ఈ అమ్మాయి సచిన్ తో సమానం
రోలర్,ఇన్‌లైన్ ఫ్రీ స్టైల్ స్కేటింగ్ లతో 11 గిన్నిస్ రికార్డులు సాధించింది జాన్వి జిందాల్. 18 సంవత్సరాల జాన్వి ఎనిమిదవ ఏటా నుంచే స్కేటింగ్ నేర్చుకున్నది.ఆక్సిజన్ స్థాయిలు తక్కువగా ఉండే ఖర్దుంగ్లా పాస్ మీద నిమిషానికి 54 స్పిన్స్ చేసింది జాన్వి. దేశం నుంచి ఎక్కువ గిన్నిస్ రికార్డులు సాధించిన అమ్మాయి గా, అట్లాగే సచిన్ తర్వాత ఈ రికార్డుల సాధనలో రెండో స్థానంలో నిలిచిన అమ్మాయి గా ఆమె నిలిచింది. ఆమెది చండీగఢ్ యోగ, జిమ్నాస్టిక్స్ […]
గణిత శాస్త్రవేతకు పురస్కారం
భారత సంతతికి చెందిన ఆస్ట్రేలియన్ నళిని జోషి ప్రఖ్యాత గణిత శాస్త్రవేత్త. సిడ్నీలో జరిగిన ప్రీమియర్స్ ప్రైజెస్ ఫర్ సైన్స్ వేడుకలో జోషి సైన్స్ ఆఫ్ ది ఇయర్ అనే ప్రతి స్టాత్మక అవార్డ్ అందుకున్నారు. సిడ్ని యూనివర్సిటీ లో గణిత శాస్త్ర ప్రొఫెసర్ గా అప్లైడ్ మ్యాథమెటిక్స్ చైర్ గా పనిచేస్తున్నారు. ఈ పదవి అందుకున్న తొలి మహిళ కూడా ఫైబర్ ఆప్టిక్స్, నాన్ లీనియర్ ఫిజిక్స్ లను నిర్వహించే సంక్లిష్ట గణిత నమూనాలు పైన […]
ఆస్తులు ఇప్పిస్తారు
చండీగఢ్ యూనివర్సిటీ లో ఎం బి ఏ చేసిన పూజ మాలిక్ స్నేహితురాలు నేహ జైన్ తో కలిసి ఈ క్వి ట్రేసర్స్ అని అంకుర సంస్థ ప్రారంభించారు పెట్టుబడులు పెట్టి మరిచిపోయిన వినియోగదారుల సమస్యలు పరిష్కరిస్తుంది ఈ సంస్థ యజమాని చనిపోవడం డాక్యుమెంట్స్ పోగొట్టుకోవటం వంటి సమస్యలు పరిష్కరించే ఈ సంస్థ ఢిల్లీ కేంద్రంగా 2022 నుంచి పనిచేస్తోంది పూజ మాలిక్ ఈ సంస్థ సి ఈ ఓ మనదేశంలో క్లెయిమ్ చేయని పేర్లు రికవరీ […]
విలక్షణం ఈ ‘దినెస్ట్ ‘
యాసిడ్ బాధితుల కోసం ఉచితంగా సౌందర్య సేవలు ఇచ్చే ధ్యేయంతో దినెస్ట్ బ్యూటీ సెలూన్ స్థాపించారు హరిత మెహతా. ఢిల్లీ హైకోర్టు సీనియర్ న్యాయవాది. మహిళా హక్కుల కార్యకర్త యాసిడ్ బాధితుల్లో ఆత్మస్థైర్యం నింపటం వాళ్ళ రూపాల పట్ల వాళ్లలో ఏర్పడిన భయాన్ని పోగొట్టడం కోసం ఈ వెల్ నెస్ సెంటర్ స్థాపించారు హరిత మెహతా ఢిల్లీలో ఉన్న ఈ సెంటర్ అన్ని విధాలుగా విలక్షణమైనది. బాధితుల సంక్షేమం దృష్టిలో పెట్టుకొని ఈ దినెస్ట్ బ్యూటీ సెలూన్ […]
అజరాఖ్ కి కొత్త హంగులు
