ఆందోళన పడటం మంచిదే.
ఎవరైనా టెన్షన్ గా వుంటే వెంటనే అలా ఉండొద్దు ఆరోగ్యానికి మంచిది కాదు అని చెప్పుతుంటారు. మాటి మాటికి ఆందోళన పడటం వల్ల శారిరానికి మంచిది కాదు అని ఇప్పటి వరకు మనకు తెలిసిన విషయం. కానీ ఇటీవల శాస్త్రవేత్తలు చేసిన ఒక అధ్యాయినంలో ఆసక్తి కరమైన అంశం వెలుగులోకి వచ్చింది. ఆందోళన పడటం కూడా మంచిదేనని ఆ రిపోర్ట్ సారంశం. ఆశర్యంగానే వుంటుంది. ఆందోళన పడటం వల్ల వ్యక్తులు తమ బాధ నుంచి స్వాంతన పొందుతారని. […]
మూడ్ సరి చేసేవి ఇవే.
ఒక్కోసారి ఏం చేయాలన్నా ఉత్సాహం వుండదు. ఆటోమాటిక్ గా ఎనర్జీ లెవెల్స్ బాగా తక్కువగా వున్నాయని పిస్తోంది. లైఫ్ ఎంజాయ్ చేయలేకపోతాం. మరలాటి సమయంలో కొత్త ఉత్సాహం నిమ్పుకోవాలంటే ప్రచీన ఆధ్యాత్మిక హీలింగ్ ప్రక్రియా విధానం అనుసరించాలి. అంటే హాయిగా స్నానం చేయడం, నీళ్ళు తాగడం. నీటి వల్ల శరీరం కొత్త ఉత్సాహం పుంజుకొంటుంది. అలాగే తాజా సుగంధ పరిమళాన్ని ఆశ్రయించాలి. లేమెన్ గ్రీన్ ఆరంజ్ సెంట్ వంటివి వాడితే, ఈ పరిమళాలు మనస్సుకి ఆహ్లాదం ఇస్తాయి. […]
స్ట్రెచింగ్ చేస్తే చాలా ఉపయోగం.
స్ట్రెచింగ్ చాలా మంచి వ్యాయామం అని, ఇందువల్ల కావలసినన్ని లాభాలు ఉంటాయి అంటున్నారు ఎక్స్ పర్ట్స్ కండరాళ్ళు స్ట్రెచింగ్ చేస్తే శరీర కదలిక పద్దతి పెరుగుతుంది. శరీరం బాలన్స్ తప్పి పడిపోకుండా వుంటుంది. కిళ్ళ నొప్పులు వెన్ను నొప్పులు రాకుండా ఉంటాయి. శరీరం వంగిపోకుండా, చిన్న చిన్న పనులకు శరీరం అలసటకు గురికాకుండా వుంటుంది. అన్నింటిని మించి శరీరం ద్రుడంగా హుషారుగా వుంటుంది అంటున్నారు. వయస్సు పెరుగుతున్న కొద్ది శరీరంలో బిగుసుకు పోయే లక్షణం మొదలవ్వుతుంది. అంటే […]
ఆరోగ్యానికి నిలయం పైనాపిల్.
మామిడి పళ్ళు, పైనాపిల్, పనస తొనలు వేసవి ఎండలను ఏమార్చే తియ్యని తాయిలాలు. పైనాపిల్ గురించి ఒక్క మాటలో చెప్పాలంటే. పొటాషియం, కాపర్, మాంగనీస్, కాల్షియమ్, మెగ్నీషియం వంటి పోషకాలతో నిండి వున్న ఆరోగ్య ఫలం. విటమిన్-E, A,Bలతో పాటు పీచు సమృద్దిగా వుండి జీర్ణ వ్యవస్థకు అంతులేనంత మేలు చేస్తుంది. పైనాపిల్ లో వుండే బ్రోమెలైన్ అనే ప్రత్యేకమైన ఎంజైమ్ యాంటీ ఇంఫ్లమేటరీ గుణాన్ని కలిగి వుండి అర్దారైటీస్ వంటి అనేక అనారొగ్యాల్లో కలిగి వుండి […]
కొవ్వు కరగాలంటే వెయిట్ ట్రైనింగ్ బెస్ట్.
