Wednesday, 22 Jul, 2026

రాలిపడిన ఆకులతో  చెప్పులు

మిదుషి కొచ్చర్‌ సముద్రపు గవ్వలు,గుడ్డు పెంకులు రాలిన ఆకులతో పాత్రలు, చెప్పులు తయారు చేస్తుంది.2021 లో యలమ్ పేరుతో ఆమె మొదలుపెట్టిన స్టార్టప్ లో రాలిన ఆకులతో తయారుచేసే డిజైనర్ ఎకో ఫ్రెండ్లీ చెప్పులు, గుడ్డు పెంకులతో స్పూన్ లు ప్లేట్లు మొదలైనవి అందరి ప్రశంసలు పొంది చాలా తొందరగా మార్కెట్ అయ్యాయి.ఈ ఉత్పత్తులు మన దేశంతో పాటు చైనాలోనూ ,మిలన్, లండన్ డిజైన్ వీక్స్ లో అందరి ప్రశంసలు అందుకున్నాయి .ఏకో ఫ్రెండ్లీ చెప్పులు తేలికగా ఉండి ఎక్కువ దూరం నడిచేందుకు సౌకర్యంగా ఉంటాయి. గుడ్ల పెంకులతో తయారుచేసే ఉత్పత్తులు అమెరికా,బ్రిటన్,యూరప్ దేశాలకు ఎగుమతి అవుతున్నాయి. ఈ ఎగ్ వేర్ ప్రాజెక్టులు పర్యావరణానికి మేలు చేస్తాయి కాబట్టి అందరికీ నచ్చాయి.

Leave a Reply