సహజ రంగులు చెక్క బ్లాక్ లు ఉపయోగించి జియో మెట్రిక్ డిజైన్లతో రూపొందించిన ప్రాచీన అరబిక్ కళ అజరాఖ్.పురుషులు మాత్రమే ఇంతవరకు చేస్తూ వచ్చిన ఈ సాంప్రదాయ కళను నేర్చుకున్నారు ఖాలిద్ ఖత్రి. గుజరాత్ లోని అజరాఖ్ పూరి లో నివసించే ఆమె తండ్రి అన్న ఈ సాంప్రదాయ కళాకారులు వారితో కలిసి ఈ డిజైన్లు చేయటం నేర్చుకున్నా ముబాసిరా 2021 లో ఎలిషియన్స్ బ్రాండ్ తో ఈ సాంప్రదాయ కళకు కొత్త హంగులు అద్ది ఈ […]
ఆమె సాహసం అద్భుతం
కమాండో సుమన్ కుమారి భారత సరిహద్దు భద్రతా దళం లో మొట్టమొదటి మహిళా స్నైపర్ గా చరిత్ర సృష్టించారు. ప్రస్తుతం సబ్ ఇన్స్పెక్టర్ గా పని చేస్తున్న ఆమె పురుషులు సైతం వెనుకంజ వేసే స్నైపర్ ఎనిమిది వారాల కోర్స్ పూర్తిచేసి పట్టుదల ఉంటే ఏది అసాధ్యం కాదని నిరూపించారు. హిమాచల్ ప్రదేశ్ నుండి మండి జిల్లాకు చెందిన సుమన్ కుమారి 2021 లో బి.ఎస్.ఎఫ్ లో చేరారు.కమాండో శిక్షణ తర్వాత అత్యంత కఠినమైన స్నైపర్ శిక్షణ […]
అంతర్జాతీయ ఆర్టిస్ట్
పశ్చిమ బెంగాల్ లోని శ్రీరామ్ పూర్ అనే పల్లెలో జన్మించిన మేమిత బాసర్ ఫైన్ ఆర్ట్స్ లో బ్యాచిలర్ పాత వస్త్రాలు తమ ప్రాంతంలో ప్రసిద్ధి చెందిన కాంత అల్లిక టీ,కాఫీ నాచు లతో ఆమె అద్భుతమైన చిత్రాలు గీశారు. మహిళల బావోద్వేగాలు పురుషాధిక్యత తో వాళ్లు ఎదుర్కొనే సవాళ్లు పర్యావరణం పైన చిత్రాల్లో కనిపిస్తాయి ఆమె చిత్రాలతో లండన్, పోలాండ్, స్పెయిన్ విదేశాల్లో ఎగ్జిబిషన్ లు ఏర్పాటు చేశారు. అంతర్జాతీయ గుర్తింపు తెచ్చుకున్న ఈ కళాకారుని […]
ద్వితీయ స్థానం లో క్రిస్టీన్
క్రిస్టీన్ లగార్డ్ లాయర్.చికాగోకు చెందిన బేకర్ మెక్‌కెంజీ అనే అంతర్జాతీయ లా సంస్థ తో తన కెరియర్ ప్రారంభించారు 31 ఏళ్ళు వచ్చేసరికి ఆ సంస్థ ఎక్స్క్యూటివ్ కమిటీ లో స్థానం సంపాదించారు. తరువాత ఆ కమిటీ చైర్ పర్సన్ అయ్యారు తొలి ఫిమేల్ గ్లోబల్ చైర్ పర్సన్ గా రెండుసార్లు ఎన్నికయ్యారు. తర్వాత ఫ్రెంచ్ రాజకీయాల్లో అడుగుపెట్టి ఫైనాన్స్ మినిస్టర్ అయ్యారు ఫారిన్ ట్రేడ్ అగ్రికల్చర్ అండ్ ఫిషరీస్ శాఖలకు మంత్రిగా చేశారు తర్వాత ఇంటర్నేషనల్ […]
ఫోర్బ్స్ జాబితాలో మొదటి స్థానం