ఏరోబిక్స్ చేస్తూ వుంటే మంచి ఫిజిక్ తో ఉండొచ్చని, ఉదరం చుట్టూ పేరుకొన్న కొవ్వు ఇట్టే కరిగిపోతుందని కళలు కంటే ప్రయోజనం దక్కడం కష్టమే నంటున్నారు. ఉదరం చుట్టూ పేరుకొన్న బరువు తగ్గాలంటే వెయిట్ ట్రైనింగ్ కీలకమని హార్వార్డ్ పరిశోధకులు తగు అధ్యాయిన్నాల్లో గుర్తించారు. వెయిట్ ట్రైనింగ్ తీసుకోవడం లేదా దీన్ని ఎరోబిక్స్ వ్యాయామాల తో కలపడం వల్ల కొవ్వు ఈజీగా పోగొట్టుకోవచ్చు అని అధ్యాయినకారులు చెపుతున్నారు. లేదా ఈ కొవ్వు తగ్గించే ప్రయత్నం చేయకుండా వదిలేస్తే […]
ఓట్స్ ఇడ్లీ తినండి.
కొన్ని మంచి ఆహార పదార్ధాలేనని తెలిసినా అవే తింటూ వుంటే బోర్ కొట్టక తప్పదు. నిజానికి ఓట్స్ చాలా మంచి ఆహారం. తింటే పాలతో తినాలి. లేదా చప్పగా రుచిగా లేక తినాలనిపించదు. నూనెతో చేసిన అల్పాహారం దూరం పెట్టి ఓట్స్ ఇడ్లీ ట్రై చేయొచ్చు. పెరుగు ఇడ్లీ రవ్వ ఓట్స్ కలిపి ఇడ్లీ వేస్తె అచ్చం మాములు ఇడ్లీ లాగానే ఉంటాయి. ఇడ్లీ రవ్వ గుప్పెడు కడిగిపెరుగులో పిండి పడేసి అందులో ఓట్స్ కలిపి ఇడ్లీ […]
పిల్లలకు కధలు చెప్పడం నేర్పండి.
ఈ సెలవులు పూర్తి అయ్యే లోపు స్కూళ్ళు వుండవు గనుక పిల్లలకు ఇంట్లో ఎన్నో విషయాలు చెప్పే విలుంటుంది. అలాగే మంచి పనులు కూడా నేర్పొచ్చు. ముందుగా వాళ్ళకోసం రెండు గంటలు కేటాయించి స్టోరీ టెల్లింగ్ మొదలెట్టవచ్చు. మనం ఓ కధ చెప్పి పిల్లల్ని అలాగే వాళ్ళకొచ్చిన భాషలో తిరిగి చెప్పేలా నేర్పాతే. ముందుగా వాళ్ళకు స్టేజ్ ఫియర్ పోతుంది. చుట్టు పక్కల పిల్లలని ఒక్క చోట చేర్చి ఈ కధలు చెప్పించా గలిగితే ముందుగా వాళ్ళ […]
బెండ లో పోషకాలు మెండు.
బరువు తగ్గాలనుకొంటున్నారా? ఈజీ… బెండకాయలు తినండి. ఇది తేలికగా అందిన ఉచిత సలహా కాదు. పరిశోధకుల రిపోర్టు. లేతగా నిగనిగలాడే బెండ కాయను ఏ రూపంలో తిన్నా పోషకాలు సమృద్దిగా అందుతాయి. క్యాలరీలు చలా తక్కువ. ఒక కప్పు పచ్చి బెండకాయ ముక్కల్లో 35 క్యాలరీలు మాత్రమే వుంటాయి. కాబట్టి బరువు తగ్గాలంటే ఇది మంచి ఆహారం. ఇందులో కరిగే పిచు, కరగని పిచు రెండు వున్నాయి. సొల్యుబుల్ రక్తంలో చక్కర స్థాయిని తగ్గిస్తుంది. డయాబెటీస్ గలవారికి […]
కొంచం తిన్నా ఎంతో వ్యాయామం చేయాలి.
