకు బయటకు వెళ్లివచ్చి బ్యాగ్ టేబుల్ పైన పెట్టాం.మరచిపోతున్నామని […]
తల్లి అశాంతిగా వుంటేనేఈ స్థితి
ప్రతి విషయానికి ఒక కారణం వుంటుంది. మనుష్యుల ప్రవర్తన వెనక పెంపకం తీరుంటుంది. కొన్నింటికి తల్లి కడుపులోనే బీజం పడుతుంది. కొంతమంది పిల్లలు మొండిగా, పెంకి తనంగా ఏడుస్తూనే వుంటారు. ఎంత ఊరడించిన అంతే. కాసేపు కూసేపు కాదు దాదాపు రోజంతా అలా చిరాగ్గా ఏడుస్తారు. సరిగా తిండి తినరు, అలంటి ప్రవర్తన పిల్లల్లో ఎందుకుంటుంది అని పరిశోధన చేస్తే ఆశ్చర్యంగా ఆ ఏడుపులకి తల్లే కారణం అని తేలింది. గర్భిణిగా ఉండగా తల్లి ఎదుర్కొన్న ఒత్తిడీ, […]
ఎమోషనల్ ఇంటలిజెన్స్ వుంటే సంబంధాలు పదిలం
ఎమోషనల్ గా ఉండే వాళ్ళలో మేధావితనం వుంటే విజయం సాధించడం సులువు అవుతుందని సాధారణంగా అందరికీ తెలిసిందే. అయితే ఎమోషనల్ గానూ, తెలివి గానూ ఉండేవాళ్ళకి తమ సొంత ప్రయోజనాలకు కూడా ఇతరుల భావోద్వేగాలను ప్రభావితం చేయగల శక్తి సామర్ధ్యాలు ఉండి ఉంటారని ఇటీవల వాషింగ్టన్ లో జరిగిన పరిశోధనల్లో గుర్తించారు. ఎమోషనల్ ఇంటలిజెన్స్ అంటే సొంత, ఇతర భావోద్రేకాలను సరైన రీతిలో క్రమబద్దీకరించుకోగలగటం. దీని వల్ల సామాజిక ప్రవర్తన, వ్యక్తిగత సంబంధ భాంధవ్యాలు బావుంటాయి. అయితే […]
సైకిల్ తో ఆరోగ్యం సొంతం
బైకులొచ్చాక వేగo అనుభవంలోకి వచ్చాక సైకిళ్ళు మూలపడ్డాయి. అయితే సైక్లింగ్ తో ఆరోగ్యం సొంతం చేసుకోవచ్చు అంటున్నారు బ్రిటన్ పరిశోధకులు. రెండున్నర లక్షల మంది పైన ఐదు సంవత్సరాల పాటు ఈ పరిశోధన జరిగింది. ఆఫీసులకు ఇతర పనులపైన బైక్ మాత్రం ఉపయోగించే వాల్లందరిలోను తలెత్తిన ఆరోగ్య సమస్యలను, అనారోగ్యాలను గుర్తించారు. ఈ పరిశోధనా సారాంశంగా ఏం తేలిందంటే బైక్ బదులు సైకిల్ ఉపయోగిస్తే కాన్సర్ వచ్చే అవకాశం 43 శాతం తగ్గుతుందనీ, అదే విధంగా గుండె […]
ఆభరణాలు మెరిసిపోతాయి
ఇళ్ళల్లో ఇత్తడి, రాగి, వెండి పాత్రలుంటాయి. అవి కొన్నాళ్ళు వడకపోయినా నల్లగా పాత వాటిలా అయిపోతాయి. వెండి వస్తువులు కొత్తవిలా మెరవాలంటే, ఒక స్పూన్ బేకింగ్ సోడ, అల్యూమినియం పేపర్ లో చిన్ని ముక్కలు తీసుకుని ఒక లీటరు నీళ్ళు వేసి ఉడకనిచ్చి తర్వాత బయటకి తీస్తే కొత్త వాటిలా మెరుస్తాయి. ఇత్తడి పత్రాలకోసం ఒక్క నిమ్మ చక్కకు. ఉప్పు పట్టించి దానితో తోమితే వుహించాలేనంతగా మెరిసి పోతాయి. రాగి పత్రాల పైన టొమాటో కెచప్ వేసి […]
చమట పట్టకుండా ఇలా చేస్తే సారి.