ఉర్సులా వాన్ డెర్ లేయన్ జర్మనీ చరిత్రలో తొలి మహిళా రక్షణ మంత్రి రాజధాని బ్రస్సెల్స్ లోని బ్రస్సెల్స్ లో జన్మించారు లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ లో చదువుకున్నారు విమెన్ హెల్త్ లో స్పెషలైజేషన్ చేశారు. 1990లో క్రిస్టియన్ డెమోక్రటిక్ యూనియన్ లో చేరారు. ఆ తర్వాత లోయర్ సాక్సోనీ రాష్ట్ర ప్రభుత్వంలో మంత్రిగా పనిచేశారు. 2025లో వాన్ డెర్ లేయన్ ఫెడరల్ క్యాబినెట్ లో ఫ్యామిలీ అఫైర్స్ మినిస్టర్ గా నియమితులై చైల్డ్ అడ్వాన్స్ […]
అబ్బా! ఏం తీపి!
చూసేందుకు చిన్నగా ఈత పండులా ఉండే మిరాకిల్ ఫ్రూట్ ఎంతో తియ్యగా ఉంటుంది.ఈ పండు లోని గుజ్జు నాలుకకు ఓ పూతలా ఉండి చాలా సేపు నోరంతా తీపిగా ఉంటుంది. ఆఫ్రికా లో పుట్టిన ఈ పండును మిరాకిల్,లేదా మ్యాజిక్ బెర్రీ అంటారు. ఇందులోని విటమిన్లు ఖనిజాలు, పీచు ఫ్లేవనాయిడ్లు, యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు అన్ని కలిసి ఈ ఫ్రూట్ ను చేశాయి.మధుమేహం ఉన్న ఏ పండు తినచ్చు.క్యాన్సర్ చికిత్సలో ఈ పండు ఉపయోగిస్తున్నారు.కీమోథెరపీ తో నోటి […]
వయసును స్వీకరించండి
40ల్లో 20 ఏళ్ల వారిలా కాకుండా 40 లాగే కనిపించాలి అంటున్నారు ప్రముఖ న్యూట్రిషనిస్ట్ రుజుత దివేకర్. బరువు పరిమాణం ఆరోగ్యానికి కొలమానం కావు అంటున్నారు.వయసు తక్కువగా కనిపించాలని తాపత్రయం తో డైటింగ్ లు వ్యాయామాలు చేసినంత మాత్రాన సౌందర్యం పెరగదు.అసలైన ఆరోగ్యం సంతోషం, క్రమశిక్షణ గల జీవిత విధానం మొదలైన వాటితో ముడిపడి ఉంటుంది.40 ఏళ్లు దాటుతుంటే,పెరిగే వయసుకు తగ్గట్టు శరీరం తనను తాను సర్దుబాట్లు చేసుకుంటుంది. ఇదే ఆరోగ్యం హాయిగా సీజనల్ స్వీట్లు తో […]
పిల్లలకు సైన్స్ శిక్షణ
సైన్స్ అంటే భయపడే విద్యార్థుల కోసం ‘క్యూరియస్’ ప్లే లాబ్స్ నెలకొల్పారు సరయు గార్గ్. భర్త ఐఏఎస్ ఆఫీసర్ అభిజిత్ తో కలిసి పిల్లల కోసం చండీగఢ్ లో ఏర్పాటు చేసిన ఈ ల్యాబ్ లో పిల్లలకు ప్రయోగాత్మకంగా పాఠాలు చెబుతారు.కార్పొరేట్ చదువులతో క్రీడలు మర్చిపోతున్న పిల్లలకు వివిధ సంస్థల సహకారంతో ఆట స్థలాలు ఆధునీకరించారు. పేద విద్యార్థులకు ఆట సామాగ్రి అందించారు చండీగఢ్ లో పుట్టి పెరిగిన సరియు ఇంజనీరింగ్ చదివారు.అభిజిత్ తో కలిసి ప్రభుత్వ […]