కొన్ని లిస్టులు చదివితే చివరకు నోరు ఆ అని తెరవలన్నా భయం వేస్తుంది. వేయాలి కూడా. రెండు ముక్కల చీజ్ బర్గర్ తింటే 88 నిమిషాల పాటు పొట్టకు సంబందించిన వ్యాయామం చేయాలని ఫిట్ నెస్ ఎక్స్ పర్ట్స్ ఒక పొడుగాటి లిస్టు తెచ్చి ఎదురుగ్గా తగిలిస్తే, అవన్నీ ఫాలో అయితే ఇక ఏ వ్యాయామం లేకుండా పుల్ల లాగా అయిపోవచ్చు. సరే లిస్టు చూద్దాం, ఒక్క మిల్క్ షేక్ తాగితే గంట సేపు తాడాట ఆడాలి. […]
ఇది తక్షణ శక్తిని ఇస్తుంది.
తియ్యని తిను బండారాల తయ్యారీలో, ఇతరాత్రా వాడే బెల్లంలో అనేక ఆరోగ్య ప్రయోజనాలుంటాయి. బెల్లంలో వుండే సహజసిద్దమైన క్లెన్సింగ్ గుణాల వల్ల జీర్ణ సంబందిత సమస్యల పరిష్కారంలో సహకరిస్తుంది. దీనికి రక్తాన్ని సుద్ధి చేయగల గుణం వుంటుంది. మంచి ఫలితాల కోసం బెల్లంను ప్రతి రోజు పాలు లేదా నీళ్ళతో కలిపి తీసుకోవాలి. బెల్లం శరీరాన్ని అన్ని రకాల విపత్తులనుంచి పరిరక్షిస్తుంది. మహిళలు బెల్లాన్ని ప్రతి రోజు ఆహారంలో భాగంగా తీసుకుంటే రక్త హీనత తగ్గిపోతుంది. ముఖ్యంగా […]
మొక్కలతో ఇంటికి చల్లదనం.
ఎండ తీవ్రంగా వుంది కదా, కనీసం ఇప్పుడయినా అందమైన పూల మొక్కలు, ఇంటి లోపల ఆరోగ్యంగా పెరగగలిగే మొక్కలను వేసవికి అనుకూలంగా ఉండేవి ఎంచుకోమంటున్నారు గార్డెనింగ్ ఎక్స్ పర్ట్స్. ఫిలడెండ్రియా, స్వాతి ఫైలమ్, ఇంగ్లీష్ ఐవీ, ఇలాంటి వాటిల్లో కొన్ని ‘NASA’ కూడా వీటిని గాలిని సుద్ధి చేసే మొక్కలుగా గుర్తించింది. వీటిని గది మూలల్లో ఉంచితే చల్లదానాన్ని ఇస్తాయి. పడక గది కిటికీల పక్కన ఎండ బాగా తగిలితే గోడల దగ్గర మొక్కల్ని పెట్టుకోవాలి. వీలైతే […]
రుచి ఆరోగ్యం ఉంటేనే ఏ వంటనయినా మెచ్చేది.
ఎన్నో దేశాల వంటకాలు రుచి చూస్తున్నాం గమనించండి. ప్రతి వంటకంలోను ఏవో పోషకాలు. ఆరోగ్యానికి మేలు చేసే అంశాలు, కోలెస్ట్రోల్ తగ్గించేవి, బరువు పెరగకుండా అదుపు చేసేవి, ఇలా ఎన్నో ప్రత్యేక అంశాలతోనే ఆ వంటకం పాప్యులర్ అవుతుంది. ఉదాహరణకు చైనా వంటకాలు నోరురిస్తాయి. వాటి ప్రత్యేకత కేవలం రుచికే పరిమితం కావు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. వెల్లుల్లి అల్లం ఈ వంటకాల్లో ఎక్కువగా కనిపిస్తాయి. వెల్లుల్లి గుండెకు మేలు చేస్తే అల్లం జీర్ణ సంబంధ […]
కుర్చీ బదులు బంతి పైన కూర్చోండి.
