బ్రిటన్ లోని ఆక్స్‌ఫర్డ్ విశ్వవిద్యాలయం నుంచి దాదాపు రెండు కోట్ల విలువైన క్లారెండెన్ స్కాలర్‌షిప్ సాధించింది వైష్ణవి రామలింగం.న్యాయ శాస్త్ర విభాగంలో పీహెచ్‌డీ చేసేందుకు ఈ స్కాలర్‌షిప్ సాధించింది వైష్ణవి.ఆమె పూణేలోని సింబయాసిస్ లా స్కూల్ నుంచి బి ఏ ఎల్ ఎల్ బి చదివింది.తర్వాత నెదర్లాండ్స్ లోని లైడన్ విశ్వవిద్యాలయం నుంచి ఇంటర్నేషనల్ చిల్డ్రన్స్ రైట్స్ అంశంలో అడ్వాన్స్‌డ్ ఎల్‌ఎల్‌ఎం పూర్తి చేశారు.బాలల హక్కుల మీద ఆమె రాసిన మాస్టర్స్ థీసిస్ కు నెదర్లాండ్స్ లో రాయల్ హాలెండ్ సొసైటీ ఆఫ్ సైన్సెస్ అండ్ హ్యూమానిటీస్ జాన్ బ్రూవర్ థీసిస్ ప్రైజ్ 2026 లభించింది.. బాలల మానసిక వికాసానికి సమాజంలో తోటి వారితో ఉండే పరస్పర సంబంధాలు చాలా ముఖ్యమైన అంశం తో ఆమె ఈ థీసిస్ రాసింది.