వెండి తెర సూపర్ ఉమెన్
ఈ సంవత్సరం ఐ ఎం డి బి టాప్ టెన్ జాబితాలో కళ్యాణి ప్రియదర్శన్ పేరు నమోదయింది. మానాడు, హృదయం, బ్రో డాడీ, లోకా చాప్టర్-1 ఆమె నటనకు ప్రేక్షకుల ఆదరాభిమానాలు దక్కాయి. న్యూయార్క్ విశ్వవిద్యాలయం లో బ్యాచిలర్ ఆఫ్ ఆర్కిటెక్చర్ చదివింది. డైరెక్టర్ సాబు సీరిల్ దగ్గర అసిస్టెంట్ ప్రొడక్షన్ డిజైనర్ గా పనిచేస్తుంది.2017లో హలో సినిమా తో వెండితెర పైన వెలిగింది కళ్యాణి. కొత్త లోకా చాప్టర్ 1 లో సూపర్ ఉమెన్ గా […]
సిద్ది కి రాష్ట్రపతి మెడల్
ఇంజనీరింగ్ చదువుకొని సైన్యంలో చేరటం లక్ష్యంగా పెట్టుకొని మిలటరీ లో అడుగు పెట్టింది సిద్ధి జైన్. ఉత్తర ప్రదేశ్ లోని ఉఝని లో జన్మించిన సిద్ధి ఎన్. డి. ఏ పరీక్ష రాసి మిలటరీ శిక్షణ తీసుకున్నారు. పాసింగ్ అవుట్ పరేడ్ లో రాష్ట్రపతి కాంస్య పథకం అందుకున్నారు.దీన్ని అందుకున్న తొలి మహిళ గా రికార్డు సృష్టించారు. అకడమిక్, ఫీల్డ్ పెర్ఫార్మెన్స్, నాయకత్వ లక్షణాలు, సేవ భావన లో ప్రతిభ చూపించి బెస్ట్ ఆల్ రౌండర్ కె […]
ఆమె అడవి కే అమ్మమ్మ
కాణి తెగకు చెందిన లక్ష్మి కుట్టి కేరళ జానపద అకాడమీలో ఉపాధ్యాయురాలు. పద్మశ్రీ అవార్డు గ్రహీత. వితుర లోని కల్లార్ అడవి ప్రాంతానికి చెందిన ఈ గిరిజన టీచర్ గారు 500 రకాల ఔషధ చికిత్సలు చేయగలరు.అడవిలో ఏ ఔషధ మొక్క ఎక్కడ ఉందో ఆమెకు కొట్టిన పిండి అందుకే లక్ష్మి కుట్టి ని వన ముతస్సి అంటే అడవికే అమ్మమ్మ అంటారు.50 ఏళ్లుగా సంప్రదాయ వైద్యం చేస్తున్న ఈమెకు 1985లో కేరళ ప్రభుత్వం నాటు వైద్య […]
ఈ డాక్టర్ హార్స్ రైడర్
కాకినాడ లో డాక్టర్ గా ఎంతో పేరున్న డాక్టర్ సువర్ణ హార్స్ రైడింగ్ శిక్షకురాలు.కళాశాల లో చదివే సమయంలో గుర్రపు స్వారీ నేర్చుకున్న సువర్ణ 2017-16 లో వివిధ గుర్రపు స్వారీ పోటీల్లో విజయం సాధించారు.గణతంత్ర దినోత్సవ వేడుకల్లో గుర్రం పై ఖడ్గం చేతిలో పట్టుకొని ప్రధాని కి సెల్యూట్ చేసే అవకాశం చేజిక్కించుకున్నారు .కాకినాడ సెవెన్ రైడింగ్ క్లబ్ లో గుర్రపు స్వారీ పాఠాలు నేర్పుతారు సువర్ణ.ఉత్తమ డాక్టర్ అవార్డు కూడా తీసుకున్నారు.