శరీరానికి మూవ్ మెంట్ ఉంటేనే ఆరోగ్యం. గంటల కొద్దీ కదలకుండా కుర్చుని పని చేసే వాళ్ళు, కుర్చీలో కూర్చునే బదులు వ్యాయామం కోసం ఉపయోగించే బంతి పైన కూర్చోండి, ఎన్నో రకాల ప్రయోజనాలు కలుగుతాయి అని చెపుతున్నారు ఎక్స్ పర్ట్స్. బంతి పైన కూర్చుంటే వెన్ను పైన వత్తిడి పడదు. నడుము, వెన్ను నొప్పి బాధించదు. బంతి పైన కుర్చుని పని చేస్తే శరీరాన్ని బంతి సమన్మయం చేస్తుంది. అటూ, ఇటు కదలొచ్చు. దీని వల్ల కెలరీలు […]
ఔషధ పోషక విలువల ముల్లంగి.
ముల్లంగి ఎరుపు తెలుపు రంగుల్లో క్యారెట్, చిలకడ దుంప లాగే వున్నా చాలా మందికి ఇష్టం వుండదు. ఇందులో ఎన్నో పోషక ఔషద విలువలున్నాయి. యాంటీ బక్టిరియల్, యాంటీ ఫంగల్ సుగుణాలు దీని సొంతం. రోగ నిరోధక శక్తిని పెంచగల ముల్లంగి విటమిన్-సి, పోటాషియం, సోడియం, తదితర ఖనిజాలు, విటమిన్లు, పిచు తో నిండి వుంటుంది. ముల్లంగి సలాడ్ గానూ, పచ్చి గాను తీసుకోవచ్చు. ఉడికించాలి అంటే తక్కు నీళ్ళు పోయాలి. ఆ ఉడక బెట్టిన నీటిని […]
వీటి వల్ల పిల్లల్లో స్పీచ్ డిలే
పిల్లలు ఏడిస్తే చాలు అమ్మానాన్నలు వాళ్ళ చేతుల్లో సెల్ ఫోన్లు పెట్టేస్తారు. ఏముంది ఇక పిల్లల ఆటలన్నీ అక్కడితో బంద్. గంటల తరబడి సెల్ ఫోన్, టాబ్ ల తో కాలక్షేపం అయితే ఇలా ప్రపంచంతో పని లేకుండా ఎప్పుడూ సెల్ ఫోన్లు, టాబ్లు, ఐపాడ్ ల తో ఆడటం వల్ల వారికి మాటలు ఆలస్యంగా వస్తాయని ఇప్పుడొక స్టడీ రిపోర్టు చేఅపుతుంది. మాటలు రాకపోగా, కమ్యునికేషన్ డిలే అంశం పై చేసిన అధ్యాయినంలో పిల్లలు ఎంత […]
ఈ సీజన్ కు తగ్గట్టు ఎంచుకోండి.
మేమిలాగే వుంటాం, మాకిలాగే బావుంటుంది అన్న స్టాండర్డ్ ఒపీనియన్స్ ఫ్యాషన్స్ కనే కాదు. ఎప్పుడు ఒకే తరహా దుస్తులు బావుండవు. కాలానికి అనుగుణంగా వార్డ్ రోబ్స్ లో మార్పులు తెచ్చుకోవాల్సిందే. అలంకరణ వస్తువులు కాస్త భిన్నంగా వుండాల్సిందే. ఎండలు మండిపోతుంటే బిగుతైన దుస్తులు వేసుకోవద్దు. వదులుగా వుండే డిజైన్లకు ప్రాధాన్యత ఇవ్వాలి. కుర్తీ, ధోతిలు, పలజోలు, జంప్ సూట్లు, నూలు చీరలు వంటివి ఈ కాలానికి చెక్కని ఎంపిక. అలాగే సిల్క్, షిఫాన్లు, క్రేప్ ల తో […]
పర్లేదు ఆ చిరాకు ఇట్టే పోతుంది.