చిట్కాలను చిన్నచూపు చూడకూడదు. ఒక్కసారి చాలా చిరాకనిపించే ఎన్నో సమస్యలకు చిటికెలో పరిష్కారం చూపిస్తాయి చిట్కాలు. ఇప్పుడు తియ్యని వస్తువులు. పంచదార వంటివి ఎంత జాగ్రత్తగా ఎంత ఎత్తులో పెట్టిన చమటలు వెతుక్కుంటూ వచ్చేస్తాయి. అలాంటప్పు చీమలు నడిచే దారిలో దాల్చిన చక్క లేదా లవంగం పెట్టినా చీమలు ఆ దరిదాపుల్లోకి రావు. అలాగే మనం ఎంతో ఇష్టంగా కొని దాచుకున్న బుక్ షెల్ప్ ఎన్నో సార్లు శుభ్రంగా సర్దినా సన్నటి పురుగులు వస్తాయి. పుస్తకాలు పాత […]
డైట్ కూల్ డ్రింకుల వల్ల నష్టమే.
సన్నగా వుండేందుకు నాజుకుగా వుండే శరీర లావణ్యం కోసం చేసే డైటింగ్ పద్దతుల్లో డైట్ కూల్ డ్రింక్ తాగడం ఒక్కటి. కానీ ఇటీవల పరిసోధనల్లో ఈ కూల్ డ్రింక్ వల్ల కలిగే అనరోగ్యాలే ఎక్కువగా ఉంటాయంటున్నారు. అస్సలు మాములుగా వేసవిలో దేహ శాంతి కోసం ఎదో ఒక కూల్ డ్రింక్ కోసం చేయి చాస్తారు. అందు బాటు ధర, రుచి తియ్యదనం తదితర అంశాలు ఎక్కువగా ఆకర్షిస్తూ వుండటం తో వీటిని తాగ కుండా ఉండలేక పోతాయి. […]
ఒక్కో చోట ఒక్కో అందం పట్ల ఇష్టం
మనిషి మనిషికీ ఆలోచనలో తేడా ఉన్నట్లే అందం విషయంలో ప్రాంతం, ప్రాంతానికి కొలమానాలు మారిపోతాయి. ఉదాహరణకు మారిషస్ స్త్రీలు కనుబొమ్మలు కలిసేలా వెంట్రుకలు పెరిగేలా భ్రమ కలిగించే ప్రయత్నం చేస్తారు. అలాగే మారిషస్ అమ్మాయిలు ఎంత లావైతే అంత బావుంటామనుకొంటారు. వెడల్పాటి నుదురు వుంటే సెక్సీగా ఉంటామని ఆఫ్రికాలోని వులా తెగలోని అమ్మాయిలు భావిస్తారు. ఇక చైనా ఆడవాళ్లకు అందమైన రంగంటే ఇష్టం.. సన్ స్క్రీన్స్, ఫేస్ మాస్కులకు చైనాలో మార్కెట్ ఎక్కువ. తెల్లగా ఉంటేనే అందంగా […]
బరువు తక్కువగా ఉన్నా మానసిక అశాంతే
సన్నగా ఉంటె ఎంతో బావుంటారని, లావుగా వుండటం వల్లనే సమస్యలనీ ఒక భ్రమలో ఉంటారు కానీ అసలు సన్నగా ఉన్న వాళ్లలోనే డిప్రెషన్ లక్షణాలు ఎక్కువగా కనిపిస్తున్నాయని ఒక అధ్యయనం రిపోర్ట్ చెపుతుంది. బరువు తక్కువగా ఉండటమే వాళ్ళ మానసిక అశాంతికి కారణమని రిపోర్ట్ విశ్లేషించింది. స్త్రీ పురుషుల్లో కూడా ఈ బరువు తక్కువగా ఉండటం వల్ల మానసికంగా కుంగుబాటు కనిపిస్తుంది. వీరిలో శారీరక బలహీనతతో పాటు ఆత్మవిశ్వాసం సన్నగిల్లటం, ఆత్మన్యూనత, పోషకాహారలోపం తరితర కారణాలు డిప్రెషన్ […]
ఎండల్లో చల్లగా ఉండాలంటే.