సెలబ్రిటీ కేసులతో బిజీ
రచయిత్రి, డాక్టర్, ఆర్టిస్ట్ అవ్వాలని ఎన్నో రకాల కలలతో ఉండే ప్రియాంక ఖీమాని లాయర్ అయిపోయింది. సొంతంగా లా ఫర్మ్ నెలకొల్పి బాలీవుడ్ సెలబ్రిటీ కేసులతో తీరిక లేకుండా అయిపోయారు. డిగ్రీ లో బయోటెక్నాలజీ తీసుకొని రైటర్ గా ఎన్నో స్క్రిప్ట్ లో రాసిన ప్రియాంక 2012 లో లా పూర్తి చేసి పూర్తిస్థాయి లాయర్ గా జీవితాన్ని తనే ఒక మలుపు తిప్పుకున్నారు. లతా మంగేష్కర్, సోను నిగమ్, అనురాగ్ కశ్యప్ మొదలైన బాలీవుడ్ ప్రముఖుల […]
అంతర్జాతీయ మోడల్ గా భవిత
హైదరాబాద్ కు చెందిన భవిత మండవ ఇటాలియన్ లగ్జరీ ఫ్యాషన్ బ్రాండ్ బొట్టెగా వెనెటా స్ప్రింగ్ సమ్మర్ 2025 లో మోడల్ గా మంచి పేరు సంపాదించింది. ఈ ఫ్యాషన్ లో షో లో ఓపెనింగ్ వాక్ చేసింది భవిత. ఇంటరాక్టెడ్ డిజైన్ అండ్ మీడియాలో మాస్టర్స్ చేస్తున్న భవితకు ఫ్రెంచ్ బెల్జియన్ డిజైనర్ మాథ్యూ బ్లేజీ అవకాశం ఇచ్చారు.ఈ అవకాశం ఇచ్చిన రెండు వారాల్లో న్యూయార్క్ సబ్ వే స్టేషన్ లో ఓపెనింగ్ వాక్ చేసింది […]
మహిళా శక్తికి నిదర్శనం
ఈ సంవత్సరం హరూన్ ఇండియా ఆర్ట్ లిస్ట్ 2025 జాబితాలో మహిళా శక్తి కి మకుటం లాగా నిలిచారు 85 సంవత్సరాల కళాకారిణి పద్మశ్రీ అవార్డు గ్రహీత అంజోలీ ఎలా మీనన్.గడచిన సంవత్సరంలో ఏకంగా 8.7 కోట్ల టర్నోవర్ తో ఈ జాబితాలోని మహిళల్లో అగ్రస్థానంలో ఉన్నారు. ఆమె గీసిన 32 కళాఖండాలు అమ్ముడుపోగా అందులో ఒక చిత్రం 14 కోట్లు కు అమ్ముడైంది. ఆమె చిత్రాలు చండీగఢ్ మ్యూజియం పీబోడీ ఎసెక్స్ మ్యూజియం తో సహా […]
పంచదార దుంపలు వస్తున్నాయ్
పాలకూర వంటి ఆకుల తో, చూసేందుకు ముల్లంగి లా ఉండే బీట్ షుగర్ చెరుకు లాగా చాలా తీయనిది. అమెరికా, రష్యా, ఫ్రాన్స్, పోలాండ్, జపాన్ వంటి 50 దేశాల్లో దీన్ని ప్రధాన పంటగా పండిస్తున్నారు. నాలుగు నెలల్లో చేతికి వచ్చే ఈ బీట్ షుగర్ దుంపలు 75 శాతం నీరు ఉంటుంది. ఫార్మా, కాస్మెటిక్ రంగాల్లో దుంప చక్కెర వినియోగం పెరుగుతోంది. హైదరాబాద్ లోని ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం, సంగారెడ్డి లోని బసంత పూర్ […]
