డబ్ల్యూ పవర్ జాబితాలో తమన్నా?
పదేళ్ల నుంచి పాన్ ఇండియా స్టార్ గా వెలుగుతున్న స్టార్ తమన్నా భాటియా ఫోర్బ్స్ ఇండియా తాజాగా ప్రకటించిన డబ్ల్యు పవర్ 2026 జాబితాలో పేరు దక్కించుకున్నారు. నటనా రంగం లోనే కాకుండా వ్యాపార రంగంలో కూడా ఆమె విజయవంతంగా కొనసాగుతోంది.. గ్లామర్ ఇండస్ట్రీలో కెరీర్ శాశ్వతం కాదని నిజం గ్రహించిన తమన్నా ఫైన్ జ్యువెలరీ పేరుతో వ్యాపారంలోకి ప్రవేశించింది.ఒక సెలబ్రిటీగా బ్రాండ్ ప్రమోట్ చేయడమే కాకుండా డిజైన్ల ఎంపికలో కూడా భాగస్వామ్యం తీసుకున్నది.నేటి ఆధునిక మహిళకు రోజువారి ఉపయోగానికి సరిపోయే ఆభరణాలు శ్రేణిని మార్కెట్లోకి తీసుకొచ్చింది తమన్నా ఫోర్బ్స్ ఇండియాలో డబ్ల్యూ పవర్ జాబితాలో ఆమె స్థానం వ్యక్తిగత విజయానికి గుర్తింపు మాత్రమే కాదు పట్టుదల దార్శనికత ఉంటే మహిళలు ఏదైనా సాధిస్తారని చెప్పేందుకు ఒక ఉదాహరణ.