నెలసరి ముందు నుంచే కొందరికి భావోద్వేగాల పరమైన చిరాకు కోపం వంటి సమస్యలు వేధిస్తాయి. ఈ సమయంలో నడుము, కాళ్ళ నొప్పులు భాదిస్తాయి. పొట్ట ఉబ్బరంగా వుంటుంది. ఏమీ తినాలి అనిపించదు. వీటి నుంచి ఉపసమనం కోసం ముందుగా రిలాక్స్ అవ్వాలి. విశ్రాంతి తీసుకొన్న గదిలో ఒక మూల తాజాగా వాసనలోచ్చే ముంచి పూల గుత్తిని వుంచుకోవాలి. పరిమళాలు మనస్సుకి ఆహ్లదాన్ని ఇస్తాయి. అలాగే మంచి సువాసన వచ్చే కోవొత్తి వెలిగించినా పర్లేదు. నొప్పుల ఉపసమనానికి హీటింగ్ […]
సహజమైన సువాసనలివి.
ఇల్లంతా సువాసనలోస్తే బావుంటుంది. ఎంత ఖరీదైన స్ప్రేలు కొట్టినా కాసేపట్లో మళ్ళి మాములుగానే వుంటుంది. ఈ సారి కొన్ని సహజ సిద్ధమైన పదార్ధాల వైపు చూడండి. నేలను తుడుస్తున్నప్పుడు. నీటిలో రెండు చుక్కలు నిమ్మ గడ్డి నూనె వేస్తె ఈగలు, దోమలు ముసరవు. చక్కని వాసనా వస్తుంది. లేదా గిన్నె నీళ్ళల్లో రెండు స్పూన్లు నిమ్మ గడ్డి నూనె వేసి స్టవ్ పైన పెట్టి మరగానిస్తే ఇల్లంతా సువసనే. అలాగే దాల్చిన చెక్క పొడిని సాంబ్రాని పొగలాగా […]
తుమ్ము ఆపేరో సమస్యే
పదిమంది మధ్యలో ఉన్నప్పుడు ఏదైనా శుభకార్యం జరుగుతుంటేనో, సామాజిక కార్యక్రమాల్లోనో, సెంటిమెంట్ తో ఎవరైనా ఎమన్నా అనుకొంటారానో తుమ్ము వస్తుంటే బలవంతంగా ఆపెస్తారేమో కానీ అలా తుమ్ము వచ్చినప్పుడు ఆపుకోవడం చాలా ప్రమాదం. తుమ్మొచ్చినప్పుడు వెలుపలికి వచ్చేగాలి గంటకు వంద మైళ్ళ వేగంతో వస్తుందిట. దాన్ని బలవంతంగా ఆపేస్తే ముక్కులో కార్డిలేడ్ ఫ్రాక్చర్లు కావడం, ముక్కులోంచి రక్తం కారడం, కర్ణభేరి చిట్లడం, వినికిడి లోపం, తాత్కాలికంగా మొహం వాడిపోవడం వంటి సమస్యలు తలెత్తే అవకాశాలున్నాయి. ఇలాంటివి జరక్కుండా […]
రోజుకో మామిడి పండు
మామిడి పండు పైన పంచ రత్నాలు రాయవచ్చు. తిన్న వెంటనే సంతోషం పట్టలేక కవితలు రాయచ్చు. నోరారా కీర్తించవచ్చు. అంత కమ్మగా వుండే మామిడి పండు మనకు దొరికేది ఏడాదిలో రెండు మూడు నెలలు అయితే సంవత్సరం పొడవునా సరిపోయేన్ని ఔషధ గుణాలు ఈ పండులో పుష్కలంగా ఉన్నాయి. యాంటీ ఆక్సిడెంట్లు అధిక మోతాదులో, కార్బోహైడ్రేట్స్ తక్కువ మోతాదులోఉంటాయి. పిండి పదార్ధం, కొవ్వు తక్కువగా ఉండటం వల్ల మామిడి పండు తింటే బరువు పెరుగుతామన్న భయం అక్కర్లేదు. […]