వేసవిలో ప్రధానంగా బాధించే సమస్య డీహైడ్రేషన్, ఎండ, చమట వల్ల అలసట, నీరసం కూడా తప్పదు. వీటిని తగ్గించుకోవడం కోసం జీవన శైలి లో మార్పులు తీసుకోవాలి. వ్యాయామాలు చేసే వాళ్ళు కేవళం మంచి నీళ్ళ పైనే దృష్టి పెడితే సరిపోదు. కొబ్బరి నీళ్ళు, గ్లూకోజ్, నిమ్మరసం, కొబ్బరి నీళ్ళు కూడా తీసుకుంటూ వుండాలి. చమట వల్ల శరీరం మేలు చేసే ఎలక్ట్రోలైట్లను కోల్పోతుంది. శరీరంలో ఖనిజాలు బయటకు వెళ్ళిపోతాయి. అందుకే నీరసం, అలసటా. అలాంటప్పుడు ఎక్కువ […]
మిరపండుతో దీర్ఘాయువు.
మిరపపండు చూస్తేనే కారం గుర్తొచ్చి కళ్ళల్లో నీళ్ళు తిరుగుతాయి. కానీ కారం ఇష్టంగా తినేవాళ్ళు ఎక్కువకాలం ఆరోగ్యంతో జీవిస్తారని పరిశోధనలు చెపుతున్నాయి. అందులో పండు మిరప తినేవాళ్ళు మిగతా తినని వాళ్ళతో పోలిస్తే అత్యధిక కాలం జీవిస్తున్నట్లు యునివర్సిటీ ఆఫ్ వెర్మాంట్ చేసిన పరిశోధనల్లో తేల్చింది. పూర్వ కాలంలో సుగంధ ద్రవ్యాలని, మిర్చిని కూడా రకరకాల వ్యాధుల చికిత్సలో భాగంగా ఉపయోగించే వాళ్ళు. ఒక ఇరవై ఏళ్ళ పాటు కొన్ని వందల మంది పైన ఈ పరిశోధన […]
ఇలా కలిపి తింటే మంచిది.
ఇప్పుడు వేసవి తాపం నుంచి కాపాడుకునేందుకు రకరకాల జ్యూస్ ల వైపు చూస్తారు పిల్లలు, పెద్దలు కూడా. కొన్ని జ్యూస్ లు యధావిధి గా తీసుకోవడం కన్నా కొన్నింటితో కలిపి తీసుకుంటే ఆరోగ్య పరంగా లాభం. పుచ్చకాయ రసానికి కీరాదోస, పుదీనా కలిపితే వ్యాధి నిరోధక శక్తిని పెంచే యాంటీ ఆక్సిడెంట్స్ పెరుగుతాయి. గ్రీన్ టీలో పుదీనా, నిమ్మరసం కలిపి తాగితే కొవ్వు వేగంగా తగ్గుతుంది. జీర్ణ శక్తి పెరుగుతుంది. నారింజ లేదా కమలా పండ్ల రసం […]
ఇలా వుండటం అమ్మాయిలకు నచ్చేసింది.
ఆఫీసుకీ, కాలేజీకి వెళ్ళేటప్పుడు ఫ్యాషన్ గా ఉంటుందని ఎత్తు మడమల చెప్పులేసుకుంటారు. కానీ ఎక్కువ సమయం నడవాల్సి వచ్చినా గబగబా ఏ మెట్లో ఎక్కవలసిన ఈ మడమలతో కష్టమే అయితే కావాలనుకోన్నప్పుడు ఎత్తుగా ఉండేలా, అవసరం లేనప్పుడు లోపలి ముడుచుకునేలా, రన్ వాకబుల్ హై హీల్ షూలు మార్కెట్ లోకి వచ్చాయి. కేలమిన్ హీల్స్, షీలాస్ హీల్స్ పేరుతో వస్తున్న ఈ చెప్పుల అడుగు భాగం, సగం వరకు లేదా, మొత్తం గా లోపలికి మడిచే వీలుంటుంది. […]
ఎక్కువ సార్లు తింటుంటేనే ఆరోగ్యం
చాలా మంది మూడు పూటలా భోజనం చేసే వాళ్ళు ఉన్నారు. కొందరు ఒక సారే తిని సరిపెట్టుకొంటారు. కొంత మంది ఎప్పుడూ ఏదో ఒకటి తింటూనే ఉంటారు.అయితే ఒకసారి ఎక్కువ తినే వాళ్ళతో పోలిస్తే ఎక్కువ సార్లు కొద్ది కొద్దిగా తింటే ఆరోగ్యమని పరిశోధనల సారం. ఎందుకంటే తిన్న ప్రతిసారి కొంత బాక్టీరియా కడుపులోకి చేరుతుంది. దానితో ఈ బాక్టీరియాను ఎదుర్కొనే రోగ నిరోధక వ్యవస్థ మేల్కొంటుంది. అది పనిచేయడానికి కొన్ని క్యాలరీలు కావాలి. అంటే తీసుకున్న […]
